
అగ్నిప్రమాదానికి గురైన బస్సు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ సరిహద్దు నుంచి రాజధాని బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతి కాగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొంత మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున 1.25 గంటలకు వాయివ్య టాక్ ప్రావిన్స్‌లో జరిగింది.
చీకటిగా ఉండటం వల్లే గందరగోళంలో ప్రయాణికులకు బస్సులో నుంచి బయటపడటం కష్టంగా మారిందని, దానివల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. మృతులంతా మయన్మార్ వలస కార్మికులే. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి బస్సును నడిపినట్లు డ్రైవర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.