బ్యాంకాక్: థాయ్లాండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న యాత్రికుల బస్సు చియాంగ్ మెయి ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంటలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 12 మంది మలేసియాకు పర్యాటకులతో పాటు ఓ థాయ్లాండ్ గైడ్ ఉన్నాడు. క్షతగాత్రలను సమీపంలోని అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో 12 మంది యాత్రికులు మృతి
Published Sun, Dec 20 2015 3:53 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement