మంటల్లో కాలుతున్న బస్సు
అహ్మదాబాద్ : ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పి, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడగలిగారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఖేదాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం 25 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో బెంగళూరునుంచి వలసకార్మికుల బస్సు జోద్‌పూర్ బయలుదేరింది. బస్సు గుజరాత్ మాక్వాలోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వే పైకి రాగానే చిన్నపాటి మంటలు మొదలయ్యాయి. బస్సు డీజిల్ కొట్టించుకోవటానికి పెట్రోల్ బంకు దగ్గరకు రాగానే డ్రైవర్ ఆ మంటల్ని గుర్తించాడు. ( సొంత అక్క తమ్ముడిపై అనుమానం పెంచుకుని..)
డీజిల్ కొట్టించుకున్న అనంతరం బస్సు కొద్ది దూరం బయటకు రాగానే మంటలు పెద్దవయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులు దిగిపోవల్సిందిగా హెచ్చరించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది సైతం ప్రయాణికులు తొందరగా బస్సు దిగేందుకు సహాయ పడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment