
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. తాడ్‌బన్‌లోని ఒమర్ ట్రావెల్స్ పార్కింగ్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఐదు బస్సులు సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేచేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.