'పవర్' షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం?
'పవర్' షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం?
Published Mon, Jul 28 2014 4:08 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
రవితేజ నటిస్తున్న పవర్ చిత్ర షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. పవర్ చిత్ర షూటింగ్ థాయ్ లాండ్ లోని పట్టాయకు సమీపంలోని ఓ ఫారెస్ట్ లో యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలకు కోసం ఉపయోగించిన పేలుళ్లతో ఫారెస్ట్ లో మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడినట్టు తెలిసింది.
పవర్ చిత్రంలో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటిస్తుండగా, కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Advertisement
Advertisement