యువరాణి! | The princess! | Sakshi
Sakshi News home page

యువరాణి!

Published Sat, Aug 22 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

యువరాణి!

యువరాణి!

హన్సిక తెలుగు తెరపై కనిపించి చాలా కాలమైంది. చివరగా ఆమె రవితేజ సరసన ‘పవర్’ చిత్రంలో  ప్రేక్షకులను అలరించారు. తాజాగా తమిళ న టుడు విజయ్ హీరోగా రూపొందిన ‘పులి’ చిత్రంలో ఆమె ఓ కథానాయికగా నటించారు. ఇందులో హన్సిక యువరాణిగా కనిపించి, అలరించనున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
 
 ఇందులో శ్రుతీహాసన్ ఓ కథానాయిక కాగా, సీనియర్ నటి శ్రీదేవి రాజమాతగా నటించారు. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న ఎస్వీఆర్ మీడియా శోభారాణి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌లో దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, తుపాకీ వంటి భారీ చిత్రాలను అందించాం.
 
 దాదాపు 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ‘పులి’ చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో విజయ్ సూపర్ హీరో రోల్‌లో నటించారు. ఈ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement