BJP Slams Rahul Gandhi Spotted Partying in Kathmandu in a Bar - Sakshi
Sakshi News home page

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియో.. పొలిటికల్‌ రచ్చ రచ్చ

Published Tue, May 3 2022 12:24 PM | Last Updated on Tue, May 3 2022 1:15 PM

BJP Slams Rahul Gandhi Spotted Partying Kathmandu Bar - Sakshi

Rahul Gandhi Night Club Video:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్‌ వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. నైట్‌పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ కాంగ్రెస్‌ నేతపై విరుచుకుపడుతోంది. వ్యక్తిగత టూర్‌ అయినప్పటికీ.. వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు.

నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ కనిపించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్‌ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్‌ నేతపై, ఆ పార్టీ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. తన జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ అయిన సుమ్నీమా ఉదాస్‌ వివాహ వేడుక కోసం నిన్న(సోమవారం) రాహుల్‌ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్‌ హోటల్‌లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్‌ ఉదాస్‌ ధృవీకరించారు. భూమ్‌ ఉదాస్‌.. మయన్మార్‌లో నేపాల్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.


ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్‌ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్‌ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్‌ ‘దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు’’ అంటూ  తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్‌ నేపాల్‌ టూర్‌పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఆయుధంగా చేసుకుంది. 

హానీ ట్రాప్‌.. విమర్శలు
దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్‌ గాంధీ ఓ మహిళతో క్లోజ్‌గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్‌ ప్రధానిపైనా హనీ ట్రాప్‌ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్‌ నుంచి వివరణ రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ను ముంచుతూ.. యువరాజు విలాసాల్లో తేలుతున్నాడంటూ పలువురు సెటైర్లు సైతం పేలుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement