khatmandu
-
నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
ఖాట్మాండ్: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా పంచుకున్నారు. చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేపాల్ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్లో పాల్గోని మాట్లాడారు. ‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్ నేర్చుకోవటంలో భాగంగా అసైన్‌మెంట్‌కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్‌ను బతిమాలాడాను. అయినా టీచర్ వినలేదు.బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. -
నేపాల్ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య
ఖాట్మాండు: నేపాల్ పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 140 మృతదేహాల్ని వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్, జజర్‌కోట్‌లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదీ చదవండి: భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం? నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగగా.. భూకంప బాధిత ప్రాంతాలల్లో ప్రధాని పుష్ప కమల్ పర్యటించనున్నట్లు సమాచారం. క్షతగ్రాతుల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. More then 128 people died and above 500 were injured after a strong 6.4 magnitude earthquake in Nepal... #Nepal #NepalEarthquake #earthquakenepal #earthquake #BREAKING_NEWS #latestnews #NepalNews #Jajarkot #Kathmandu pic.twitter.com/6c4MILmvaY — Vikas Bailwal (@VikasBailwal4) November 4, 2023 Tragedy strikes again in #Nepal . A powerful 6.4-magnitude earthquake claims 129 lives, above 500 reported injured shaking northwestern districts. Prayers for #Nepal 🙏🙏 #NepalEarthquake #earthquake pic.twitter.com/6rjl3A3vm3 — Stranger (@amarDgreat) November 4, 2023 नेपाल के जजरकोट में कल रात आए भूकंप से के कारण काफी नुकसान हुआ। तबाही की तस्वीरें...#earthquakes #NepalEarthquake pic.twitter.com/lKWK5nxg7x — Kuldeep Raghav 🇮🇳 (@ImKuldeepRaghav) November 4, 2023 రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ.. మృతదేహాలు అక్కడ మరిన్ని బయటపడుతున్నాయి. నిన్న రాత్రి భూకంపం సంభవించడంతో సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపాలు సహజమే! భూకంపాల జోన్లో ఉన్న హిమాలయా దేశం నేపాల్‌లో ప్రకంపనలు సర్వసాధారణమే. తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించినప్పటికీ.. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి అక్కడ. ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. గత నెలవ్యవధిలోనే మూడు భూకంపాలు(పెద్దగా నష్టం వాటిల్లలేదు) సంభవించాయక్కడ. అక్టోబర్ 3వ తేదీన రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంపైనా ప్రభావం చూపించింది. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో దోతీ జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆరుగురిని బలిగొంది. అయితే.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం నేపాల్ చరిత్రలోనే పెను విషాదాన్నే మిగిల్చింది. నాటి భూకంపంలో 12 వేల మందికి పైగా మరణించగా.. పదిలక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇదీ చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. భారత ప్రధాని దిగ్భ్రాంతి నేపాల్ భారీ భూకంపం, భారీగా ప్రాణ నష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేపాల్‌లో భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు యావత్ భారతదేశం సంఘీభావం ప్రకటిస్తోంది. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda — Narendra Modi (@narendramodi) November 4, 2023 ఇవీ కూడా చదవండి: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక! నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? -
నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం..68 మంది మృత్యువాత
ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయంలో రన్‌వేపై విమానం కులిపోయింది. కాగా, విమానంలో నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. నేపాల్ ఆర్మీ.. ఇప్పటి వరకు 68 మంది ప్రయాణికుల డెడ్‌బాడీలను బయటకు తీశారు. ఇందులో ఐదుగురు భారతీయులున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F — ANI (@ANI) January 15, 2023 #Watch: Aircraft with 68 passenger crashes on the runway at Pokhara International Airport in #Nepal. Rescue operations are underway and the airport is closed for the time being.#TYPNews pic.twitter.com/Fdpk2zqCKj — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) January 15, 2023 -
అత్యాచార ఆరోపణలు.. స్టార్ క్రికెటర్ అరెస్ట్
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులు పాటు ఆగంతంలో ఉన్న లామిచానే గురువారం నెపాల్‌కు తిరిగి వచ్చాడు. అయితే నెపాల్‌లో అడుగు పెట్టిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండు జిల్లా పోలీసు ప్రతినిధి దినేష్ రాజ్ మైనాలి దృవీకరించారు. అంతుకుముందు లామిచానే తనపై చేసిన ఆరోపణలపై పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో 17 ఏళ్ల మైనర్ బాలిక సందీప్‌పై అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీస్‌లు ఆతడిపై కేసు నమోదు చేశారు. ఇక సెప్టెంబర్ 8న నేపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అతడు జమైకాలో ఉన్నాడు. అయితే లామిచానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా జమైకాలో ఉండిపోయాడు. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. చదవండి: Rahkeem Cornwall: వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ -
అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?...
ఖట్మండు: నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. విమర్శలు
Rahul Gandhi Night Club Video:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్ వీడియో ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపుతోంది. నైట్‌పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ కాంగ్రెస్ నేతపై విరుచుకుపడుతోంది. వ్యక్తిగత టూర్ అయినప్పటికీ.. వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇన్చార్జి అమిత్ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతపై, ఆ పార్టీ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం నిన్న(సోమవారం) రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్ హోటల్లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్ ఉదాస్ ధృవీకరించారు. భూమ్ ఉదాస్.. మయన్మార్‌లో నేపాల్ అంబాసిడర్‌గా ఉన్నారు. Noiiice 😎 pic.twitter.com/jTvUyVuE7A — Ajit Datta (@ajitdatta) May 3, 2022 ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ ‘దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్ నేపాల్ టూర్‌పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఆయుధంగా చేసుకుంది. Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent. Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate... pic.twitter.com/dW9t07YkzC — Amit Malviya (@amitmalviya) May 3, 2022 హానీ ట్రాప్.. విమర్శలు దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్ గాంధీ ఓ మహిళతో క్లోజ్‌గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్ నుంచి వివరణ రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ను ముంచుతూ.. యువరాజు విలాసాల్లో తేలుతున్నాడంటూ పలువురు సెటైర్లు సైతం పేలుస్తున్నారు. -
నేపాల్: తదుపరి ప్రధాని షేర్ బహదూర్ దుబా?
ఖాట్మండూ: ఓలి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతోంది. దీనికోసం మంగళవారం నేపాలీ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు భేటీ అయ్యారు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్సీ అధ్యక్షుడు షేర్‌బహదూర్ దుబాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పుష్ప కమల్ ప్రంచండ నేతృత్వంలోని సీపీఎన్ మావోయిస్టు సెంటర్ మద్దతు తెలపగా, సమాజ్‌వాదీ పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించింది. గతంలో ప్రధానిగా చేయని కొత్త వ్యక్తిని ప్రధానిగా చేయాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మూడు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సందిగ్దత కొనసాగుతోంది. ఒకవేళ ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నేపాల్ రాజ్యాంగం ప్రకారం.. అతిపెద్ద పార్టీకి చెందిన నాయకున్ని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆయన 30 రోజుల్లోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. అదే జరిగితే ఓలి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. (చదవండి: KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి) (చదవండి: సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య) -
ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!
ఖట్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పైకి 24వ సారి అధిరోహించిన కమి రిట షేర్పా(50) తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మే 15వ తేదీన భారత బృందానికి గైడ్‌గా వ్యవహరించి 23వ పర్యాయం ఎవరెస్ట్‌పైకి ఎక్కారు. తాజాగా తాజాగా భారత పోలీసు బృందానికి గైడ్‌గా వ్యవహరిస్తున్న ఈ నేపాలీయుడు.. మంగళవారం ఉదయం 6.38 గంటలకు ఎవరెస్ట్ పైకి చేరుకోగలిగారని ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’ సంస్థ చైర్మన్ మింగ్మా షేర్పా వెల్లడించారు. దీంతో 8,848 మీటర్ల అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా కమి రిట రికార్డుల్లోకెక్కారు. 1994 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్న కమి రిట 25 పర్యాయాలు అక్కడికి వెళ్లాలని ధ్యేయంగా పెట్టుకున్నారని మింగ్మా తెలిపారు. -
లోయలో పడ్డ బస్సు... 23 మంది విద్యార్థులు మృతి
ఖాట్మాండ్ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్‌లోని సేన్‌చుక్ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజధానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్రీ గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బస్సు 700 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో నేపాల్ జరిగిన రెండో ప్రమాదం ఇది. డిసెంబరు 15న ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
ఖాట్మాండ్: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్ సమీపంలోని నువాకోట్ జిల్లాలో శనివారం ఈ ప్రయాదం జరిగింది. గాయపడ్డ వారిని సెంట్రల్ నేపాల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 100 మీటర్ల లోయలో పడిపోవడంతో ఈప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 20 మృత దేహాలను వెలికితీసినట్లు పోలీస్ అధికారి గయాన్‌లాల్ యాదవ్ తెలిపారు. ట్రక్కులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే వాహనం అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు. -
విమాన ప్రమాదం : ఎయిర్పోర్ట్ క్లోజ్
ఖట్మాండ్ : నేపాల్ రాజధాని ఖట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్ఆఫ్ అవబోతోన్న ఓ మలేషియన్ జెట్ రన్‌వేపై జారీపోవడంతో, విమానశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కానీ నేపాలి రాజధానికి రాబోతోన్న విమానాలన్నింటిన్నీ వేరే వైపుకు మరలిస్తున్నారు. రన్‌వేపై జారీపోయిన మలేషియన్‌కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 గా అధికారులు పేర్కొన్నారు. రన్‌వేకు 30 మీటర్ల దూరంలో గట్టిలోకి జారిపోయి, మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది. విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి ప్రేమ్ నాథ్ థాకూర్ చెప్పారు. విమానం ఇలా ప్రమాదానికి గురికావడానికి కారణలేమిటన్నది? ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్ తెలిపారు. గత నెల క్రితం కూడా అమెరికా-బంగ్లా ఎయిర్వేస్ ఖట్మాండ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. 2015లో మార్చిలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ జెట్ కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌ను 4 రోజులు మూసివేశారు. నేపాల్‌లో ఎయిర్ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్ ఎయిర్‌స్పేస్‌లో నేపాల్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు. -
నేపాల్ కొత్త స్పీకర్‌గా మహారా
ఖాట్మాండు : నేపాల్ పార్లమెంట్ కొత్త స్పీకర్‌గా సీపీఎన్ మావోయిస్టు సెంటర్ నేత కృష్ణ బహదూర్ మహారా శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయనొక్కరే పోటీ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నిర్వహించబోయే ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఈ ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, మహారా అభ్యర్ధిత్వాన్ని సీపీఎన్-యూఎమ్ఎల్ శాసన సభ్యులు సుభాష్ చంద్ర నేమాంగ్, సీపీఎం లీడర్ దేవ్ గురుంగ్ ప్రతిపాదించి సమర్థించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాల్ కాంగ్రెస్ తమ తరపున అభ్యర్ధిని బరిలో నిలుపలేదు. మహారాకు గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. -
హోలి సంబరాల్లో పాల్గొన్న బైకర్స్ అరెస్ట్..
ఖాట్మాండు: నేపాల్‌లో 1,295 మంది ద్విచక్ర వాహనదారుల(బైకర్స్)ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. హోలి సంబరాల్లో పాల్గొన్న యువకులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో అదుపులోకి తీసుకున్నామని ఖాట్మాండు పోలీసులు తెలిపారు. 694 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసామని, 596 మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా హెల్మెట్ లేకుండా, అతివేగంతో బైక్‌లు నడిపారని పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం సేవించారని, మరికొంత మంది అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులు రావడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. హోలి సందర్భంగా 61 చెక్ పాయింట్లు పెట్టామని, ఖట్మాండు, భాక్తపూర్, లలీత్పూర్ జిల్లాల్లో ఈ అరెస్టులు చేశామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నేపాల్‌లో హోలిని రెండు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా భారత్ సరిహద్దు టెరై లోయ ప్రాంతాల్లో జరుపుకోవడానికి యువతి,యువకులు ఉత్సాహం చూపిస్తారు. -
నేపాల్ ఇప్పుడు ఓ శిథిల రాజ్యంil