అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులు పాటు ఆగంతంలో ఉన్న లామిచానే గురువారం నెపాల్‌కు తిరిగి వచ్చాడు. అయితే నెపాల్‌లో అడుగు పెట్టిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండు జిల్లా పోలీసు ప్రతినిధి దినేష్ రాజ్ మైనాలి దృవీకరించారు.
అంతుకుముందు లామిచానే తనపై చేసిన ఆరోపణలపై పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో 17 ఏళ్ల మైనర్ బాలిక సందీప్‌పై అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీస్‌లు ఆతడిపై కేసు నమోదు చేశారు.
ఇక సెప్టెంబర్ 8న నేపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అతడు జమైకాలో ఉన్నాడు. అయితే లామిచానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా జమైకాలో ఉండిపోయాడు. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది.
చదవండి: Rahkeem Cornwall: వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment