Nepal Police
-
అత్యాచార ఆరోపణలు.. స్టార్ క్రికెటర్ అరెస్ట్
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులు పాటు ఆగంతంలో ఉన్న లామిచానే గురువారం నెపాల్‌కు తిరిగి వచ్చాడు. అయితే నెపాల్‌లో అడుగు పెట్టిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండు జిల్లా పోలీసు ప్రతినిధి దినేష్ రాజ్ మైనాలి దృవీకరించారు. అంతుకుముందు లామిచానే తనపై చేసిన ఆరోపణలపై పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో 17 ఏళ్ల మైనర్ బాలిక సందీప్‌పై అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీస్‌లు ఆతడిపై కేసు నమోదు చేశారు. ఇక సెప్టెంబర్ 8న నేపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అతడు జమైకాలో ఉన్నాడు. అయితే లామిచానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా జమైకాలో ఉండిపోయాడు. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. చదవండి: Rahkeem Cornwall: వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ -
స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చానేను ఆచూకీ కనుగొనడం కోసం నేపాల్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. నేపాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ లమిచ్చానేపై నేపాల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. కాగా అప్పటికే సందీప్ లమిచ్చానే కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు జమైకా వెళ్లాడు. కాగా సీపీఎల్‌లో జమైకా తలైవాస్‌కు ఆడుతున్న సందీప్ లమిచ్చానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు సందీప్ అరెస్ట్ విషయంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. అతని ఆచూకీ కోసం సభ్య దేశాల సహకారం కోరుతూ ఇంటర్‌పోల్ ఆదివారం అతనిపై "డిఫ్యూజన్" నోటీసు జారీ చేసిందని నేపాలీ పోలీసు ప్రతినిధి టెక్ ప్రసాద్ రాయ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇంటర్‌పోల్ సహకారం వల్ల సందీప్ లమిచ్చానే అరెస్ట్ చేయగలమన్న నమ్మకం ఉంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని విచారిస్తే గానీ అసలు నిజం బయటపడదు. అని నేపాల్ పోలీసు ప్రతినిధి తెలిపాడు. అయితే లమిచ్చానే మాత్రం..'' తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి నాపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానంటూ'' ఆదివారం సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం. కాగా సందీప్ లమిచ్చానే నేపాల్ జట్టు తరపున స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్ 30 వన్డేల్లో 69 వికెట్లె, 44 టి20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. కాగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో సందీప్ లమిచ్చానే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇంకో విషయమేంటంటే.. గతేడాది నేపాల్‌లో 2,300 రేప్ కేసులు నమోదైనట్లు నేపాల్ స్థానిక సంస్థ ఒకటి తన రిపోర్టులో పేర్కొంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం -
నేపాల్‌లో నేరం.. భారత్‌లో అరెస్ట్
ఖాట్మండు : తమదేశంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం భారత్‌కు పారిపోయి వచ్చిన నిందితుడ్ని నేపాల్ పోలీసులు గురుగ్రావ్ సమీపంలో అరెస్ట్ చేశారు. వివరాలు.. నేపాల్‌లోని చితావన్ జిల్లా భరత్‌పురకు చెందిన 27 ఏళ్ల రాజన్ బిక అనే వ్యక్తి తన ఈ నెల 10న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రాజన్‌పై కేసు నమోదు చేశారు. దాంతో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు రాజన్ తన భార్యతో కలిసి ఇండియాకు పారిపోయి వచ్చాడు. నేపాల్ నుంచి సునౌలి బార్డర్ మీదుగా న్యూఢిల్లీకి చేరుకున్నాడు. రాజన్ మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులకు.. అతను ఇండియాలో ఉన్నాడని తెలిసింది. దాంతో నిందుతున్ని అరెస్ట్ చేసేందుకు నేపాల్ పోలీసులు స్పెషల్ టీంను న్యూఢిల్లీ పంపించారు. పోలీసులతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు గురుగ్రావ్ సమీపంలో రాజన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని నేపాల్‌కు తీసుకెళ్లి చితావన్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. రాజన్‌ను10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
స్కూటర్ డిక్కీలో ఆరున్నర కోట్ల బంగారం
ఖాట్మాండ్: స్కూటర్లో భారీగా బంగారపు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శనివారం ఖాట్మాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖాట్మాండ్ పరిసర ప్రాంతాల్లో బంగారం అక్రమ రవాణ అధికమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో స్కూటర్ డిక్కీలో భారీగా బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 లక్షల ఉంటుందని పోలీసులు వెల్లడించారు. -
యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే
పాట్నా/న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దుల్లో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే ఉంటున్నాడు. తాను చెబితే ఏమైనా చేయగల వంద మంది ఉగ్రవాదులను సైతం తయారు చేశాడు. ఇంటరాగేషన్‌లో అతడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. భత్కల్ను, అతడి సహచరుడు అసదుల్లా అక్తర్‌ను ఎన్ఐఏ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారిని పన్నెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. భత్కల్, అక్తర్లను బుధవారం రాత్రి నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎన్ఐఏ అధికారులు, తొలుత వారిని బీహార్‌లోని మోతిహారి కోర్టులో ప్రవేశపెట్టి, మూడు రోజుల బదిలీ రిమాండ్ పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కోర్టులో గోప్యంగా జరిగిన విచారణలో నిందితుల తరఫు న్యాయవాది ఎస్.ఎం.ఖాన్, నిందితుల్లో ఒకరు మహమ్మద్ అహ్మద్ అని, అతడు యాసిన్ భత్కల్ కాదని వాదించారు. అయితే, మహమ్మద్ అహ్మద్ సిద్దిబప్ప, యాసిన్ భత్కల్ ఒక్కరేనని, అతడిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని ఎన్ఐఏ తన రిమాండ్ దరఖాస్తులో తెలిపింది. నిందితులను ఇతర రాష్ట్రాలకు తీసుకు వెళ్లేటప్పుడు వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని ఎన్ఐఏ అభ్యర్థించగా, కోర్టు అంగీకరించింది. ఉత్తర కర్ణాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ గ్రామానికి చెందిన యాసిన్ భత్కల్ దాదాపు 40 ‘ఉగ్ర’ కేసుల్లో కీలక నిందితుడు. హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పుణే, ఢిల్లీ, బెంగళూరు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ గత నెలలో ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కాగా, ఇటీవల ఈద్ పర్వదినం సందర్భంగా భత్కల్ తన భార్యకు కానుకగా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా పంపాడు. ఈ చర్య ఆధారంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతడి ఆచూకీని కనిపెట్టగలిగినట్లు సమాచారం. ఇంటరాగేషన్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయని భత్కల్, హెచ్చరిక పంపేందుకే తాను బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు చెప్పాడని సమాచారం. నేపాల్‌లో ఉన్న ఆరు నెలల్లోనూ తరచుగా ఇళ్లు మార్చేవాడినని, యునానీ వైద్యుడిగా చెప్పుకుంటూ అక్కడి ముస్లింలకు వైద్యం చేసేవాడినని చెప్పినట్లు మోతిహారి ఎస్పీ చెప్పారు. అయితే, గతనెల 7న బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో తమ పాత్ర లేదని అతడు విచారణలో చెప్పినా, అతడి పాత్ర ఉందనే తాము అనుమానిస్తున్నామని తెలిపారు.