నేపాల్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. నలుగురి మృతి | 5 Passengers Died After Nepal Helicopter Crashes In Nuwakot District, See Details | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. నలుగురి మృతి!

Published Wed, Aug 7 2024 3:36 PM | Last Updated on Wed, Aug 7 2024 4:36 PM

Nepal helicopter crashes in Nuwakot district

ఖాట్మాండు: నేపాల్‌లో హెలికాప్టర్‌ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్‌ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.  ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం.  ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో  సిగ్నల్స్‌  కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్‌లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement