Nepal cricket
-
నేపాల్‌ను చిత్తు చేసిన నెదర్లాండ్స్..
టీ20 వరల్డ్‌కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. డచ్ బౌలర్లు టామ్ ప్రింగల్, వాన్ బీక్ తలా మూడు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు వాన్‌మీకరన్, బాస్డీలీడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డచ్ బౌలర్లు నేపాల్‌ను ఏ దశలోనూ కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. నెదర్లాండ్స్ బౌలర్ల దాటికి నేపాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ పాడౌల్(35) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 107 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. డచ్ బ్యాటర్లలో మాక్స్ ఔడౌడ్(54) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్ బౌలర్లలో సోమ్‌పాల్ కామి, దీపేంద్ర సింగ్, అబినాష్ బోహరా తలా మూడు వికెట్లు పడగొట్టారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ఆసోషియేషన్ బుధవారం ప్రకటించనుంది. ఈ టోర్నీలో నేపాల్ జట్టుకు రోహిత్ పాడెల్ నాయకత్వం వహించనున్నాడు. ఎటువంటి అంచనాలకు తావనివ్వకుండా అందరూ ఊహించిన జట్టునే నేపాల్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు నేపాల్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. కాగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ అర్హత సాధించడం ఇది రెండో సారి. అంతకుముందు బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ తొలిసారి ఆడింది. ఇక నేపాల్ వరల్డ్‌కప్ జట్టులో సోంపాల్ కమీ, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.కాగా ఇటీవల నేపాల్ జట్టు అద్బుతమైన ప్రదర్శలను కనబరిస్తోంది. నేపాల్ ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఒమన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నేపాల్ వరల్డ్‌కప్ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ. -
6 బంతుల్లో ఆరు సిక్స్‌లు .. నేపాల్ బ్యాటర్ వరల్డ్ రికార్డు! వీడియో వైరల్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా దీపేంద్ర సింగ్ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్ -2024లో భాగంగా ఒమెన్ వేదికగా ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. నేపాల్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఐరీ వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న దీపేంద్ర సింగ్ 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఐరీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును ఐరీ పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్‌క్రికెట్‌లో ఎవరూ రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదలేదు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఐరీ కంటే ముందు యువరాజ్ సింగ్, కీరాన్ పొలార్డ్ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదారు. 𝗨𝗡𝗥𝗘𝗔𝗟 😵💫#NEPvQAT #ACCMensPremierCup #ACC pic.twitter.com/72Itd5INE1 — AsianCricketCouncil (@ACCMedia1) April 13, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. షాక్‌లో ఫ్యాన్స్
నేపాల్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ జ్ఞానేంద్ర మల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జ్ఞానేంద్ర మల్లా శుక్రవారం విడ్కోలు పలికాడు. నేపాల్ క్రికెట్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మల్లా.. అర్ధాంతరంగా తన కెరీర్‌ను ముగించడం అందరని షాక్‌కు గురిచేస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్లో మల్లా అడుగుపెట్టాడు. అతడి కెరీర్లో చివరగా నేపాల్ తరపున జింబాబ్వే వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆడాడు. తన కెరీర్లో 37 వన్డేలు, 45 టీ20ల్లో నేపాల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడు రెండు ఫార్మాట్లు కలిపి ఒక సెంచరీ, 9 ఫిప్టీల సాయంతో 1759 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డే క్రికెట్లో అరగేంట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన తొలి నేపాల్ క్రికెటర్ కూడా అతడే కావడం గమనార్హం. అంతేకాకుండా మల్లా నేపాల్ తరపున రెండు అండర్-19 ప్రపంచకప్‌లలో భాగమయ్యాడు. 2006,2008 అండర్-19 వరల్డ్‌కప్‌లలో మల్లా ఆడాడు. ముఖ్యంగా 2006 ఎడిషన్‌లో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో మల్లా కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మల్లా తన రిటైర్మెంట్పై స్పందిస్తూ.. 9 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన నేపాల్ క్రికెట్‌కు, అభిమానులకు దన్యవాదాలు తెలిపాడు. చదవండి: #Prithvi Shaw: ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్రా బాబు! పాపం పృథ్వీ! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానె అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సందీప్ లమిచానె ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ మూడు వికెట్లు తీశాడు. తద్వారా ఈ ఘనతను సందీప్ పేరిట లిఖించుకున్నాడు. 100 వికెట్ల మైలు రాయిని సందీప్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును సందీప్ బ్రేక్ చేశాడు. చదవండి: ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా! -
ఇది కదా క్రికెటింగ్ స్పిరిట్ అంటే.. అవకాశం దొరికినా..!
నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్ జెన్కిన్స్ మార్టిన్ (CJM) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) 2023 మార్చి 21న ప్రకటించింది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఆసిఫ్ 2022 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా ఔట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తన చర్య వల్ల జెంటిల్మెన్ గేమ్ యొక్క ప్రతిష్ఠను పెంచినందుకు గాను ఆసిఫ్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కూడా దక్కింది. Nepal's Aasif Sheikh has won a Spirit of Cricket Award for this special moment ❤️ pic.twitter.com/FrkBT1y3jC — England's Barmy Army (@TheBarmyArmy) March 20, 2023 అసలేం జరిగిందంటే.. 2022 ఫిబ్రవరిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కమల్ సింగ్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మార్క్ అదైర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదైర్ కొట్టిన షాట్ అతనికి కాళ్లకే తాకి లెగ్‌సైడ్ దిశగా వెళ్లింది. బౌలర్ బంతి కోసం పరుగు పెట్టే క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను పిచ్ మధ్యలో కింద పడిపోయాడు. మెక్‌బ్రైన్ లేచి పరుగు పూర్తి చేసే లోపు బౌలర్ బంతిని వికెట్‌కీపర్ ఆసిఫ్‌కు చేరవేయగా, అతను రనౌట్ చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు. అయితే, తమ బౌలర్ ఢీకొట్టడం వల్లనే మెక్‌బ్రైన్ కిందపడి రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడని భావించిన ఆసిఫ్.. అతన్ని రనౌట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో మెక్‌బ్రైన్ విజయవంతంగా పరుగు పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలో ఆసిఫ్ చూపిన క్రీడాస్పూర్తికి యావత్ క్రీడాప్రపంచం జేజేలు పలికింది. క్రికెట్ విశ్లేషకులు ఆసిఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ణీత ఓవరల్లో 127 చేయగా.. ఛేదనలో నేపాల్ 111 పరుగులకు మాత్రమే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమో లేదో తెలీదు, అతన్ని ఔట్ చేసుంటే మాత్రం క్రీడాస్పూర్తి అనే మాటకు అర్ధం లేకుండా పోయేది అంటూ మెచ్యూర్డ్ కామెంట్స్ చేశాడు. కాగా, సీజేఎమ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్లు, టెస్ట్ జట్ల కెప్టెన్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని మాథ్యూ వేడ్ ఔట్ అయినప్పటికీ బట్లర్ అప్పీల్ చేయకుండా వదిలిపెట్టాడు. బెన్ స్టోక్స్ విషయానికొస్తే.. పాక్‌పై సిరీస్ విక్టరీ అనంతరం స్టోక్స్.. యువ ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ట్రోఫీ అందించి క్రీడాస్పూర్తిని చాటాడు. అలాగే ఈ సిరీస్ ఆడటం ద్వారా తనకు వచ్చే పారితోషికం మొత్తాన్ని పాక్‌లో వరద బాధితులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
సందీప్ లమిచానేకు భారీ ఊరట.. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం
Sandeep Lamichhane: నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తమ ఆటగాడు సందీప్ లమిచానేకు భారీ ఊరట కలిగించింది. అతడిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న నేపాల్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2 ట్రై సిరీస్‌లో ఆడేందుకు లమిచానేకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ బ్రిటాంట్ ఖనాల్ ధ్రువీకరించాడు. అత్యాచార ఆరోపణలతో అరెస్టు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన ఖనాల్.. కోర్టు షరతులకు లోబడే ప్రస్తుతం అతడిని స్వదేశంలో సిరీస్ ఆడేందుకు అనుమతించామని పేర్కొన్నాడు. ఒకవేళ నేపాల్ జట్టు విదేశాల్లో సిరీస్ ఆడేందుకు వెళ్లాల్సి వస్తే న్యాయస్థానం చెప్పినట్లుగానే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కాగా 22 ఏళ్ల సందీప్ లమిచానే అత్యాచార ఆరోపణలతో గతేడాది సెప్టెంబరులో అరెస్టైన సంగతి తెలిసిందే. బెయిలు మంజూరు ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడికి ఇటీవలే పఠాన్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విముక్తి లభించింది. అయితే, తీర్పు వచ్చేంత వరకు దేశం వదిలివెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ మేరకు అతడిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో స్వదేశంలో నమీబియా, స్కాట్లాండ్తో జరుగనున్న ట్రై సిరీస్‌లో అతడు ఆడనున్నాడు. సుప్రీంకోర్టుకు వెళ్తాం కాగా నేపాల్ కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానే.. ఐపీఎల్ సహా బీబీఎల్, పీఎస్ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో ఆడాడు. ఇదిలా ఉంటే లమిచానేకు బెయిల్ లభించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అటార్నీ జనరల్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపినట్లు ట్రిబ్యూన్ పేర్కొంది. చదవండి: Suryakumar Yadav: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు Johnson Charles: విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం -
తీర్పు వచ్చేవరకు జ్యుడీషియల్ కస్టడీలో నేపాల్ క్రికెటర్
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్‌పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది. చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు -
అత్యాచార ఆరోపణలు.. స్టార్ క్రికెటర్ అరెస్ట్
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులు పాటు ఆగంతంలో ఉన్న లామిచానే గురువారం నెపాల్‌కు తిరిగి వచ్చాడు. అయితే నెపాల్‌లో అడుగు పెట్టిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండు జిల్లా పోలీసు ప్రతినిధి దినేష్ రాజ్ మైనాలి దృవీకరించారు. అంతుకుముందు లామిచానే తనపై చేసిన ఆరోపణలపై పోరాడేందుకు నేపాల్‌కు తిరిగి వస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో 17 ఏళ్ల మైనర్ బాలిక సందీప్‌పై అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీస్‌లు ఆతడిపై కేసు నమోదు చేశారు. ఇక సెప్టెంబర్ 8న నేపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అతడు జమైకాలో ఉన్నాడు. అయితే లామిచానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా జమైకాలో ఉండిపోయాడు. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. చదవండి: Rahkeem Cornwall: వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ -
స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చానేను ఆచూకీ కనుగొనడం కోసం నేపాల్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. నేపాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ లమిచ్చానేపై నేపాల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. కాగా అప్పటికే సందీప్ లమిచ్చానే కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు జమైకా వెళ్లాడు. కాగా సీపీఎల్‌లో జమైకా తలైవాస్‌కు ఆడుతున్న సందీప్ లమిచ్చానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు సందీప్ అరెస్ట్ విషయంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. అతని ఆచూకీ కోసం సభ్య దేశాల సహకారం కోరుతూ ఇంటర్‌పోల్ ఆదివారం అతనిపై "డిఫ్యూజన్" నోటీసు జారీ చేసిందని నేపాలీ పోలీసు ప్రతినిధి టెక్ ప్రసాద్ రాయ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇంటర్‌పోల్ సహకారం వల్ల సందీప్ లమిచ్చానే అరెస్ట్ చేయగలమన్న నమ్మకం ఉంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని విచారిస్తే గానీ అసలు నిజం బయటపడదు. అని నేపాల్ పోలీసు ప్రతినిధి తెలిపాడు. అయితే లమిచ్చానే మాత్రం..'' తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి నాపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానంటూ'' ఆదివారం సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం. కాగా సందీప్ లమిచ్చానే నేపాల్ జట్టు తరపున స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్ 30 వన్డేల్లో 69 వికెట్లె, 44 టి20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. కాగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో సందీప్ లమిచ్చానే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇంకో విషయమేంటంటే.. గతేడాది నేపాల్‌లో 2,300 రేప్ కేసులు నమోదైనట్లు నేపాల్ స్థానిక సంస్థ ఒకటి తన రిపోర్టులో పేర్కొంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం -
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు సారధి సందీప్ లామిచ్చెన్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. సందీప్ అభిమానిగా చెప్పుకునే 17 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేశారు. గౌశాల మెట్రోపాలిటిన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాట్మండుకు చెందిన మైనర్ బాలిక సందీప్ లామిచ్చెన్ ఆటకు వీరాభిమానినని చెప్పుకుంది. గత కొద్దికాలంగా సందీప్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ వస్తున్న ఆ అమ్మాయి.. నానా తంటాలు పడి తన అభిమాన క్రికెటర్ ఫోన్ నంబర్ సంపాదించింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సందీప్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుండేది. Nepal Police starts investigation over alleged rape complaint against Nepali national Cricket team Captain Sandeep Lamichhane, after a minor aged 17 lodged the case, stated Nepal Police in a statement (Photo courtesy: Sandeep Lamichhane's Twitter handle) pic.twitter.com/3HK386a6n5 — ANI (@ANI) September 7, 2022 దీన్ని ఆసరాగా తీసుకున్న సందీప్.. బాలికను పర్సనల్‌గా కలవాలని కోరాడు. ఈ క్రమంలో గత నెల (ఆగస్ట్) 21న వీరిద్దరు ఓ హోటల్ గదిలో కలిశారు. ఆ సమయంలో సందీప్ రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ అమ్మాయి తెలిపింది. మైనర్ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. గతేడాదే నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సందీప్.. ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్నాడు. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన సందీప్.. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..! -
ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్
క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం గొప్ప.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు అరుదైన ఫీట్.. మరి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే అద్భుతం అనాల్సిందే. అందుకే అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు.. మరి ఆ అద్బుతాన్ని సాధించింది ఎవరంటే మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్. నిజానికి వీరన్‌దీప్ సింగ్ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల క్లబ్లో జాయిన్ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం. నేపాల్ ప్రొ కప్ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవెన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగింది. వీరన్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రాకముందు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్ తొలి బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్ సింగ్ హ్యట్రిక్ నమోదు చేయడం విశేషం. హ్యాట్రిక్ సాధించిన తర్వాత వీరన్ షాహిద్ అఫ్రిది సెలబ్రేషన్‌ను గుర్తు చేశాడు. మొత్తానికి వీరన్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్ స్లిప్ క్యాచ్, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్ రూపంలో సాధించాడు. 2⃣0⃣th Over 6⃣ Balls 6⃣ Wickets 4⃣ in 4⃣ from the final 4 for the bowler 1⃣ Run Out Unbelievable stuff from @Viran23 for the @MalaysiaCricket XI here in Bhairahawa, Nepal! Surely the first time in Cricket History there's been 6 Wickets in 6 Balls!?? pic.twitter.com/pVIsdlyEwt — Andrew Leonard (@CricketBadge) April 12, 2022 -
బంగారం లాంటి అవకాశం వదిలేశాడు..
క్రికెట్లో క్రీడాస్పూర్తి చాలా తక్కువగా కనిపిస్తుంది. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనది తప్పు అని తేలితే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకుంటే దానిని క్రీడాస్పూర్తి అనొచ్చు. తాజాగా నేపాల్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేపాల్ బౌలర్ కమల్ సింగ్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మార్క్ అడైర్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. చదవండి: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి బంతి ఎక్కువ దూరం పోనప్పటికి సింగిల్ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో మార్క్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌కు కాల్ ఇచ్చాడు. అయితే బంతి కోసం పరిగెడుతూ ఆండీ మెక్‌బ్రైన్‌ను కింద పడేసుకుంటూ వెళ్లాడు. బంతిని అందుకున్న కమల్.. కీపర్ ఆసిఫ్ షేక్‌కు త్రో విసిరాడు. ఔట్ చేసే అవకాశం వచ్చినప్పటికి ఆసిఫ్ బెయిల్స్‌ను పడగొట్టకుండా క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఈలోగా ఆండీ మెక్‌బ్రైన్ సురక్షితంగా క్రీజులోకి చేరాడు. దీంతో ఆసిఫ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు నేపాల్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: ‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’ 🏏 Spirit of cricket 🤝 Drop a ‘♥️’ below to show your appreciation for this golden gesture! 📺 Tune in to #FanCode and never miss moments like this again 👉 https://t.co/ccITeVbFiv@cricketireland @CricketNep pic.twitter.com/b4vzDyyyNU — FanCode (@FanCode) February 14, 2022 -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా సందీప్ లమిచ్చానే
Sandeep Lamichhane As ICC Mens Palyer Of Month.. సెప్టెంబర్ నెలకు గానూ ప్రతిష్టాత్మక మెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచ్చానే సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన హెథర్ నైట్ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. కాగా లమిచ్చానేకు బంగ్లాదేశ్ బౌలర్ నసూమ్ అహ్మద్, యూఎస్ఏ బ్యాటర్ జస్క్రన్ మల్హోత్రాలతో గట్టిపోటీ ఎదురైంది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో చేసిన ప్రదర్శన ఆధారంగానే సందీప్ లమిచ్చానే ఈ అవార్డుకు ఎంపికయ్యడంటూ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఐసీసీ ఓటింగ్ అకాడమీ మెంబర్ జేపీ డుమిని పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021: మూడో స్థానం అంటే చాలా ఇష్టం.. అవకాశమొస్తే హెథర్ నైట్, ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ ఆ టోర్నమెంట్లో 6 వన్డేలాడిన లమిచ్చానే 3.17 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఒమన్, పపువా న్యూజినియాతో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పపువా న్యూ జినియాతో మ్యాచ్‌ల్లో 4/35, 6/11 నమోదు చేసిన లమిచ్చానే ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/18తో మెరిశాడు. కాగా లమిచ్చానే గతంలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక నేపాల్ తరపున 16 వన్డేల్లో 41 వికెట్లు.. 26 టి20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇక వుమెన్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న హెథర్ నైట్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1తో గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 214 పరుగులు చేసిన నైట్ బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. చదవండి: T20WC IND Vs PAK: తప్పులు తక్కువ చేసిన జట్టుదే విజయం -
60 బంతుల్లో సెంచరీ; ఒంటిచేత్తో సూపర్ క్యాచ్.. అయినా ఓడిపోయింది
దుబాయ్: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్‌లో(సీడబ్య్లూసీ) భాగంగా నేపాల్, ఒమన్, యూఎస్ఏల మధ్య ట్రై సిరీస్ జరుగుతుంది. కాగా నేపాల్, ఒమన్‌ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు రోహిత్ పౌడెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్ వద్ద ఒమన్ బ్యాట్స్‌మన్ జతీంధర్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను పౌడెల్ బౌండరీ రోప్‌కు తగలకుండా ఎగిరి ఒంటిచేత్తో తీసుకున్నాడు. అనంతరం బంతిని విసిరేసి బౌండరీ లైన్ ఇవతలకు వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న జతీంధర్ అవుట్ కావడంతో నేపాల్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. చదవండి: CPL 2021: వికెట్ తీశానన్న ఆనందం.. బౌలర్ వింత ప్రవర్తన ఒమన్ బ్యాట్స్‌మన్ జతీంధర్ సింగ్(62 బంతుల్లో 102 పరుగులు) ఈ మ్యాచ్‌లో ఒమన్ ఘన విజయాన్ని అందుకుంది. నేపాల్ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 31.1 ఓవర్లలోనే చేధించింది. ఒమన్ ఓపెనర్ జతీంధర్ సింగ్ 62 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని సత్తా చాటాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. ఓవరాల్‌గా 107 పరుగులు చేసిన జతీంధర్ రోహిత్ పౌడేలా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికే లక్ష్యాని చేరువ కావడంతో మహ్మద్ నదీమ్ 38 నాటౌట్ మిగతా పనిని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు నేపాల్ జట్టు 47.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (90 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఒమన్ బౌలర్లలో బిలాయ్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. నెస్టర్ దాంబా రెండు వికెట్లు తీశాడు. చదవండి: IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా! Simply ridiculous from Nepal's Rohit Paudel 🤯 Watch the Men’s CWC League 2 match live on https://t.co/CPDKNxoJ9v and @FanCode (in the sub-continent) 📺 pic.twitter.com/m6ZxYIPiya — ICC (@ICC) September 15, 2021 -
ఒక్క బంతి జాతీయ జట్టులోకి తీసుకునేలా చేసింది
ఖాట్మండు: నేపాలీ క్రికెటర్ గుల్షన్ ఝా ఇప్పుడు అక్కడ ఒక సంచలనం. అతను వేసిన ఒక్క బంతి సెలక్టర్లను ఇంప్రెస్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఒక ట్రై సిరీస్‌కు జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. విషయంలోకి వెళితే.. గుల్షన్ ఝా నేపాల్ పోలీస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుల్షన్ ఝా ఒక అద్బుత బంతితో మెరిశాడు. స్వతహాగా ఫాస్ట్ బౌలర్ అయిన గుల్షన్ వేసిన బంతి బులెట్ వేగంతో బ్యాట్స్‌మన్ పక్కనుంచి దూసుకెళ్లింది. హెల్మెట్ లేకపోయుంటే మాత్రం బ్యాట్స్‌మన్ ముఖం పచ్చలయ్యేది. హెల్మెట్ ఎడ్జ్ తీసుకుంటూ వెళ్లిన ఆ బంతి 98 కీమీ స్పీడుగా నమోదైంది. అతని వేసిన బౌన్సర్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఓవరాల్‌గా గుల్షన్ ఝా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. ఒక ఆటగాడిని అతను వేసే ఒక బంతి.. ఒక ఇన్నింగ్స్.. వెలుగులోకి తీసుకొస్తాయని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు గుల్షన్ ఝా విషయంలో అదే నిజమైంది. ఒమన్, అమెరికా జట్లతో సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగునున్న ట్రై సిరీస్‌కు నేపాల్ జట్టులోకి గుల్షన్ ఎంపికయ్యాడు. తాజాగా గుల్షన్ వేసిన బంతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా Hundred Mens 2021:ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే టైటిల్ Gulshan Jha New Recruit of Team Nepal for #CWCL2 & the series with PNG.@sourabhsanyal @Bibhu237@vmanjunath @Arnavv43 @arunbudhathoki @TheBiddhut @Fancricket12 #KTMMayorsCup pic.twitter.com/xdQj7sfuuW — Poudel Sagar (@poudelsagar__) August 21, 2021 -
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్
మెల్బోర్న్: మైదానంలో బంతి తగిలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్కు నేపాల్ క్రికెట్ సంఘం (సీఏఎన్) ఘనంగా నివాళి అర్పించనుంది. హ్యూస్ ఆడిన ఏదైనా ఒక బ్యాట్, అతని క్రికెట్ దుస్తులను తమకు ఇస్తే వాటిని ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుస్తామని సీఏఎన్... ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)కు లేఖ రాసింది. దీనికి సీఏ స్పందించింది. మార్చి-ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కే సీజన్ సమయానికి సీఏ అధికారులు హ్యూస్ బ్యాట్‌ను నేపాల్‌కు పంపుతారు. కామెంటేటర్‌గా ఆకట్టుకున్న క్లార్క్ గాయం కారణంగా క్రికెట్ కెరీర్ సందేహంలో పడినా... ఆస్ట్రేలియా స్టార్ మైకేల్ క్లార్క్ కొత్త కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియాల మూడో టెస్టు తొలి రోజున కామెంటేటర్ అవతారం ఎత్తిన క్లార్క్ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు షమీ, ఉమేశ్‌లను క్లార్క్ కామెంటరీలో ప్రశంసించాడు.