
నేపాల్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ జ్ఞానేంద్ర మల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జ్ఞానేంద్ర మల్లా శుక్రవారం విడ్కోలు పలికాడు. నేపాల్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మల్లా.. అర్ధాంతరంగా తన కెరీర్‌ను ముగించడం అందరని షాక్‌కు గురిచేస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో మల్లా అడుగుపెట్టాడు.
అతడి కెరీర్‌లో చివరగా నేపాల్ తరపున జింబాబ్వే వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆడాడు. తన కెరీర్‌లో 37 వన్డేలు, 45 టీ20ల్లో నేపాల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడు రెండు ఫార్మాట్‌లు కలిపి ఒక సెంచరీ, 9 ఫిప్టీల సాయంతో 1759 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డే క్రికెట్‌లో అరగేంట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన తొలి నేపాల్ క్రికెటర్ కూడా అతడే కావడం గమనార్హం.
అంతేకాకుండా మల్లా నేపాల్ తరపున రెండు అండర్-19 ప్రపంచకప్‌లలో భాగమయ్యాడు. 2006,2008 అండర్-19 వరల్డ్‌కప్‌లలో మల్లా ఆడాడు. ముఖ్యంగా 2006 ఎడిషన్‌లో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో మల్లా కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మల్లా తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. 9 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన నేపాల్ క్రికెట్‌కు, అభిమానులకు దన్యవాదాలు తెలిపాడు.
చదవండి: #Prithvi Shaw: ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్‌రా బాబు! పాపం పృథ్వీ! వీడియో వైరల్