టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నేపాల్ క్రికెట్ ఆసోషియేషన్ బుధవారం ప్రకటించనుంది. ఈ టోర్నీలో నేపాల్ జట్టుకు రోహిత్ పాడెల్ నాయకత్వం వహించనున్నాడు.
ఎటువంటి అంచనాలకు తావనివ్వకుండా అందరూ ఊహించిన జట్టునే నేపాల్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు నేపాల్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.
కాగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ అర్హత సాధించడం ఇది రెండో సారి. అంతకుముందు బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ తొలిసారి ఆడింది. ఇక నేపాల్ వరల్డ్‌కప్ జట్టులో సోంపాల్ కమీ, దీపేంద్ర సింగ్ ఐరీ, కరణ్ కెసి వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
కాగా ఇటీవల నేపాల్ జట్టు అద్బుతమైన ప్రదర్శలను కనబరిస్తోంది. నేపాల్ ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.
ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఒమన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
నేపాల్ వరల్డ్‌కప్ జట్టు
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.
Comments
Please login to add a commentAdd a comment