6 బంతుల్లో ఆరు సిక్స్‌లు .. నేపాల్‌ బ్యాటర్‌ వరల్డ్‌ రికార్డు! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

6 బంతుల్లో ఆరు సిక్స్‌లు .. నేపాల్‌ బ్యాటర్‌ వరల్డ్‌ రికార్డు! వీడియో వైరల్‌

Published Sat, Apr 13 2024 8:07 PM

Dipendra Singh Airee Emulates Yuvraj Singh, Achieves Historic First - Sakshi

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నేపాల్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్ ఐరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన  తొలి క్రికెటర్‌గా దీపేంద్ర సింగ్ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్ -2024లో భాగంగా ఒమెన్‌ వేదికగా ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌  20 ఓవర్‌ వేసిన ఖతార్‌ బౌలర్‌ కమ్రాన్ ఖాన్‌ బౌలింగ్‌లో ఐరీ వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న దీపేంద్ర సింగ్ 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు.

కాగా అంతకుముందు ఏషియన్‌ గేమ్స్‌-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఐరీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా ఈ వరల్డ్‌ రికార్డును ఐరీ పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్‌క్రికెట్‌లో ఎవరూ రెండు సార్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదలేదు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఐరీ కంటే ముందు యువరాజ్‌ సింగ్‌, కీరాన్‌ పొలార్డ్‌ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదారు.

Advertisement
 
Advertisement
 
Advertisement