ఖాట్మండు: నేపాలీ క్రికెటర్ గుల్షన్ ఝా ఇప్పుడు అక్కడ ఒక సంచలనం. అతను వేసిన ఒక్క బంతి సెలక్టర్లను ఇంప్రెస్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఒక ట్రై సిరీస్‌కు జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. విషయంలోకి వెళితే.. గుల్షన్ ఝా నేపాల్ పోలీస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుల్షన్ ఝా ఒక అద్బుత బంతితో మెరిశాడు.
స్వతహాగా ఫాస్ట్ బౌలర్ అయిన గుల్షన్ వేసిన బంతి బులెట్ వేగంతో బ్యాట్స్‌మన్ పక్కనుంచి దూసుకెళ్లింది. హెల్మెట్ లేకపోయుంటే మాత్రం బ్యాట్స్‌మన్ ముఖం పచ్చలయ్యేది. హెల్మెట్ ఎడ్జ్ తీసుకుంటూ వెళ్లిన ఆ బంతి 98 కీమీ స్పీడుగా నమోదైంది. అతని వేసిన బౌన్సర్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఓవరాల్‌గా గుల్షన్ ఝా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు.
ఒక ఆటగాడిని అతను వేసే ఒక బంతి.. ఒక ఇన్నింగ్స్.. వెలుగులోకి తీసుకొస్తాయని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు గుల్షన్ ఝా విషయంలో అదే నిజమైంది. ఒమన్, అమెరికా జట్లతో సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగునున్న ట్రై సిరీస్‌కు నేపాల్ జట్టులోకి గుల్షన్ ఎంపికయ్యాడు. తాజాగా గుల్షన్ వేసిన బంతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా
Hundred Mens 2021:ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్‌దే టైటిల్
Gulshan Jha
— Poudel Sagar (@poudelsagar__) August 21, 2021
New Recruit of Team Nepal for #CWCL2 & the series with PNG.@sourabhsanyal @Bibhu237@vmanjunath @Arnavv43 @arunbudhathoki @TheBiddhut @Fancricket12 #KTMMayorsCup pic.twitter.com/xdQj7sfuuW
Comments
Please login to add a commentAdd a comment