హోలి సంబరాల్లో పాల్గొన్న బైకర్స్ అరెస్ట్..
హోలి సంబరాల్లో పాల్గొన్న బైకర్స్ అరెస్ట్..
Published Sun, Mar 12 2017 9:17 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
ఖాట్మాండు: నేపాల్లో 1,295 మంది ద్విచక్ర వాహనదారుల(బైకర్స్)ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. హోలి సంబరాల్లో పాల్గొన్న యువకులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో అదుపులోకి తీసుకున్నామని ఖాట్మాండు పోలీసులు తెలిపారు. 694 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసామని, 596 మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా హెల్మెట్ లేకుండా, అతివేగంతో బైక్‌లు నడిపారని పోలీసులు పేర్కొన్నారు.
కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం సేవించారని, మరికొంత మంది అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులు రావడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. హోలి సందర్భంగా 61 చెక్ పాయింట్లు పెట్టామని, ఖట్మాండు, భాక్తపూర్, లలీత్‌పూర్ జిల్లాల్లో ఈ అరెస్టులు చేశామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నేపాల్లో హోలిని రెండు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా భారత్ సరిహద్దు టెరై లోయ ప్రాంతాల్లో జరుపుకోవడానికి యువతి,యువకులు ఉత్సాహం చూపిస్తారు.
Advertisement
Advertisement