విమాన ప్రమాదం : ఎయిర్‌పోర్ట్‌ క్లోజ్‌ | Kathmandu Airport Closed After Jet Skids Off Runway | Sakshi
Sakshi News home page

రన్‌వేపై జారిపోయిన విమానం, ఎయిర్‌పోర్టు క్లోజ్‌

Published Fri, Apr 20 2018 3:00 PM | Last Updated on Fri, Apr 20 2018 3:00 PM

Kathmandu Airport Closed After Jet Skids Off Runway - Sakshi

ఖట్మాండ్‌ : నేపాల్‌ రాజధాని ఖట్మాండ్‌లోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్‌ఆఫ్‌ అవబోతోన్న ఓ మలేషియన్‌ జెట్‌ రన్‌వేపై జారీపోవడంతో, విమానశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కానీ నేపాలి రాజధానికి రాబోతోన్న విమానాలన్నింటిన్నీ వేరే వైపుకు మరలిస్తున్నారు. రన్‌వేపై జారీపోయిన మలేషియన్‌కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 737 గా అధికారులు పేర్కొన్నారు. రన్‌వేకు 30 మీటర్ల దూరంలో గట్టిలోకి జారిపోయి, మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది. 

విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి ప్రేమ్‌ నాథ్‌ థాకూర్‌ చెప్పారు.  విమానం ఇలా ప్రమాదానికి గురికావడానికి కారణలేమిటన్నది? ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్‌ తెలిపారు.  గత నెల క్రితం కూడా అమెరికా-బంగ్లా ఎయిర్‌వేస్‌ ఖట్మాండ్‌ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. 2015లో మార్చిలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ జెట్‌ కూడా ల్యాండ్‌ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్‌ ఎయిర్‌పోర్ట్‌ను 4 రోజులు మూసివేశారు. నేపాల్‌లో ఎయిర్‌ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌స్పేస్‌లో నేపాల్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement