Aircraft Crashes On Runway At Pokhara International Airport Nepal - Sakshi
Sakshi News home page

నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం..68 మంది మృత్యువాత

Jan 15 2023 11:49 AM | Updated on Jan 15 2023 6:14 PM

Aircraft Crashes On Runway At Pokhara International Airport Nepal - Sakshi

ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయంలో రన్‌వేపై విమానం కులిపోయింది. కాగా, విమానంలో నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా వెళ్తుండగా ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇక, ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.  నేపాల్‌ ఆర్మీ.. ఇప్పటి వరకు 68 మంది ప్రయాణికుల డెడ్‌బాడీలను బయటకు తీశారు. ఇందులో ఐదుగురు భారతీయులున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement