Tribhuvan International Airport
-
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
విమాన ప్రమాదం : ఎయిర్పోర్ట్ క్లోజ్
ఖట్మాండ్ : నేపాల్ రాజధాని ఖట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్ఆఫ్ అవబోతోన్న ఓ మలేషియన్ జెట్ రన్‌వేపై జారీపోవడంతో, విమానశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కానీ నేపాలి రాజధానికి రాబోతోన్న విమానాలన్నింటిన్నీ వేరే వైపుకు మరలిస్తున్నారు. రన్‌వేపై జారీపోయిన మలేషియన్‌కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 గా అధికారులు పేర్కొన్నారు. రన్‌వేకు 30 మీటర్ల దూరంలో గట్టిలోకి జారిపోయి, మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది. విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి ప్రేమ్ నాథ్ థాకూర్ చెప్పారు. విమానం ఇలా ప్రమాదానికి గురికావడానికి కారణలేమిటన్నది? ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్ తెలిపారు. గత నెల క్రితం కూడా అమెరికా-బంగ్లా ఎయిర్వేస్ ఖట్మాండ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. 2015లో మార్చిలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ జెట్ కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌ను 4 రోజులు మూసివేశారు. నేపాల్‌లో ఎయిర్ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్ యూనియన్ ఎయిర్‌స్పేస్‌లో నేపాల్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు. -
ఢాకా-కఠ్మాండూ విమానాల నిలిపివేత
కఠ్మాండూ: నేపాల్ విమాన సేవలకు కఠ్మాండూ విషాదం సెగ తగిలింది. నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఢాకా నుంచి కఠ్మాండూ వెళ్లే విమానాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నుట్లు యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ‘ఆ విషాదానికి సంబంధించి పైలట్‌కు ఐటీసీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లాయని మాత్రమే తెలుసు. ఇది తప్ప మా దగ్గర ఎటువంటి అదనపు సమాచారం లేదని, ఈ విషయమై తమకెవరిపై అనుమానాలు లేవని’ యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం చేపట్టిన విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినపుడు సమాచార లోపం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఢాకాలో అత్యవసర స్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది. మరోవైపు పైలట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మధ్య సమాచార లోపం వల్లే ప్రమాదం సంభవించిందనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి అటు ఈ అంశంపై విచారణ జరిపేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా విమాన ప్రమాదంలో గాయపడిన నేపాలీ, బంగ్లాదేశ్ ప్రయాణికులు కఠ్మాండూలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
కన్ఫ్యూజన్లో విమానం కూల్చారు
సాక్షి, కఠ్మాండు : నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి కొత్త విషయం తెలిసింది. సాంకేతిక సమస్యవల్ల ఆ ప్రమాదం జరగలేదని సమాచార బదిలీ విషయంలో అస్పష్టత ఏర్పడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కన్ఫ్యూజన్లో పైలెట్ విమానాన్ని కూల్చినట్లు స్పష్టమైంది. విమానం దింపే సమయంలో పక్కకు తిప్పాలని చెప్పినప్పటికీ తన వాయిస్ సరిగా వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పాడు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తొలుత సాంకేతిక సమస్య ఇందుకు కారణం అని అనుకున్నారు. అయితే, వాస్తవానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్‌కు మధ్య సంభాషణలో తికమకే అంతమంది ప్రాణాలుపోవడానికి కారణమని తెలిసింది. రేడియో ద్వారా జరిగిన వారి సంభాషణ చాలా కన్ఫ్యూజ్గా సాగిందంటూ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. అందులో పేర్కొన్న ప్రకారం విమానం సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మాత్రమే పైలట్ తాము దిగొచ్చా అని అడిగాడు. అప్పటికే ఆలస్యం అయింది. అది చూసిన కంట్రోలర్ వణికిపోతున్న స్వరంతో వెంటనే వెనక్కు తిప్పాలని ఆదేశించాడు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రన్‌వే వైపు ఫాస్ట్‌గా వెళ్లాలని ఆదేశించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 'రన్‌వేకి తగినట్లు విమానం రాలేదు. అప్పటికీ ఎయిర్ కంట్రోల్ టవర్ నుంచి పైలట్‌ను ఈ విషయంపై పలుసార్లు చెప్పినా అతడు మాత్రం అంతా బాగానే ఉందని, అన్నింటికీ యస్ అంటూ బదులిచ్చాడు' అని జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ చేత్రి చెప్పారు. కాగా, అమెరికా-బంగ్లా ఎయిర్‌లైన్స్ సీఈవో ఇమ్రాన్ అసిఫ్ మాత్రం ఢాకాలో మాట్లాడుతూ 'ఇదే స్పష్టమైన కారణం అని మేం చెప్పలేం.. కానీ, కచ్చితంగా కఠ్మాండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ మా పైలట్లను రన్ వే విషయంలో తప్పుదారి పట్టించింది. పైలట్లకు, టవర్‌కు మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత మా పైలట్ల నిర్లక్ష్యం లేదని స్పష్టమైంది' అని అన్నారు. -
నేపాల్‌లో ఘోర ప్రమాదం
కఠ్మాండూ: నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాం కేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం ఒరిగి పక్కనున్న ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకెళ్లింది.మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొందరు మరణించారు. మిగతా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెప్పారు. విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా.. 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. నేపాల్ అధికారుల కథనం ప్రకారం.. యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సోమవారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది. నేపాల్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండూ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది. విమానంలో నుంచి బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నామని టీఐఏ జీఎం రాజ్‌కుమార్ ఛత్రీ తెలిపారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం వల్లే.. ‘విమానాన్ని దక్షిణం వైపు రన్‌వేపై ల్యాండింగ్ చేసేందుకు అనుమతించాం. కానీ ఉత్తరంవైపు దిగింది. రన్‌వేపై దిగేందుకు ప్రయత్నించిన సమయంలో అదుపు తప్పింది. సాంకేతిక సమస్యలే కారణం కావచ్చని భావిస్తున్నాం’ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గౌతమ్ చెప్పారు. యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్ సీఈవో ఇమ్రాన్ అసిఫ్ మాట్లాడుతూ.. పైలట్‌కు ఏటీసీ తప్పుడు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తుందన్నారు. ల్యాండ్ అయ్యేముందే.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బొహోరా ఆ ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఢాకాలో విమానం టేకాఫ్ సమయంలోఇబ్బందులు లేవు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేముందు విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఆ తరువాత పెద్ద శబ్దంతో పక్కకు ఒరిగింది. కిటికీ పక్కన కూర్చోవడంతో దానిని పగులగొట్టి బయటపడ్డాను’ అని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు -
కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం
-
విమానం క్రాష్‌ల్యాండ్: 50 మంది మృతి
కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది. నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రన్ వే నుంచి జారిన విమానం
-
రన్ వే నుంచి జారిన విమానం
నేపాల్ రాజధాని ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఇస్తాంబుల్ నుంచి ఖట్మాండు వచ్చిన విమానం వాతావరణం సరిలేకపోవడంతో రన్‌వే నుంచి జారిపోయింది. అంతకు ముందు గంట సేపు దిగేందుకు అవకాశం లేకపోవడంతో ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఎట్టకేలకు దిగేందుకు ప్రయత్నించినా.. విపరీతమైన మంచు, రన్‌వే కూడా తడిగా ఉండటంతో అక్కడి నుంచి జారిపోయింది. విమానం ముందుభాగం రన్‌వేను తాకింది. విమాన సిబ్బంది సహా 227 మంది ప్రయాణికులున్నారని, అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ పోర్ట్ జీఎం బీరేంద్ర శ్రేష్ట తెలిపారు. మొత్తం ప్రయాణికులను, సిబ్బందిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. నేపాల్‌లో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమైన త్రిభువన్ విమానాశ్రయంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో పలు స్వదేశీ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, కొన్ని సర్వీసులను రద్దుచేశారు కూడా. -
ఇండిగో విమానంలో మంటలు
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో శనివారం ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పుడే దిగిన ఇండిగో విమానం కుడి భాగంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని వెంటనే ఎయిర్ట్‌పోర్ట్ సిబ్బంది వెంటనే గుర్తించి, అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పివేశారు. అయితే ఇండిగో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది కిందకు దింపారు. ఆ ఇండిగో విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి ఖాట్మాండ్ బయలుదేరింది. అయితే శుక్రవారం నేపాల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన ఇంజన్లో అవాంతరం ఏర్పడటంతో త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో వెంటనే దింపివేసిన సంగతి తెలిసిందే. -
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న భారతీయుడు పట్టివేత
రెండున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారతీయుడు బిక్రమ్ కుమార్‌ను ఖట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆ బంగారాన్ని తన బూట్లులో దాచి ఉంచాడు. వీటితోపాటు చేతికి ధరించిన బంగారు బ్రాస్ లెట్‌కు వెండి కోటింగ్ కొట్టి ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు. దాంతో అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారం లభ్యమైంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నేపాల్‌లో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 37.67 కిలోల బంగారాన్ని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నిందితుడు బిక్రమ్ కుమార్ స్వస్థలమని అధికారులు వెల్లడించారు.