
ఖట్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పైకి 24వ సారి అధిరోహించిన కమి రిట షేర్పా(50) తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మే 15వ తేదీన భారత బృందానికి గైడ్‌గా వ్యవహరించి 23వ పర్యాయం ఎవరెస్ట్‌పైకి ఎక్కారు. తాజాగా తాజాగా భారత పోలీసు బృందానికి గైడ్‌గా వ్యవహరిస్తున్న ఈ నేపాలీయుడు.. మంగళవారం ఉదయం 6.38 గంటలకు ఎవరెస్ట్ పైకి చేరుకోగలిగారని ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’ సంస్థ చైర్మన్ మింగ్మా షేర్పా వెల్లడించారు.
దీంతో 8,848 మీటర్ల అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా కమి రిట రికార్డుల్లోకెక్కారు. 1994 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్న కమి రిట 25 పర్యాయాలు అక్కడికి వెళ్లాలని ధ్యేయంగా పెట్టుకున్నారని మింగ్మా తెలిపారు.