ఖాట్మాండు: మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడం పర్వతారోహకుల చిరకాల స్వప్నం. ఎవరెస్ట్ శిఖరాన్ని కచ్చితంగా తమ జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలని ప్రతి పర్వతారోహకుడు కోరుకుంటాడు. కాగా నేపాల్‌కు చెందిన 52 ఏళ్ల పర్వతారోహకుడు కామి రీటా షెర్పా 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును సృష్టించాడు . 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలో తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. 2019లో కామి రిటా 24వ సారి అధిరోహించాడు.
తొలిసారిగా 1994 మే నెలలో ఎవరెస్ట్‌ను శిఖరాన్ని చేరుకున్నాడు. ఖాట్మండు ఆధారిత సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రకారం, కామి రీటా సాయంత్రం 6 గంటలకు మౌంట్ ఎవరస్ట్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం కామి రిటా తాడు తయారీ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన కే2, అన్నపూర్ణను కూడా అధిరోహించాడు.
చదవండి: గూగుల్ అసిస్టెంట్ పాడే కరోనా వ్యాక్సిన్ పాట విన్నారా...!
Comments
Please login to add a commentAdd a comment