climbs
-
మద్యం మత్తులో 80 అడుగుల టవర్ ఎక్కి..
‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అని ఓ సామెత. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తీరు అచ్చం అలాగే ఉంది. జిల్లాలో ఉన్న బెరాసియా తహసీల్‌లో బర్ఖేడీ గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివేక్ అనే వ్యక్తి పీకల దాకా తాగాడు. ఇంకేముంది వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మత్తులో 80 అడుగుల మొబైల్ టవర్ ఎక్కాలనుకున్నాడు. స్థానికులు అడ్డుకుంటున్నా సరే.. పక్కకు నెట్టిమరీ సునాయాసంగా ఎక్కాడు. టవర్ మీదకు ఎక్కనయితే ఎక్కాడు కానీ.. ఎట్లా దిగాలో అర్థం కాలేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. దీంతో స్థానికులు జహంగీరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతడిని 20 నిమిషాలపాటు మాటల్లో పెట్టి.. అగ్నిమాపక క్రేన్ సహాయంతో కిందకు దించారు. కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనంతా స్థానికులు తమ సెల్‌ఫోనులో బంధించిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్ అవుతోంది. -
తొలిసారి మెట్లదారిలో తిరుమల కొండెక్కిన యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..
నేపాల్‌కు చెందిన సైనికుడు అరుదైన గిన్నీస్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. కేవలం చేతులను మాత్రమే ఉపయోగించి 75 మెట్లను 25.03 సెకన్లలో కిందకు దిగి చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేగంగా మెట్లపై కిందకు దిగే పోటీకి ప్రపంచంలోనే మంచి ప్రజాధరణ ఉంది. అయితే.. ఇందులో ఇలా మెట్లను దిగడంలో కేవలం చేతులను మాత్రమే ఉపయోగించాలి. శరీర బరువు మొత్తం చేతులపై మోస్తూ మెట్లపై నుంచి కిందకు దిగాలి. ఇలా దిగే క్రమంలో బ్యాలెన్స్ మిస్ కాకుండా చూసుకోవడం చాలా కీలకం. ఈ పోటీలో ఇప్పటివరకు 30..8 సెకన్లతో అమెరికాకు చెందిన వ్యక్తిపై రికార్డ్ ఉంది. దీనిని ప్రస్తుతం నేపాల్‌కు చెందిన సైనికుడు హరి చంద్ర గిరి ఛేదించాడు. ఖాట్మండ్ లోయలో ఉన్న బుద్దిస్ట్ దేవాలయం జమ్చెన్ విజయ స్థూపంపై ఉన్న మెట్లపై హరి చంద్ర ఈ ఫీట్‌ను సాధించాడు. అయితే.. తాను 8 ఏళ్ల వయస్సు నుంచి చేతులపై నడిచే నైపుణ్యాన్ని సాధన చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ వేషధారణలో బాలుడు.. పార్కుకి వెళ్తే.. -
వైరల్ వీడియో : బైక్‌ను నెత్తిన పెట్టుకొని మరీ బస్సెక్కించాడు
-
టిక్కెట్ ఇవ్వలేదని.. టవర్ ఎక్కిన ఆప్ నేత..
-
రష్యన్ యుద్ధ ట్యాంకు పై రెపరెపలాడుతున్న ఉక్రెయిన్ జాతీయ జెండా!
ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేటితో 12వ రోజుకు చేరుకుంది. రష్యా నిరవధికంగా సాగిస్తున్న పోరులో ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ దాడిలో వందలాది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యా దాడిలో చాలా దారుణంగా అతలా కుతలమైపోయింది కూడా. అయినప్పటికీ ఉక్రెయిన్ వాసుల మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురవ్వనివ్వం అంటూ ప్రతి దాడులు చేయడం అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాడి చేసేందుకు సిద్ధం అంటూ..రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అందులో భాగంగానే రష్యన్ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్‌లో రహదారుల్లోకి వస్తున్నప్పడు ప్రజలు ఏ మాత్రం భయపడకుండా తమ దేశంలోకి రావద్దంటూ వాటికి అడ్డంగా నిలబడటం వంటివి కూడా చేశారు. అయితే ఇప్పుడోక వ్యక్తి ఉక్రెయిన్ జాతీయ జెండాను పట్టుకుని ఏకంగా రష్య యుద్ధ ట్యాంకు పైకి ఎక్కి ఎగరవేయడమే కాక ఆనందంగా ఆ జెండాను అటు ఇటూ ఊపుతూ ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వాళ్లు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఒక పక్క రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఉక్రెయిన్ వాసుల మాత్రం రష్యన్ దళాలు చొరబడకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వీరోచితంగా పోరాడుతుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 331 మంది ప్రజలు మరణించారని సుమారు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు వలసల బాటపట్టారని యూఎన్ మానవహక్కుల కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. A Ukrainian climbed onto a Russian tank and hoisted the Ukrainian flag.#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack #UcraniaRussia #RussianUkrainianWar pic.twitter.com/BFrQKZvLlE — David Muñoz López 🇪🇦🇪🇺🇺🇦 (@dmunlop) March 7, 2022 (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’
పిల్లలు ఏ విషయం అయిన తొందరగా నేర్చుకుంటారంటారు. పనులైన, ఆటలైన ఒక్కసారి ఆసక్తి పెట్టారంటే ఇట్టే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ చిన్నారి ఎలాంటి సాయం లేకుండా అవలీలగా గోడను పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. ఐదేళ్ల చిన్నారి ఇంట్లోని రెండు గోడల మధ్య ఒక్కో కాలు పెట్టి స్పైడర్మెన్లా పైకి పాకుతుంది. నిమిషంలోనే ఇంటి పైకప్పు వరకు చేరి అక్కడే కాసేపు విన్యాసాలు చేసింది. కాళ్లను, చేతులను ఆడిస్తూ ఫీట్లు చేసింది. అనంతరం మళ్లీ అలాగే పాకుతూ కిందకు దిగింది. అయితే ఇక్కడ చిన్నారి గోడకు వ్యతిరేకంగా చేతులు, కాళ్లను ఉంచడం విశేషం. వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. పాప టాలెంట్‌ను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నారి.. నువ్వు సూపర్. అచ్చం స్పైడర్‌లా వెళ్లావ్. అర్ధరాత్రి నిద్రలోంచి లేచి ఇలాంటివి ట్రైం చేస్తే ఇక నా జీవితమంతా డాక్టర్‌తో మందులు వాడుతూనే ఉంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు తెలియరాలేదు. చదవండి: తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లిన ఏం కాలేదంటే.. రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 It's like something out of the Exorcist.😲😱 https://t.co/ODSpti0rGv — MrChelsea (AKA col ) London is blue 💙⭐⭐ (@MrChels33381819) September 16, 2021 -
పెద్దల ఎదుట కౌన్సెలింగ్.. కన్న కొడుకును దగ్గరకు రానివ్వలేదని..
సాక్షి, సంగెం(వరంగల్): భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి హల్చల్ చేసిన సంఘటన సంగెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లికి చెందిన కర్జుగుత్త రమేష్, కవిత గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. దీంతో కవిత చిన్నకుమారుడితో కలిసి వేరొక చోట ఉంటుంది. భార్య కాపురానికి రావడం లేదని రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం పెద్ద మనుషుల సమక్షంలో కలిసి ఉండాలని పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి భార్య కవిత కోర్టు నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పింది. చిన్న కుమారుడిని సైతం తండ్రి రమేష్ దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ మంగళవారం రాత్రి సంగెం వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రొబెషనరీ ఎస్సై ప్రియదర్శిని, సిబ్బందితో కలిసి రమేష్‌కు నచ్చచెప్పి కిందకు దింపారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. -
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు.. కారణం తెలిస్తే షాక్..
సాక్షి, చందంపేట(నల్లగొండ) : మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల మల్లేశ్ అనే వ్యక్తి తనకు డబుల్ బెడ్రూం ఇల్లు లక్కీ డ్రాలో రాలేదని గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించే వరకు కిందికి దిగిరానని భీష్మించాడు. మల్లేశ్‌కు మద్దతుగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో లక్కీడ్రాలో ఇళ్లు రాని మరికొంత మంది కూడా బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఫోన్లో మాట్లాడి మల్లేశ్‌ను కిందికి దించే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కిందికి దిగనని మల్లేశ్ చెప్పాడు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించాడు. సర్పంచ్ కవితఅనంతగిరి ఎమ్మెల్యేను ఫోన్ ద్వారా సంప్రదించారు. రాబోయే విడతలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామ ని హామీ ఇవ్వడంతోపాటు, ఎంపీడీఓ రాములునాయక్, ఇన్చార్జ్ తహసీల్దా ర్ ముక్తార్, ఎస్ఐ సందీప్‌నాయుడు బాధితుడు, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో మల్లేశ్ టవర్ దిగాడు. చదవండి: దొరికితే దొంగ.. లేదంటే దొర -
స్తంభం ఎక్కిన ఎలుగు, తనవారికోసం ఎదురుచూపులు!
వాషింగ్టన్: సాధారణంగా ఎలుగు బంట్లు అడవిలో ఉంటాయి. ఒక్కోసారి అడవిలో వాటికి ఆహారం దొరక్కగానీ లేదా దారి తప్పిగానీ మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయి. ఈక్రమంలో ఎలుగుబంట్లు మనుషులపైన దాడిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే, ఇక్కడ ఒక ఎలుగు బంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఒక విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని దక్షిణ అరిజోనా, విల్కాక్స్ పట్టణం కేంద్రంగా సల్ఫర్ స్పింగ్ వ్యాలీ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ అనే సంస్థ ఉంది. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ కార్మికులు ఒక ఎలుగు బంటి విద్యుత్ స్తంభం మీద ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఆ సంస్థ కార్మికులు వెంటనే ఆ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఒక పెద్ద క్రేన్‌ను తెప్పించారు. ఒక ఫైబర్ గ్లాస్ స్టిక్‌తో దాన్ని అదిలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగు బంటి మెల్లగా స్తంభం కిందకు దిగి, సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగుబంటి తన వారికోసం పైకెక్కి చూస్తుంది..’, ‘అయ్యో.. ఎంత పెద్ద ఆపద తప్పిపోయింది..’, ‘ హయ్.. మిత్రమా.. జాగ్రత్తగా దిగి నీ ఇంటికి వెళ్లిపో.. ’ ‘విద్యుత్ కార్మికుల చేసిన పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: చావు నుంచి తప్పించుకున్న మహిళలు “Alright, little bear. Time to get off this pole.” After being called to the scene, utility workers immediately cut the power and then helped coax this bear off a power pole in Arizona. The bear eventually climbed down safely and ran off into the desert. https://t.co/N3YkuSiGgg pic.twitter.com/FJSe51UEXD — ABC News (@ABC) June 10, 2021 -
25 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాలీ దేశస్థుడు..!
ఖాట్మాండు: మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడం పర్వతారోహకుల చిరకాల స్వప్నం. ఎవరెస్ట్ శిఖరాన్ని కచ్చితంగా తమ జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలని ప్రతి పర్వతారోహకుడు కోరుకుంటాడు. కాగా నేపాల్‌కు చెందిన 52 ఏళ్ల పర్వతారోహకుడు కామి రీటా షెర్పా 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును సృష్టించాడు . 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలో తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. 2019లో కామి రిటా 24వ సారి అధిరోహించాడు. తొలిసారిగా 1994 మే నెలలో ఎవరెస్ట్‌ను శిఖరాన్ని చేరుకున్నాడు. ఖాట్మండు ఆధారిత సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రకారం, కామి రీటా సాయంత్రం 6 గంటలకు మౌంట్ ఎవరస్ట్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం కామి రిటా తాడు తయారీ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన కే2, అన్నపూర్ణను కూడా అధిరోహించాడు. చదవండి: గూగుల్ అసిస్టెంట్ పాడే కరోనా వ్యాక్సిన్ పాట విన్నారా...! -
కిలిమంజారోను అధిరోహించిన హైదరాబాద్ బుడతడు
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు అంటూ కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో అందరూ దాదాపు ఇలాగే చేసి ఉంటారు.. కానీ హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు. -
కొబ్బరి చెట్టెక్కి మరీ చెప్పిన మంత్రి..
కొలంబో: స్వార్థపూరిత ప్రస్తుత రాజకీయాలలో ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ నాయకులు చాలా తక్కువ. కానీ శ్రీలంకకు చెందిన ఓ మంత్రి చేసిన పని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీలంక ప్రజలు కొబ్బరి వ్యాపారంపై విపరీతంగా ఆధారపడుతుంటారు. అయితే ప్రస్తుతం దేశంలో 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని, ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే తాను కొబ్బరి చెట్టు ఎక్కినట్లు మంత్రి అరుందికా ఫెర్నాండో తెలిపారు. దేశంలో పారిశ్రామిక అవసరాల భారీగా కొబ్బరిని వినియోగిస్తున్నారని తెలిపారు. కొబ్బరికి అధిక డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కొబ్బరి చెట్లను పెంచాలని పేర్కొన్నారు. కాగా కొబ్బరి కొరతను తీర్చేందకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అరుందికా ఫెర్నాండో తెలిపారు. మరోవైపు కొబ్బరి కొరతను అధిగమించేందుకు మంత్రి ఫెర్నాండో తీసుకుంటున్న చర్యలు హర్షనీయమని సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి
కోల్‌కతా : నోబెల్ బహుమతి కావాలి అంటూ ఓ మహిళ హౌరా బ్రిడ్జి ఎక్కి హల్చల్ చేసింది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ నా నోబెల్ బహుమతిని దొంగిలించాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటూ వాపోయింది. నోబెల్ ప్రైజ్ తిరిగి ఇచ్చేవరకు కదలనని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆమెను కిందకి దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మతిస్థిమితం లేని మధ్య వయస్కురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు డొల్లి ఘోష్ అని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో ఆమె హౌరా బ్రిడ్జిపై ఎక్కిందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకి దింపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నోబెల్ ప్రైజ్ వెతికి తెచ్చిస్తామని మాట ఇవ్వడంతో సదరు మహిళ కిందకు దిగేందుకు ఇప్పుకోవడంతో విషయం సద్దుమణిగింది. (కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. ) -
కిలిమంజారో ఎక్కేశాడు
సాక్షి, నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్య్సకార యువకుడు గోసల రాజు దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతాన్ని ఈ నెల 5న అధిరోహించినట్లు రాజు తెలిపాడు. ఈ నెల మూడో తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించి 5వ తేదీన దిగ్విజయంగా ఎక్కినట్టు పేర్కొన్నాడు. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు. ఇంటర్ వరకూ చదువుకున్న రాజు గతంలో 2018 మే17వ తేదీ ఎవరెస్టు శిఖరం, 2018 సెప్టెంబర్ 18న రష్యాలోని మౌంట్ ఎలబ్రస్, 2019 ఫిబ్రవరి 14న అంకాగ్వా పర్వతాలను కూడా అధిరోహించాడు. హైదరాబాద్‌లో ని ట్రాన్స్‌జెండర్ అడ్వంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహస యాత్రలు చేస్తున్నట్లు రాజు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికాలోని దేనాలిలను అధిరోహించడమే తన లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు. -
హోదా కోసం ప్రాణాలైనా అర్పిస్తా అంటూ ..
-
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన ఫ్రెంచ్ స్పైడర్‌మెన్
-
మార్కెట్లకు ఊతమిచ్చిన ఆర్బీఐ పాలసీ
రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేడు వెల్లడికానున్న నేపథ్యంలో రేట్ల కోత ఆశలతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది.115.06 పాయింట్ల లాభంతో 28,358 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 32.85 పాయింట్ల లాభంలో 8,770గా నమోదవుతోంది. అదానీ పోర్ట్స్, హీరో మోటార్ కార్పొ, టాటా మోటార్స్, సిప్లా, బీహెచ్ఈఎల్లు టాప్ గెయినర్స్‌గా లాభాలు పండిస్తుండగా.. భారతీ ఎయిర్టెల్ నష్టాల గడిస్తోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. సోమవారం 66.59గా ముగిసిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో 66.55గా ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) రెండు రోజుల సమావేశం నేడు ముగియనుంది. ఓ వైపు ఆర్బీఐ రేట్లను యథాతథంగా ఉంచుతుందనే సంకేతాలతో పాటు, మార్కెట్లకు ఆశ్చర్యకరంగా రేట్లలో కోత కూడా విధించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు కొంత నష్టాల బాట పట్టాయి. ఉర్జిత్ పటేల్ వెలువడించే పాలసీపై మార్కెట్లు ఎక్కువగా దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఆసియన్ షేర్లు కూడా లాభాలకు నష్టాలకు మధ్య ఊగిసలాటలో నడుస్తున్నాయి. ఓ వైపు జర్మనీ బ్యాంకు దిగ్గజం డాయిష్ బ్యాంకు భవితవ్యంపై ఆందోళన తగ్గుముఖం పట్టడంతో పాటు, మరోవైపు అమెరికా వడ్డీరేట్లను పెంచుతాదనే సంకేతాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు ఊగిసలాటలో నడుస్తున్నాయి. -
ఫ్రెంచ్‌లో సాలీడు సాహసపుత్రుడు
-
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు..
-
సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు..
వరంగల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. పెళ్లికి ఓకే అంటేనే దిగుతానని లేకుంటే కిందికి దూకుతానని షరతు పెట్టాడు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల మండలం జూకల్లు గ్రామానికి చెందిన ఎడమాండ్ల నాగరాజు(29) గతంలో హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కళాశాలలో చదివే విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. అయితే, కులాలు వేరు కావటంతో యువతి తల్లిదండ్రులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. మరో రెండు రోజుల్లో యువతికి మరో యువకుడితో నిశ్చితార్ధం జరుప తలపెట్టారు. దీంతో నాగరాజు నాలుగు రోజుల క్రితం స్థానిక మిల్స్‌కాలనీ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఫలితం లేకపోవటంతో గురువారం ఉదయం 5 గంటల సమయంలో కరీమాబాద్ పట్టణం కుర్మవాడలో ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కాడు. ప్రేమించిన యువతితో పెళ్లి జరిపిస్తామంటేనే దిగుతానని, లేదంటే టవర్ పైనుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.