ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేటితో 12వ రోజుకు చేరుకుంది. రష్యా నిరవధికంగా సాగిస్తున్న పోరులో ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ దాడిలో వందలాది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యా దాడిలో చాలా దారుణంగా అతలా కుతలమైపోయింది కూడా.
అయినప్పటికీ ఉక్రెయిన్ వాసుల మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురవ్వనివ్వం అంటూ ప్రతి దాడులు చేయడం అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాడి చేసేందుకు సిద్ధం అంటూ..రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అందులో భాగంగానే రష్యన్ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్‌లో రహదారుల్లోకి వస్తున్నప్పడు ప్రజలు ఏ మాత్రం భయపడకుండా తమ దేశంలోకి రావద్దంటూ వాటికి అడ్డంగా నిలబడటం వంటివి కూడా చేశారు.
అయితే ఇప్పుడోక వ్యక్తి ఉక్రెయిన్ జాతీయ జెండాను పట్టుకుని ఏకంగా రష్య యుద్ధ ట్యాంకు పైకి ఎక్కి ఎగరవేయడమే కాక ఆనందంగా ఆ జెండాను అటు ఇటూ ఊపుతూ ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వాళ్లు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఒక పక్క రష్యా దళాలు ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఉక్రెయిన్ వాసుల మాత్రం రష్యన్ దళాలు చొరబడకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వీరోచితంగా పోరాడుతుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 331 మంది ప్రజలు మరణించారని సుమారు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు వలసల బాటపట్టారని యూఎన్ మానవహక్కుల కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
A Ukrainian climbed onto a Russian tank and hoisted the Ukrainian flag.#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack #UcraniaRussia #RussianUkrainianWar pic.twitter.com/BFrQKZvLlE
— David Muñoz López 🇪🇦🇪🇺🇺🇦 (@dmunlop) March 7, 2022
(చదవండి: వాషింగ్టన్‌లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment