
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు అంటూ కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో అందరూ దాదాపు ఇలాగే చేసి ఉంటారు..
కానీ హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు.