kilimanjaro
-
Hyderabad: కిలిమంజారో పర్వతం.. అధిరోహించిన ప్రీతం!
లక్డీకాపూల్: నగరం నుంచి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయసు్కలలో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల ఎన్సీసీ క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు. 8 రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల 17న చేరుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంతో కూడిన ప్రీతం గత నెల 12న యాత్ర చేపట్టాడు. మరింత ఎతైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన తపన అని ప్రీతం అన్నారు. ‘కిలిమంజారో నిటారుగా, కంకర, ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించింది. శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారత జాతీయ జెండా, ఎన్సీసీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేశా’అని అన్నారు. -
ఎవరెస్ట్ వైపు తొలి అడుగు..
కెరమెరి(ఆసిఫాబాద్): ఆశయ సాధనకు పేదరికం అడ్డుకాదని నిరుపిస్తున్నాడు.. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కెలి కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్. సాహస కృత్యాల్లో రాణిస్తూనే, మరోవైపు కళల్లోనూ తన ప్రతిభను చూపుతున్నాడు. తన గమ్యం ఎవరెస్ట్ అధిరోహించడమే అని చెబుతున్న కార్తీక్.. తాజాగా సిక్కిం రాష్ట్రంలో నిర్వహించే పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. తెలంగాణ నుంచి ఐదుగురు.. కెలి కె గ్రామానికి చెందిన గిత్తే రుక్మాజీ, ఇటాబాయి ల కుమారుడు కార్తీక్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సిక్కింలోని నామ్చా జి ల్లాలో ఈనెల 18 నుంచి అక్టోబర్ 16 వరకు విద్యార్థులకు పర్వతారోహణ శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపిక కా గా.. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కార్తీక్ ఒక్కరే ఉ న్నారు. నెల రోజులపాటు కొనసాగే ఈ కఠినమైన శిక్షణ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప ర్వతం ఎవరెస్ట్తోపాటు కిలిమంజారో వంటి శిఖ రాలు అధిరోహించేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నెల 15న సిక్కింకు బయలుదేరనున్నాడు. కాగా కార్తీక్ ఇప్పటికే బోనగిరిలోని రాక్‌లైన్ స్కూల్ ఆధ్వర్యంలో జూన్ 19న బోనగిరి గుట్టపై 150 ఫీట్ల రా ఫెల్లింగ్, 150 ఫీట్ల కై ్లంబింగ్‌తోపాటు 650 ఫీట్ల ఎ త్తు వరకు ట్రెక్కింగ్ పూర్తి చేశారు. 30 ఫీట్ల బౌల్ట్రెంగ్, 10 మీటర్ల జిప్లైన్లోనూ ప్రతిభ చూపాడు. దీంతో బోనగిరి రాక్‌లైన్ స్కూల్ ఆధ్వర్యంలో సి క్కింల్లో అందించే శిక్షణకు ఎంపికయ్యాడు. కు టుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్ హేమంత్ బోర్కడే రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. మాలావత్ పూర్ణ స్ఫూర్తి 13 ఏటనే ఏడు పర్వతాలు అధిరోహించిన నిజామాబా ద్ జిల్లాకు చెందిన మాలా వత్ పూర్ణను స్ఫూర్తిగా తీసుకుని సాహస కృత్యాల్లో పా ల్గొంటున్నా. ట్రెక్కింగ్, కై ్లంబింగ్‌తోపాటు కవితలు రాయడం, చెస్ ఆడటం అంటే ఇష్టం. పేదరికంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థికంగా అండగా ఉంటే రాష్ట్రం పేరు నిలబెడతా.. – గిత్తే కార్తీక్ ఇతర కళల్లోనూ నేర్పరి సాహస కృత్యాలతోపాటు కార్తీక్ ఇతర కళల్లోనూ నేర్పరి. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. వజ్రోత్సవం సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో మొదటిస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో పతకం సాధించాడు. ఇచ్చోడలో జరిగిన వాటర్‌ఫాల్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు. గతంలో నేపాల్‌లో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా ప్రజాప్రతినిధులు, అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు. -
పర్వతం అతనికి పాదాక్రాంతం
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): కృషితో పట్టుదలతో ఆ యువకుడు ఏ పర్వతాన్నయినా అవలీలగా అధిరోహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మనసులో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అతని పేరు ఉమేష్ ఆచంట. ఇతని తల్లిదండ్రులు బాలాజీ..పద్మావతి. ఉమేష్ చదువులో దిట్ట. టేబుల్ టెన్నిస్ అంటే ప్రాణం. ఈ ఆటలో అద్భుత ప్రావీణ్యం కనబరిచాడు. బీకాం ఉత్తీర్ణుడైన ఈ యువకుడు స్టోర్ట్సు కోటాలో రాజమహేంద్రవరంలోని పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2016లో చూసిన ఎవరెస్ట్ సినిమా ఇతని ప్రవృత్తిని మార్చేసింది. తాను కూడా ఎవరెస్ట్ ఎక్కాలని బలంగా సంకల్పించాడు. వాస్తవానికి పర్వతారోహణ అనేది సాహస విన్యాసం. అయినప్పటికీ కృతనిశ్చయంతో తల్లితండ్రులను ఒప్పించి అరుణాచల ప్రదేశ్ వెళ్లాడు. కఠోరమైన శిక్షణ పొందాడు. అప్పటి నుంచి చిన్న చిన్న కొండలను ఎక్కడం ప్రారంభించి నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చూసి తాను కూడా ఎవరెస్ట్ ఉమేష్ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మూడు ఖండాలలో అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించగలిగాడు. గతేడాది మార్చిలో ఆఫ్రికాలో అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. అదే ఏడాది ఆగస్టులో యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎలబస్ని ఎక్కాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో అతిపెద్ద పర్వతం మౌంట్ కోజిస్కోని అధిరోహించి అందరి దృష్టీ ఆకర్షించాడు. తాజాగా ఎవరెస్ట్ ఎక్కడానికి సన్నద్ధమవుతున్నట్లు ఉమేష్ సాక్షికి చెప్పాడు. ప్రమాద అంచున పయనం కిలిమంజారో ఎత్తు 19340 అడుగులు. మొదటి రెండు రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కగలిగాడు. మూడో రోజు ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారవర్గాలు వెంటనే స్పందించాయి. అక్కడికి గైడ్, రిస్క్యు టీంను పంపాయి. దీంతో ఉమేష్ ప్రాణాలతో బయట పడ్డాడు. అలాగే మౌంట్ కోజిస్కోపర్వతం ఎత్తు 2228 మీటర్లు. ఆస్ట్రేలియా ఖండంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ పర్వతారోహనను ఆపేశారు. కానీ ఉమేష్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈనెల 11న బేస్ క్యాంపు నుంచి బయులుదేరాడు. సుమ్మిట్ పూర్తి చేసుకుని కిందకు రాత్రి లోపు వచ్చేయాలి. జీపీఎస్ సిగ్నల్స్..తీప్ర మంచు సమస్యలతో రూట్ మ్యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రావ్సన్ వద్ద ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున దారి తప్పిపోయాడు. ఆ రాత్రి మళ్లీ కిందికి చేరుతానో లేదో అని తాను తీవ్ర ఆందోళన చెందానని ఉమేష్ చెప్పాడు. రాత్రి 12 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ టీంకు సమాచారం ఇద్దామన్నా సిగ్నిల్స్ లేవన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ అపరేషన్ టీం ఇతడ్ని గుర్తించింది. అతి జాగ్రత్తగా బేస్ క్యాంపునకు తీసుకు వచ్చింది. అయినా పట్టు వీడకుండా ఈనెల 12న బేస్ క్యాంప్ నుంచి మళ్లీ బయలుదేరి మౌంటైనీర్ అవిన జోష్ మాతేవ్తో కలిసి మౌంట్ కోజిస్కోను అధిరోహించగలిగాడు. ఉమేష్ సాధించిన మెడల్స్ ఒడిదుడుకులు ఎదుర్కొని.. ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు పర్వతాలత్లో మౌంట్ ఎల్బస్ ఒకటి. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే పర్వతమిది. సముద్రమట్టానికి 16510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా చేరుకోగలిగాడు. టీటీలో పలు ర్యాంకింగులు సాధించిన ఉమేష్ పర్వతరోహణలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. -
కిలిమంజారో పర్వతంపై వైఫై
డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే.. -
Visakhapatnam: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!
‘మహిళలు, ఆడపిల్లలు అవరోధాల్ని అధిగమించి.. ఖండాతరాల్లో ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఇలాంటి వారందరికీ విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఇది ఎంతో గర్వకారణం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.’ – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ఈ ఒక్క ప్రశంస చాలు.. ఆమె సాధించిన ఘనత గురించి చెప్పుకోవడానికి.! బుడి బుడి అడుగులు వేసే వయసులోనే.. కొండలెక్కడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన సమయంలో పర్వతారోహణ చేపట్టింది. అలా మొదలైన ప్రయాణం.. రికార్డులు తిరగరాసేంత వరకు చేరింది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్ట్, పదేళ్లకే కిలిమంజారో.. ఇప్పుడు సాహస్.. ఇలా ఆ బాలిక సంకల్పబలం ముందు శిఖరం సైతం సాహో అంటోంది. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ.. ఇప్పటికే ఐదు అతి ఎత్తయిన శిఖరాగ్రాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది. వచ్చే నెలలో ఉత్తర అమెరికాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆ సాహసి పేరే కామ్య కార్తికేయన్. – సాక్షి, విశాఖపట్నం ఐదు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలు ఒక్కో రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్న కామ్య.. 2017 మే 16 నుంచి రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. అప్పుడే ‘సాహస్’యాత్రకు బీజం పడింది. ఏడు ఖండాల్లోని అతి ఎత్తయి న పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పం కామ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనుకున్నదే తడవుగా.. ఎవరెస్ట్ ఎక్కిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించింది. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా మరో రికార్డు సాధించింది. పదేళ్ల వయసులో స్టాక్ కాంగ్రీ పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఖండంలో 7,310 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను 2019లో పూర్తి చేసింది. తల్లి లావణ్యతో కలిసి వెళ్లిన కామ్య.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. మౌంట్ కోసియాజ్కోను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. అనంతరం దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అవలీలగా అధిరోహించేసింది. రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఆ అలవాటే.. అవార్డులు తెచ్చిపెడుతోంది! విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయన్ స్పోర్ట్స్ పర్సన్‌గా నేవీలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది కామ్య కార్తికేయన్. కామ్యకు నడక రాని సమయంలో తండ్రి కార్తికేయన్, తల్లి లావణ్య ఆ చిన్నారిని ఎత్తుకొని ట్రెక్కింగ్‌కు, వాకింగ్‌కు వెళ్లేవారు. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. ఆ అలవాటే.. కామ్యకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. అలా నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. మూడేళ్ల ప్రాయంలో ముంబయిలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గడ్ పర్వతాలను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో హిమాలయ పర్వత శ్రేణిలో 12 వేల అడుగుల చంద్రశీల, 2016లో 13,500 అడుగుల హర్‌కిదున్, 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ, 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు పర్వతారోహణ పూర్తి చేసింది. తొమ్మిదేళ్ల వయసులోనే హిమాలయాల్లోని రూప్‌కుండ్ మంచు సరస్సును అధిరోహించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు అర్హత సాధించింది. ప్రశంసించిన మోదీ మన్‌కీ బాత్‌లో విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆసియా ఆవల ఉన్న దేశాల్లో 7 వేల మీటర్ల అత్యంత ఎత్తయిన శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కామ్య ధైర్యం అందరిలోనూ స్ఫూర్తినింపిందంటూ కొనియాడారు. ‘మిషన్ సాహస్’లో భాగంగా పర్వతారోహణ చేస్తున్న కామ్య వివిధ దేశాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు. ఈ మిషన్‌లో కామ్య సఫలీకృతమై. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శక్తి సామర్థ్యాల విషయంలో భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సాహస యాత్రలకు గుర్తింపుగా ఇటీవలే పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా కామ్య అందుకుంది. ఉత్తర అమెరికా వైపు అడుగులు.. విశాఖ నేవీ స్కూల్లో చదువుతున్న కామ్య కార్తికేయన్.. ఆరో ఖండంలోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. సాహస్ యాత్రలో ఉత్తర అమెరికాలోని అలస్కాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేయాలని భావిస్తోంది. జూన్ 22వ తేదీన ఈ యాత్రను ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో కామ్య ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. డెనాలీ పర్వత శిఖరం 20,310 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని అధిరోహించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తే.. మిగిలినది అంటార్కిటికాలో అతి ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సెన్ మాసిఫ్. ఇది అంటార్కిటికా మంచు పర్వత శ్రేణుల్లో 16,050 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని కూడా అధిరోహిస్తే.. కామ్య కార్తికేయన్ సాహస్ యాత్ర పూర్తవుతుంది. ఏడు ఖండాల్లోనూ దేశ కీర్తిని పెంచడమే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య నా వెన్నంటే ఉంటుంది. అందుకే.. అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. జూన్‌లో ఉత్తర అమెరికా శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. అంటార్కిటికాలోని చివరి పర్వతాన్ని ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. కష్టమైనా ప్రతి ఒక్క విజయాన్ని సాధించే తీరుతాను. –కామ్య కార్తికేయన్, పర్వతారోహణ చేస్తున్న బాలిక ఇకపై వేసే ప్రతి అడుగూ ఒక సవాలే.. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. అలా అలవాటు చేసుకున్న కామ్య.. శారీరకంగానూ మానసికంగానూ పర్వతారోహణకు సిద్ధపడుతూ వచ్చింది. ఇప్పటి వరకూ ఐదు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. అయితే.. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. అంతే కాదు.. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. ఈ రెండు శిఖరాలను అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. – లావణ్య కార్తికేయన్, కామ్య తల్లి -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ మేరకు మురికి పులకిత హస్వి మాట్లాడుతూ..."ఇది ఒక సాహసోపేతమైన అనుభవం. కిలిమంజారో పర్వతం పై అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిని ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ముందు మూడు నెలల నుంచే ఈ పర్వతారోహణకు సన్నద్ధం కావాల్సి ఉంది. పైగా పర్వతారోహణకు మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకోసం యోగా, మెడిటేషన్ వంటివి చేసేదాన్ని. నేను 2024కి ముందు మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాని అందుకోసం నేను ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను. " అని చెప్పింది. (చదవండి: మేడం..! ఈ పర్స్ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్ అదే..) -
కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ భామ.. ఫోటో వైరల్
Mount Kilimanjaro: ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని తక్కువ వ్యవధిలోనే సాధించి, నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్ నివేదా థామస్. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. నివేదాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో శిక్షణ తీసుకుంది. తాజాగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తుంది. . ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్‌తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. I made it 😊 To the top of the tallest free standing mountain in the world. Mount Kilimanjaro pic.twitter.com/InPptVTjit — Nivetha Thomas (@i_nivethathomas) October 23, 2021 -
అమ్మ నాన్న వద్దన్నారు.. ‘వీగన్’గా అధిరోహించా
‘కిలిమంజారో అధిరోహణ నా జీవితంలో ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది’ అన్నారు కూరగాయల శారద. పర్వత ప్రపంచంలోని ఏడు శిఖారాలలో భాగమైన కిలిమంజారోను అధిరోహించిన మొదటి భారతీయ శాకాహారి (వీగన్)గా వార్తల్లో నిలిచారు ఆమె. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించడానికే ఈ ప్రయత్నం చేశానంటున్న నలభై నాలుగేళ్ల శారద స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. జంతు ఆధారిత ఆహార ఉత్పత్తులను దూరం పెట్టి ఐదేళ్లుగా వీగన్‌గా జీవిస్తున్న విధానాన్ని ఆమె ఇలా పంచుకున్నారు. ‘‘బలంగా ఉండాలంటే మాంసాహారం, గుడ్లు తినాలని, ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలనే ఆలోచన మనందరిలోనూ ఉంది. పర్వతారోహణ చేసేవారిలో శక్తికి ఇవన్నీ అవసరమే అనే ఆపోహ మనందరిలోనూ ఉంది. జీవ హింస చేయకూడదని, పూర్తి శాకాహారులు కూడా బలవంతులుగా ఉండవచ్చని నిరూపించడానికే కిలిమంజారో పర్వతారోహణ చేశాను. విదేశాల్లో వీగన్‌గా.. జర్నలిజంలో డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాద్‌లోని న్యూస్ చానెళ్లలో జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేశాను. అవకాశం రావడంతో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాను. రేడియో మాధ్యమంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది శాకాహారుల(వీగన్)ను కలిశాను. మనదేశంలో వీగన్ ఫుడ్‌కి సంబంధించిన శోధన ఎంతో జరుగుతుంది. కానీ, పూర్తి శాకాహారులు అక్కడ పర్వతారోహణతో పాటు ఎన్నో వైవిధ్యమైన పనుల్లో చురుకుగా పాల్గొనడం చూశాను. వారితో కలిసి అవగాహనా సదస్సుల్లో పాల్గొన్నాను. జంతువులను హింసించి తయారు చేసే ఉత్పత్తులన్నింటికీ అప్పుడే స్వస్తి చెప్పాను. పాలు–పెరుగు వంటివి కూడా కొబ్బరి, బాదం మొదలైన ఉత్పత్తుల నుంచి తయారు చేసినవే వాడటం మొదలుపెట్టాను. ఐదేళ్లుగా కేవలం ప్రకృతి సంబంధిత ఉత్పత్తులతోనే నా జీవనం కొనసాగుతోంది. సౌందర్య ఉత్పత్తులు, ఇంటికి సంబంధించినవి ఏ వస్తువైనా జీవహింస ఏ మాత్రమూ లేకుండా తయారు చేసినవే వాడుతుంటాను. చాలావరకు వాటిని నేనే స్వయంగా తయారుచేసుకుంటాను. మొదట అమ్మానాన్నలే వద్దన్నారు చిన్ననాటి నుంచి శాకాహారిని ఏమీ కాదు. నా ఈ పద్ధతులను మొదట అమ్మానాన్నలే వద్దన్నారు. అలాంటి ఉత్పత్తుల ద్వారా బలం వస్తుందా అని వారి సందేహం. కిలిమంజారో ప్రపంచ ప్రసిద్ధ పర్వతాలలో ఒకటి. అలాంటి పర్వతాన్ని ఆరోహించడం ద్వారా నా బలమెంతో మా అమ్మనాన్నలకే కాదు మన దేశ ప్రజలకూ అర్థమైంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు జరిపి, అప్పుడే పర్వతారోహణకు అనుమతినిస్తారు. ఆఫ్రికాలో ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలామంది వస్తుంటారు. కానీ, కొంతమంది బలవంతులు అనుకున్నవారు కూడా కొంత ఎత్తు అధిరోహించాక వెనుదిరిగిన వారున్నారు. స్పృహ తప్పి పడిపోవడం, వారిని రెస్క్యూ టీమ్ రక్షించడం వంటి సంఘటనలు కూడా చూశాను. ఈ పర్వతారోహణ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. మాంసాహారం తింటే బలం వస్తుందనడంలో అర్థం లేదు. జీవ హింస లేకుండా జీవిద్దాం. మూగజీవాలను ప్రేమిద్దాం’’ అని శాకాహారిగా తన అభిప్రాయాన్ని, పర్వతారోహణ అనుభవాలను తెలిపారు శారద. – నిర్మలారెడ్డి -
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి వీగన్
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత స్వార్థాల కోసం సాటి జీవులను హింసించకూడదని, ప్రతి జీవికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించడం మన బాధ్యతని వినూత్నంగా అవగాహన కల్పిస్తోంది నగరానికి చెందిన వీగన్ శారద. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏకంగా ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద తన ఐదుగురు బృందంతో కలిసి ఈ నెల 10వ తేదీన చేరుకున్నారు. అంతేగాకుండా కిలిమంజారో అధిరోహించిన తొలి వీగన్‌గా శారద రికార్డు నమోదు చేశారు. జంతు సంబంధిత పదార్థాలు, వస్తువులను వాడకుండా వాటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పాటుపడే వారిని వీగన్స్గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీగనిజాన్ని ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను ప్రపంచంలో అతి ఎత్తయిన ఈ పర్వతారోహనకు సిద్ధమయ్యానని ఆమె పేర్కొన్నారు. మన నిత్య జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాలుగా జీవహింసకు కారణమవుతున్నామని, అందులోని హింస, వేదనకు వ్యతిరేకంగా తాను వీగన్‌గా మారానని తెలిపింది. వీగన్‌గా మారడం క్లిష్టతరం కాదని, దశలవారీగా ప్రయతి్నస్తే అందరూ వీగన్స్గా మారవచ్చని, అందకు తానే నిదర్శనం అన్నారు. చదవండి: దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని.. -
‘కిలిమంజారో’ చాన్స్.. సాయం చేయండి ప్లీజ్
మరిపెడ రూరల్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన బాలుడు ఎంపికయ్యాడు. భూక్యా రాంమూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు భూక్యా జశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. జశ్వంత్‌కు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాక్‌ౖక్లైంబింగ్ పోటీల్లో మొత్తం 40 మంది పాల్గొనగా జశ్వంత్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వ తం అధిరోహణకు జశ్వంత్ ఎంపికయ్యాడు. జూలై 22న అతను బయలుదేరాల్సి ఉంది. ఇందుకు ప్రయాణ ఖర్చుల కింద రూ.3 లక్షలు అవసరం. దాతలు సహకారం అందిస్తే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వస్తానని, భవిష్యత్‌తో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తానని జశ్వంత్ ఈ సందర్భంగా తెలిపాడు. సాయం చేయదలచిన వారు 70750 13778 నంబర్ ద్వారా గూగుల్, ఫోన్ పే చేయాలని కోరాడు. -
కిలిమంజారోను అధిరోహించిన హైదరాబాద్ బుడతడు
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు అంటూ కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో అందరూ దాదాపు ఇలాగే చేసి ఉంటారు.. కానీ హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు. -
కిలిమంజారోపై చిన్నారి రిత్విక
అనంతపురం: ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంగా ఖ్యాతిగాంచిన కిలిమంజారో పర్వతాన్ని జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి రిత్విక గత శుక్రవారం అధిరోహించింది. పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత జాతీయడ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఫొటోను చిన్నారి ప్రదర్శించింది. కాగా, తాడిమర్రి మండలం ఎం.అగ్రహానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్విక.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అరుదైన రికార్డుకు దూరమవుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. రికార్డుల సాధనకు బయలుదేరిన చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన కలెక్టర్‌ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకోవడం విశేషం. చదవండి: ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా.. కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు -
కిలిమంజారోపై ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఖాతాలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఈయన ఎక్కారు. నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న జోషి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నారు. జోషి పంజాబ్‌కు చెందిన వ్యక్తి. పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పట్టా పుచ్చుకుని దంత వైద్యుడయ్యారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుని అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోని మౌంట్ రీనాక్‌ను అధిరోహించారు. అన్వితారెడ్డి కూడా... యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. భువనగిరికి చెందిన పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళల కమార్తె అన్విత భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో 2018 నుంచి రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో శిక్షణ పొందారు. అనంతరం ఖిల్లా వద్దనే శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ‘చదువుతో పాటు పర్వతారోహణ అంటే ఇష్టం. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. పర్వతారోహణకు గురువులు శేఖర్‌బాబు, పరమేశ్ ఎంతగానో ప్రోత్సహించారు’అని ఆమె అన్నారు. -
సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు
సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు సెలక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయా మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఔట్రైవల్ అడ్వెంచర్స్ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్వెంఛర్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు. పర్వతారోహణ ఇలా.... 2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు. కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్ (ఫైల్) యువకిరణం చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్ కాలనీకి చెందిన సాయికిరణ్‌కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్ క్లైంబింగ్లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్‌టెంజింగ్‌కాన్‌లో శిక్షణ పొంది ఏ గ్రేడ్ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్‌లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్ 2019 డిసెంబర్లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సంధ్య ఇంటర్ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్‌లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్‌కు తరలించి అక్కడ ఫైనల్ సెలక్షన్స్ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తోంది. -
పర్వతాన్ని అధిరోహించిన దివ్యాంగుడు
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్ తన స్వగ్రామంలో ఉన్న పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. ఉన్నత విద్యాభ్యాసం కొయ్యలగూడెం గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాగింది. అక్కడి నుంచి ఇంటర్ చదివేందుకు అప్పటి జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్లాడు. ప్రభుత్వ కళాశాలలో చేరి ఓ గది అద్దెకు తీసుకొని చదువుంటూ ఉండే వాడు. తాను అద్దెకు ఉన్న ఇంటిపై ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతానికి గురై శేఖర్ తీవ్రగాయాల పాలయ్యాడు. వైద్యులు కుడి చేయి, ఎడమ కాలును తొలగించారు. అసలే నిరుపేద కుటుంబం ఆపై చేతికి అందిన కుమారుడి అవిటితనంతో కుటుంబం మరింత చితికింది. కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉంటూ కుటుంబ బాధలు గుర్తించి స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. అందులో భాగంగా సెల్‌ఫోన్ షాప్ పెట్టుకోగా నష్టం చవిచూసింది. ఇదంతా తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. తర్వాత కొంతమంది మిత్రుల సాయంతో కృత్రిమ అవయవాలు అమర్చుకోగలిగాడు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లలో అద్భుతాలు.. తనకు కాలు, చెయ్యి లేకున్నా ఎన్నో అద్భుతాలకు కేంద్ర బిందువుగా మారాడు శేఖర్‌గౌడ్. కొంతమంది స్ఫూర్తితో ముందుగా నడకపై దృష్టి సారించాడు. క్రమక్రమంగా రన్నింగ్ చేయడం ప్రారంభించి విజయవంతమయ్యాడు. తనలాంటి ఎందరో దివ్యాంగులకు, విద్యార్థులకు శిక్షణ సైతం అందించాడు. కొంతకాలం తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్లపై దృష్టిపెట్టాడు. కొద్ది కాలానికే వీటిలోనూ సక్సెస్ అయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నో రకాల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాడు. మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ దివ్యాంగుడు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శేఖర్ నిరంతరం శ్రమించేవాడు. గత ఆగస్టులో యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు కొంత మంది సభ్యులతో కలిసి బయలుదేరాడు. ఆ బృందంలో ఇతనొక్కడే దివ్యాంగుడు. 5642మీటర్ల ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని కేవలం 17గంటల్లోనే అధిరోహించి అద్భుతం సృష్టించాడు. అక్కడే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వ్యక్తి ఇతనే. తొలి భారతీయ దివ్యాంగుడు సైతం ఇతనే కావడం గర్వించదగ్గ విషయం. తాజాగా కిలిమంజారో పర్వత అధిరోహణ.. అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని నిరంతరం భావించే శేఖర్ అందుకోసం నిరంతరం పరితపిస్తుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికా దేశంలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. గత నెల 22న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన సహచరురాలు భావనతో(దివ్యాంగురాలు కాదు) కలిసి నడక ప్రారంభించాడు. అదే నెల 27న పర్వతాన్ని అధిరోహించి తన ఘనతను చాటా డు. ఈ మేరకు అధికా రికంగా ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఈ పర్వతాన్ని అధి రోహించిన తొలి భారతీయ దివ్యాం గుడిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆర్థిక సహకారం లేక నానా అవస్థలు.. ఎన్నో రకాల సాహసాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న శేఖర్‌కు ఆర్థికపరమైన సహకారం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాడు. జీవనం కోసం ఆస్పత్రిలో పని చేయగా వచ్చే రూ. 13వేలతో పూటగడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక్కో సాహసయాత్రకు రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు ఖర్చవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తున్న శేఖర్‌కు ప్రభుత్వాలు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక చేయూతను అందించాల్సి ఉంది. ఎత్తైన పర్వతాల అధిరోహణ.. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా శేఖర్ ముందుకు సాగుతున్నా డు. ఈ ఏడాది ఆగస్టులో యూరప్‌లోని మౌంట్ఎ ల్బ్రూస్ను, గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. సౌత్ అమెరికా అర్జెంటీనాలోని 6962 మీటర్ల ఎత్తైన మౌంట్ఎకాన్కాగా, నార్త్అమెరికాలోని అల్హక్కాలోని 6194మీటర్ల ఎత్తులో ని మౌంట్బెనాలి, అంటార్కిటికా దేశంలో 4892మీటర్ల ఎత్తులోని మౌంట్విన్సన్మాసిఫ్, ఆస్ట్రేలియాలోని 2282 మీటర్ల ఎత్తులోని మౌంట్కాస్కిస్కోలతో పాటు నేపాల్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (8848మీటర్లు)ను అధిరోహించాలని శేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పని చేస్తూనే.. పేద కుటుంబం కావడంతో శేఖర్‌కు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉండేవి. సొంత ఊరిని విడిచి హైదరాబాద్‌కు వెళ్లిన శేఖర్‌కు ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. మూడు పూటలు తిండి కూడా తినలేని పరిస్థితి. ఈ బాధలను అధిగమించేందుకు ప్రైవేట్‌గా ఏదైనా ఉద్యో గం చేయాలనుకున్నాడు. ప్రణవ్ ఆస్పత్రిలో ఓ ఉద్యోగంలో చేరాడు. నెల రోజులపాటు పని చేస్తే వచ్చే రూ.. 13వేలతో జీవనం సాగిస్తున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యం ప్రమాదంలో కాలు, చెయ్యి కోల్పోయా. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా. గత ఆగస్టులో యూరప్‌లోని అత్యంత ఎత్తైన మౌంట్‌ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహిం చా. గత నెల దీపావళిన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నదే నా జీవిత లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దాతలు నాకు తోడ్పాటునందించాలి. – చిదుగుళ్ల శేఖర్‌గౌడ్ -
అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్బ్రూస్
సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు) : రష్యాలోని అతిపెద్ద ఎల్బ్రూస్ పర్వతాన్ని నిడదవోలుకు చెందిన పర్వతారోహకుడు కంచడపు లక్ష్మణ్ బుధవారం అధిరోహించాడు. రష్యాలో ఈనెల 6న 5,642 మీటర్లు ఎత్తు ఉన్న ఎల్బ్రూస్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించగా బుధవారం నాటికి అధిరోహించి అరుదైన ఘనతను సాధించాడు. 2018 సెప్టెంబర్‌లో ఆఫ్రికా ఖండంలోనే 5,886 మీటర్లు ఉన్న అతి పెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన లక్ష్మణ్ ఇప్పుడు ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించి.. అక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటాన్ని ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి లక్ష్మణ్‌కు వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం. వైసీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పర్వతారోహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.లక్ష, నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు రోటరీక్లబ్ అధ్యక్షుడు అయినీడి పల్లారావు రూ. 50 వేల సాయం అందించారు. మాజీ రోటరీక్లబ్ అధ్యక్షులు కారింకి సాయిబాబు రూ.10 వేలు అందించారు. -
కిలిమంజారో ఎక్కేశాడు
సాక్షి, నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్య్సకార యువకుడు గోసల రాజు దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతాన్ని ఈ నెల 5న అధిరోహించినట్లు రాజు తెలిపాడు. ఈ నెల మూడో తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించి 5వ తేదీన దిగ్విజయంగా ఎక్కినట్టు పేర్కొన్నాడు. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు. ఇంటర్ వరకూ చదువుకున్న రాజు గతంలో 2018 మే17వ తేదీ ఎవరెస్టు శిఖరం, 2018 సెప్టెంబర్ 18న రష్యాలోని మౌంట్ ఎలబ్రస్, 2019 ఫిబ్రవరి 14న అంకాగ్వా పర్వతాలను కూడా అధిరోహించాడు. హైదరాబాద్‌లో ని ట్రాన్స్‌జెండర్ అడ్వంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహస యాత్రలు చేస్తున్నట్లు రాజు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికాలోని దేనాలిలను అధిరోహించడమే తన లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు. -
కిలిమంజారో అధిరోహించిన పుణే బుడతడు
న్యూఢిల్లీ : పర్వతారోహణ అనేది ఎంత కష్టమైనదో అందరికి తెలిసిందే. ఈ సాహసం చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాణాలతో బయట పడతామో లేదో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటింది.. పుణేకు చెందిన తొమ్మిదేళ్ల అద్వైత్ ఇవేమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆఫ్రికాలోనే అత్యంత ఎతైన కిలిమంజారో పర్వతాన్ని అద్వైత్ అధిరోహించాడు. ఈ పర్వతం సుమద్ర మట్టానికి 19,341 ఫీట్ల ఎత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తన ట్రైనర్ సమీర్ సారథ్యంలో అద్విత్ జూలై 31వ తేదీన ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అద్వైత్ మాట్లాడుతూ.. ‘పర్వతారోహణ అనేది చాలా కష్టమైనది.. కానీ చాలా సరదాగా కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేటప్పడు గొప్ప అనుభూతి కలుగుతుంది. నేను చాలా త్వరగా ట్రెక్కింగ్ పూర్తి చేయాలనుకున్నాను. కానీ పర్వతాల్లో ఉన్న అందాలను చూడటానికి నేను చాలా సార్లు విరామం తీసుకున్నాను. పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అలాగే ఉష్ణోగ్రతలు మైనస్‌లలో ఉంటాయి. అలాగే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంద’ని తెలిపాడు. అయితే అద్వైత్ తనకు ఆరేళ్లున్నప్పుడే(2016లో) ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ఏడు రోజుల్లోనే ఆ ఘనత సాధించాడు. అలాగే వచ్చే ఏడాది యూరప్‌లో ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు అద్వైత్ సిద్దమవుతున్నాడు. అద్వైత్ సాధించిన ఘనతపై అతని తల్లి పాయల్ ఆనందం వ్యక్తం చేశారు. అద్వైత్ను చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి అద్విత్ రెండు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. అద్వైత్ దినచర్య విషయానికి వస్తే.. రోజు గంటపాటు స్విమ్మింగ్ చేస్తాడు. మరో గంట పాటు ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ ఆడతాడు. ఆ తర్వాత గంటపాటు ఆర్మీ జవాన్ల చేసే విన్యాసాలు చేస్తాడు. అద్వైత్కు ఉన్న పట్టుదల చూస్తే గర్వంగా ఉంది. పర్వతారోహణ చివరి రోజు అద్విత్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడ’ని చెప్పారు. -
ఆర్థికసాయం చేయండి
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): ఆర్థికస్థోమత లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసం ఉంది. అందరిలో ఒకరిలా కాకుండా నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరో. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగడంతో గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. సాధించాలనే తపన, పట్టుదలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరోది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామం. తండ్రి అశోక్, తల్లి కంసమ్మ రోజూ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్ ప్రాథమిక విద్యాబ్యాసం అనంతసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిండాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు ఎంపిక చేశారు. అందులో శ్యామ్ ప్రసాద్ ఒకరు. దీనికోసం భువనగిరిలో కోచ్ శేఖర్‌బాబు వద్ద 15 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2014లో 25 రోజుల పాటు 20 మంది విద్యార్థులతో కలిసి హిమాలయ పర్వతాన్ని అదిరోహించాడు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన మలావత్ పూర్ణ హిమాలయ పర్వతాలు అధిరోహించిన సభ్యుల్లో శ్యామ్‌ప్రసాద్ కూడా సభ్యుడిగా ఉన్నడు. దాతలు సహకరించాలి హిమాలయ పర్వతాలు అధిరోహించిన స్ఫూర్తితో ప్రపంచంలోనే రెండో ఎత్తైన సౌతాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యాం ప్రసాద్ ఎంపికయ్యాడు. కిలీమంజారో వెళ్లడానికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు కూలీలు కావడంతో వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ నెల 25వ తేదీ వరకు చెల్లించాలి. లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుందని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తే జిల్లా పేరును ప్రపంచస్థాయిలో నిలబెడతానని విద్యార్థి శ్యాం ప్రసాద్ పేర్కంటున్నాడు. -
అఖిల్‌కు మరో అవకాశం
సాక్షి, హన్మకొండ: వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం దేశపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల రవీందర్, కోమల దంపతుల కుమారుడైన పర్యతారోహకుడు రాసమల్ల అఖిల్‌కు మరో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆర్థిక స్థోమత లేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే ఆప్రికా దేశంలోని కిల్మంజారో, ఉత్తరాఖండ్‌లోని పంగర చుల్లా పర్వతాలాను విజయవంతంగా అధిరోహించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం నేపాల్‌లోని 6,100 మీటర్ల ఎత్తు కలిగిన మౌంట్ కనామో పర్యతాన్ని అధిరోహించే అవకాశం అఖిల్‌కు వచ్చింది. ఆర్థికంగా అంత ఖర్చు భరించలేని అఖిల్ మౌంట్ కనామో పర్యతరోహణ లక్ష్యం సందేహాస్పదంగా మారింది. కఠినమైన పర్యతారోహణను సాహసంతో ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరువవుతుంది. అయితే అఖిల్‌కు సాహసం, శారీరక దారుఢ్యం ఉన్నా ఆర్థిక వనరుల లోటు అడ్డంకిగా మారింది. మౌంట్ కనామో పర్యతారోహణకుగాను నేపాల్‌కు ఆగస్టు 4న వెళ్లాల్సి ఉంది. పర్యతారోహణకు సంబంధించిన ప్రక్రియ ఆగస్టు 9న మొదలవుతుంది. దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే తెలంగాణ రాష్ట్రం పూర్వ వరంగల్ జిల్లా నుంచి 6,100 మీటర్ల ఎత్తు ఉన్న పర్యతాన్ని అధిరోహించిన రికార్డు సాధించే అవకాశం ఉంది. అఖిల్‌కు ఆర్థిక సాయం చేయదలచిన వారు 9963925844 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఎల్‌బ్రస్‌నైనా ఎక్కేస్తా!
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): ఇప్పటికే ఆఫ్రికా ఖండం టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రాయలసీమ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చిక్కెం రమేష్.. దాతలు సహకరిస్తే మరో సాహస యాత్రకు సై అంటున్నాడు. మంత్రాలయం మండలం వి. తిమ్మాపురానికి చెందిన ఆనందప్ప, ఆశీర్వాదమ్మ దంపతుల కుమారుడు రమేష్ ఆర్‌యూలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాడు. గత ఏడాది 40 మంది యువకులతో కలిసి సాహసయాత్ర చేపట్టిన రమేష్ కిలిమంజారోపై మువన్నెల జెండా,రాయలసీమ యూనివర్సిటీ పతాకాన్ని రెపరెపలాడించి ప్రశంసలు అందుకున్నాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. అయితే చిన్నప్పటి నుంచి పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న రమేష్ .. కల సాకారం చేసుకునే దశలో ముందడుగు వేశాడు. పర్వతారోహణ కోసం యువజన సంక్షేమ శాఖ వారు గత ఏడాది ఫిబ్రవరి 12న జిల్లా స్థాయి, 24న రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగా ఏపీలో 150 మంది హాజరయ్యారు. ఇందులో 60 మందిని ఎంపిక చేసి కృష్ణా జిల్లా కేతనకొండ సీబీఆర్ అకాడమీలో ఐదు రోజులు, మార్చి 1 నుంచి జమ్మూ కశ్మీర్ పహల్గావ్లో 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అనంతరం కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన 40 మందిలో రమేష్ కూడా ఉన్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలకు కిలిమంజారో పర్వతారోహణ యాత్ర ప్రారంభించి 13వ తేదీ ఉదయం 8:20 గంటలకు 5,895 మీటర్ల (19,341అడుగులు) పర్వతాన్ని అధిరోహించారు. పర్వతంపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల 10వ తేదీ యూరఫ్ ఖండంలో అతి ఎత్తయిన ఎల్బ్రస్ (రష్యా) పర్వతాన్ని అధిరోహించేందుకు శిక్షణ పొందాడు. మౌంట్ ఎల్బ్రస్ ఎక్స్పెండేషన్ మిషన్ –2019 హైదరాబాద్ ఇందుకోసం అవకాశం కల్పించారు. అయితే పర్వతారోహణకు అయ్యే ఖర్చు భరించే స్థితిలో లేని రమేష్ దాతలు సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. సాయం చేస్తే ఎల్బ్రస్ పర్వతాన్ని కూడా అధిరోహించి జిల్లా, యూనివర్సిటీకి కీర్తి ప్రతిష్టలు తెస్తామని చెబుతున్నాడు. -
గిరిపుత్రుడి సాహస యాత్ర
బంజారాహిల్స్: కొందరు అటు చదువులోనో, ఇటు క్రీడల్లోనో రాణిస్తుంటారు. మరికొందరు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ రెండింటితో పాటు మరిన్ని నైపుణ్యాలపై ప్రతిభను చాటేవారు కొందరే ఉంటారు. ఆ కోవలోకి చెందాడు ఈ గిరిజనపుత్రుడు. పర్వతారోహణమే కాకుండా కరాటే, జానపదగేయ రచయిత, గాయకుడు, స్టిక్ ఫైటర్, ఫిట్టింగ్ మాస్టర్, నటుడు, డాన్సర్ ఇలా అన్ని కలిపితే ఈ చిన్నికృష్ణ నాయక్ అవుతాడు. పుట్టింది గిరిజన తండాలో.. తల్లిదండ్రులది సాధారణ రైతు కుటుంబం.. కుటుంబ పోషణ అంతంత మాత్రమే.. అయితేనేం.. ఆ యువకుడు తాను అనుకున్నది సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఔరా.. అనిపించుకుంటున్నాడు ఈ గిరిపుత్రుడు. అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రామావత్నారాయణస్వామి నాయక్ కొడుకు రామావత్ చిన్నికృష్ణనాయక్(26) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీపీఎడ్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14లోని లంబాడి బస్తీలో ఉంటున్న చిన్నికృష్ణనాయక్కు పర్వతారోహణ అంటే అమితాసక్తి. 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అలవోకగా గుట్టలెక్కేవాడు. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. గతేడాది నవంబర్ 13న కిలిమంజారో పర్వతారోహణ చేసి రికార్డు సృష్టించాడు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనక్ పర్వతాన్ని అధిరోహించాడు. జమ్మూకాశ్మీర్‌లోని తులియన్సిక్ పర్వతారోహణ చేశాడు. అదే ప్రాంతంలోని మరో ఎత్తైన పర్వతం బైసరన్ అధిరోహించాడు. ఈ లక్ష్యాలన్నీ సాధించిన తర్వాత కిలిమంజారో పంపించడం జరిగింది. ప్రత్యేక శిక్షణ ద్వారా 40 మందిని ఎంపిక చేయగా అందులో కృష్ణ 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా రష్యాలో పర్వతారోహణ చేసే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. జులై 20వ తేదీన రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆయనకు లేఖ రాశారు. చిన్నికృష్ణనాయక్ కేవలం పర్వతారోహణమే కాకుండా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందేల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థిక సాయం కావాలి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో బతుకుతున్న చిన్నికృష్ణనాయక్కు రష్యాలో ఎల్బ్రోస్ పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. దేశంలో ఈ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో కృష్ణ కూడా ఒకరు. అయితే.. ఇక్కడికి వెళ్లడానికి సుమారుగా రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 83744 34274 నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నాడు. ఈ పర్వతారోహణ చేసి భారతదేశ కీర్తిని దశదిశలా చాటుతాని పేర్కొంటున్నాడు. తనకు ఆర్థిక అండ అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. -
కిలిమంజారోకు వీకోట యువకుడు
పలమనేరు: ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాల్లో ఒకటైన టాంజానియాలోని కిలిమంజారో పర్వతా రోహణకు వీకోట మండలం పాపేపల్లికి చెందిన యువకుడు ధనుంజయ గౌడ్ ఎంపికయ్యాడు. ఇతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి పర్వతారోహణమంటే ప్రాణం. తిరుపతిలోని ఎస్వీయూలో బీపీఈడీ చేస్తున్న ఇతను రాష్ట్ర యువజనుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఇందులో పాల్గొన్న వారిలో 8మంది మాత్రం ఎంపికయ్యారు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన ఎంపికైన 140 మందిని విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్లో మెరుగైన శిక్షణనిచ్చారు. వీరిలో 60మందిని ఎంపికచేసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. అక్కడ 9 అంశాలపై జరిగిన సామర్థ్య పరీక్షల్లో ధనుంజయ సఫలీకృతమయ్యాడు. దీంతో రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఈనెల 7న బయలుదేరి వెళ్లనున్నట్టు ధనుంజయ గౌడ్ సాక్షికి తెలిపారు. ఇతన్ని నియోజకవర్గ వాసులు అభినందిస్తున్నారు. -
మాస్టర్ తుకారాంకు రాష్ట్రపతి అభినందన
సాక్షి, న్యూఢిల్లీ : పిన్నవయస్సులోనే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గిరిజన యువకుడు మాస్టర్ ఆంగోత్ తుకారాంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. కిలిమాంజారో పర్వతంపై జాతీయ గీతాలాపనతో 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ హెల్మెట్ వాడకంపై తుకారాం సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తేజావత్ ఆధ్వర్యంలో తుకారాం రాష్ట్రపతిని బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తుకారాం ధైర్య సాహసాలను, సామాజిక స్పృహను కోవింద్ ప్రశంసించారు. సౌత్ కౌల్ రూట్ నుంచి ఎవరెస్టును ఎక్కబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్‌లు తుకారాంను ఘనంగా సన్మానించారు. ఆగస్టు 5న ఐఐటీహెచ్‌కి రాష్ట్రపతి రాక సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ రానున్నారు. ఆగస్టు 5న ఐఐటీలో జరిగే స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.