పూజకు ఘన స్వాగతం
ధర్మారం : ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి వచ్చిన ధర్మారం మండలం మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులం విద్యాలయం విద్యార్థినికి వావిళ్ల పూజకు శనివారం ఆ విద్యాలయం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సన్మానించారు. క్రీడామైదానం వరకు ఎత్తుకుని ఊరేగించారు. భావోద్వేగానికి గురైన పూజ ఆనందభాష్పాలు రాల్చింది. కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపాల్ గిరిజాదేవి, పద్మజా, పీఈటీ అనూషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పూజకు ప్రభుత్వ చీఫ్‌విప్ సన్మానం
పూజను ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త నర్సింహం, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచు గంధం మల్లయ్య, వేల్పుల నాగరాజు, నూతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.