Nivetha Thomas places our indain flag on Mount Kilimanjaro mountain post goes viral
Sakshi News home page

Nivetha Thomas: కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్‌ భామ

Published Sat, Oct 23 2021 5:03 PM | Last Updated on Sat, Oct 23 2021 5:51 PM

Nivetha Thomas Makes It To Mount Kilimanjaro Photo Goes Viral - Sakshi

Mount Kilimanjaro: ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని తక్కువ వ్యవధిలోనే సాధించి, నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్‌ నివేదా థామస్‌. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్‌ చేసింది.

నివేదాకు ట్రెక్కింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో శిక్షణ తీసుకుంది. తాజాగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్‌ సాబ్‌’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తుంది. . ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్‌తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement