తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం '35 చిన్న కథ కాదు'.. నివేదా థామస్, అరుణ్‌దేవ్ పోతుల, విశ్వదేవ్, గౌతమి, ప్రియదర్శిని, దర్శకుడు కే.భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంది కిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. సృజన్ వాల్టైర్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై సృజన్ వరబోల, సిద్ధార్థ్ రాళ్లపల్లి, కలసి నిర్మించిన ఈ చిత్రం గత సెప్టెంబర్‌లో విడుదల మంచి విజయాన్ని సాధించింది.
మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందిన బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి ఇష్టాఇష్టాలు వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నివేద థామస్ సహజత్వంతో కూడిన నటన చిత్రానికి అదనపు బలంగా నిలిచింది. ఆమె ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం విశేషం.
తెలుగులో విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం ఇప్పుడు '35 చిన్న విషయం ఇల్లై' పేరుతో తమిళంలోకి అనువాదమై క్రిస్మస్ సందర్భంగా కోలీవుడ్‌లో విడుదలైంది. దీన్ని తెలుగులో నిర్మించిన నిర్మాతలే తమిళంలోనూ విడుదల చేశారు. దీనికి నికేశ్ బొమ్మి చాయాగ్రహణం, వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి ఆదరణ దక్కడం విశేషం. తెలుగు వర్షన్ ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment