kilimanjaro treckers
-
కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ భామ.. ఫోటో వైరల్
Mount Kilimanjaro: ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని తక్కువ వ్యవధిలోనే సాధించి, నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్ నివేదా థామస్. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. నివేదాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో శిక్షణ తీసుకుంది. తాజాగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తుంది. . ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్‌తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. I made it 😊 To the top of the tallest free standing mountain in the world. Mount Kilimanjaro pic.twitter.com/InPptVTjit — Nivetha Thomas (@i_nivethathomas) October 23, 2021 -
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి వీగన్
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత స్వార్థాల కోసం సాటి జీవులను హింసించకూడదని, ప్రతి జీవికి స్వేచ్ఛాయుత జీవనాన్ని అందించడం మన బాధ్యతని వినూత్నంగా అవగాహన కల్పిస్తోంది నగరానికి చెందిన వీగన్ శారద. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏకంగా ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద తన ఐదుగురు బృందంతో కలిసి ఈ నెల 10వ తేదీన చేరుకున్నారు. అంతేగాకుండా కిలిమంజారో అధిరోహించిన తొలి వీగన్‌గా శారద రికార్డు నమోదు చేశారు. జంతు సంబంధిత పదార్థాలు, వస్తువులను వాడకుండా వాటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పాటుపడే వారిని వీగన్స్గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీగనిజాన్ని ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను ప్రపంచంలో అతి ఎత్తయిన ఈ పర్వతారోహనకు సిద్ధమయ్యానని ఆమె పేర్కొన్నారు. మన నిత్య జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాలుగా జీవహింసకు కారణమవుతున్నామని, అందులోని హింస, వేదనకు వ్యతిరేకంగా తాను వీగన్‌గా మారానని తెలిపింది. వీగన్‌గా మారడం క్లిష్టతరం కాదని, దశలవారీగా ప్రయతి్నస్తే అందరూ వీగన్స్గా మారవచ్చని, అందకు తానే నిదర్శనం అన్నారు. చదవండి: దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని.. -
కొండలెక్కే చిన్నోడు
కృషి ఉంటే ఎంతటి ఎత్తులకైనా చేరుకోవచ్చని రుజువు చేస్తున్నాడు రాసమల్ల అఖిల్. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా మంచు పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాడు. హన్మకొండలోని నయింనగర్కు చెందిన రాసమల్ల రవీందర్, కోమల కుమారుడు అఖిల్. పదిహేనేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి నుంచి బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి రవీందర్ ఆటో నడుపుతూ, తల్లి కోమల వసతి గృహంలో పని చేçస్తూ జీవనం సాగిస్తున్నారు. పదోతరగతి తర్వాత సివిల్ డిప్లొమా పూర్తి చేసిన అఖిల్ పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేకపోయాడు. కానీ తన ఉన్నత ఆశయాన్ని మాత్రం వదులు కోలేదు. జీవితంలో గొప్ప పేరు సంపాదించాలంటే ఏదైనా సాధించాలనే తపనతో అఖిల్ చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఖాళీ సమయాల్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. హన్మకొండలో నిర్వహించిన 10కె, 5కె రన్లో అఖిల్ పాల్గొన్నాడు. ఈ పోటీలలో ఫస్ట్ వచ్చాడు. ఆరు నెలల శిక్షణ యాదాద్రి జిల్లా భువనగిరిలో పర్వతాలు ఎక్కడంపై శిక్షణ తీసుకున్నాడు. యాదాద్రి జిల్లా భువనగిరి గుట్ట, జయశంకర్ భుపాలపల్లి జిల్లా పాండవుల గుట్టలను ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు. అలాగే దీనిపై 6 నెలల పాటు భువనగిరిలో శిక్షణ తీసుకున్నాడు. పట్టుదలతో ముందుకు సాగి ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చు అని నిరూపించాడు. కుర్రాడి ప్రతిభను చూసి దక్షిణాఫ్రికాలో కిలిమంజారో పర్వతం ఎక్కే అవకాశం అఖిల్‌కు వచ్చింది. మూడు పర్వతాలు దక్షణాఫ్రికా ఈశాన్య టాంజానియాలోని కిలిమంజారో పర్వతం 5895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఫిబ్రవరి 19, 2019న ప్రారంభమై 7 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు అఖిల్. ఉత్తరాఖండ్‌లోని పంగర్ చూల్లా అనే పర్వతం 5100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని అఖిల్ జూన్ 19, 2019న ఏడు రోజుల్లో అధిరోహించాడు. లడక్‌లోని స్టాక్కాంగ్రి అనే పర్వతం 6153 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని ఆగష్టు10, 2019న ప్రారంభమై 12 రోజుల్లో అధిరోహించాడు. ఆగష్టు 15న పర్వతం పైన 125 మీటర్ల జాతీయ జెండాను ఎగురవేశారు. రాతితో డిజైన్ చేసిన కాకతీయ కళాతోరణాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బహూకరించారు. దానిని స్టాక్కాంగ్రి పర్వతం పైన పెట్టి వచ్చాడు అఖిల్. గిన్నిస్ బుక్ లడక్‌లోని స్టాక్కాంగ్రి 6153 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం పైన 125 మీటర్ల జాతీయ జెండాను ఆగష్టు 15న ఎగరవేశారు. 125 మీటర్ల జాతీయ జెండాను అంత ఎతై ్తన పర్వతం పై ఎగురవేయడం ఇదే తొలిసారి కావడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు లభిస్తుందని ఎదురుచూస్తున్నాడు అఖిల్.– గజవెల్లి షణ్ముఖరాజు,సాక్షి వరంగల్ రూరల్ నన్ను నేను మర్చిపోయాను కిలిమంజారో పర్వతం ఎక్కిన తరువాత ఆ పరిసరాలను చూసి నన్ను నేను మర్చిపోయాను. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఒక పేద కుటుంబంలో పుట్టి ఇక్కడకు వరకు చేరుకున్నాను అని గర్వంగా అనిపించింది. ఎవరెస్ట్‌ను అధిరోహించాలనే కల తీరేందుకు శ్రమిస్తున్నా. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాను. పేదరికం నా సంకల్పానికి అడ్డుగా నిలిచినప్పటికీ నాతల్లితండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటున్నా. – రాసమల్ల అఖిల్ పేదరికం అడ్డుకాకూడదని ప్రపంచంలో ఎతై ్తన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించేందుకు దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉండేందుకు అప్పు తీసుకు వచ్చి మరీ మా అబ్బాయిని పంపించాం. విజయవంతంగా పూర్తి చేశాడు. కిలిమంజారోతో పాటు మరో రెండు ఎల్తైన పర్వతాలు అధిరోహించాడు. చిన్నతనం నుంచి కష్టపడే స్వభావం ఎక్కువ. గొప్పగా పేరు తెచ్చుకోవాలని వాడి అభిలాష. పేదరికం వాడి ఆశలకు అడ్డుకాకూడదని మేం చేసిన ప్రయత్నం ఫలించింది.– రవీందర్, కోమల తల్లిదండ్రులు -
పల్లె నుంచి పర్వత అంచుల వరకు
ఇది ఓ పడతి సాగిస్తున్న ప్రయాణం. బాధ నుంచి నవ్వు వరకు, ఓటమి నుంచి గెలుపు వరకు, పల్లె నుంచి పర్వత అంచుల వరకు ఓ సాధారణ గ్రామీణ యువతి సాగిస్తున్న పయనం. పేరు చిన్నమ్మలు. వయసు 23. ఘనతలు చెప్పాలంటే మాత్రం మాటలు చాలవు. బీసీ రాయ్, కిలిమంజారో పర్వత శిఖరాలను అధిరోహించిన చిన్నమ్మలు ఆ పర్వత సానువుల కంటే పదునైన కష్టాలు అనుభవించింది. ఆ కొండరాళ్ల కంటే కఠినమైన పరిస్థితులకు ఎదురెళ్లింది. ఒక్కొక్కటిగా దాడి చేసిన కష్టాలు ఆమెను అవరోహణ దిశలో పడేస్తే అధిరోహణ అనే విన్యాసంతో ఆమె మళ్లీ బతుకును ఓ దారిన పెట్టింది. ఆ దారిని పదిమందికీ స్ఫూర్తిదాయకంగా మార్చింది. చిన్నమ్మలు విజయం గురించి లోకమంతా చెప్పుకుంటోంది. అదే సమయంలో ఆమె ఓటములను ఓ సారి చూద్దాం. చిన్నప్పుడే గుండెల్లో ఉండిపోయిన కన్నీటి చెమ్మను గమనిద్దాం. చనిపోయిన అమ్మానాన్నల కోసం చిన్నమ్మలు చేస్తున్న కనిపించని అన్వేషణకు ఓ కన్నీటి బొట్టును నివాళిగా అర్పిద్దాం. పల్లె నుంచి.. కష్టపడితే గానీ పూట గడవని నిరుపేద కుటుంబానికి చెందిన వంగర మండలం కొత్తమరువాడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల గేదెల చిన్నమ్మలు ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని 19 వేల అడుగుల కిలిమంజారో పర్వతం, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న బీసీరాయ్ పర్వతాలను అధిరోహించింది. గిరిజన తెగలో ఎరుకుల కులానికి చెందిన ఆమె కుటుంబం వృత్తి రీత్యా వెదురు కర్రలతో బుట్టలు అల్లికలు చేసుకొని జీవనం సాగించేవారు. సీజనల్‌గా బాణసంచా తయారీ వంటి పనులు చేపట్టే వారు. సరిగ్గా ఆమెకు ఏడేళ్ల వయసులో 2002 జూన్ 25న బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి అమ్మ కృష్ణవేణి, తండ్రి రమణ, అక్క విజయగౌరీ, తమ్ముడు సాయి కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్నాన్న గేదెల భాస్కరరావు, పిన్ని దేవిలు ఆమెను అక్కున చేర్చుకుని చదివించారు. పర్వత అంచుల వైపు.. 2015 ఫిబ్రవరి 15న కొత్తమరువాడలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో చిన్నాన్న భాస్కరరావుతోపాటు కుటుంబానికి చెందిన మరో ఏడుగురు మృతి చెందారు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన కష్టాలు ఆమెను కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రాణాపాయం నుంచి బయటపడిన పిన్ని గేదెల దేవి సంరక్షణలో చిన్నమ్మలు పెరిగింది. నా అన్న వాళ్లు లేరన్న బాధ ఆమెలో రగిలిపోయింది. పేదరికంతో జీవనం సాగిస్తూ మనసులో రేగే కసిని కూడగట్టి పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పంతో చదివింది. పర్వతారోహణపై ఇష్టం పెంచుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ.. గమ్యం వైపు అడుగులు వేసి నిజ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుతోంది. సమాజ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి విజయనగరం జిల్లా పార్వతీపురంలో హిందీ బీఈడీలో ట్రైనింగ్ పొందుతోంది. ప్రస్తుతం చిన్నమ్మలు పిన్ని దేవి విజయనగరం జిల్లా మక్కువలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేయడంతో ఆమె సంరక్షణలో ఉంది. శిక్షణ చిన్నమ్మలు జిల్లా యువజన సర్వీసుల శాఖ సహకారంతో డార్జిలింగ్‌లోని హిమాలియన్ మౌంటెయినింగ్ ఇనిస్టిట్యూట్(హెచ్.ఎం.ఐ)లో శిక్షణ పొందింది. ఈ క్రమంలో 2016 నెలలో చైనా సరిహద్దు ప్రాంతమైన డోక్లా సమీపంలో మనదేశం డార్జిలింగ్‌కు కొంత దూరంలో సిక్కిం నుంచి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న బీసీరాయ్ పర్వత శిఖరాన్ని అధిరోహించిన యువతిగా చిన్నమ్మలు కీర్తి గడించారు. అప్పట్లో ప్రభుత్వం జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా ఈ విజయాన్ని సాధించింది. గత ఏడాది ఆగస్టులో కిలీమంజారో పర్వతం అధిరోహించేందుకు సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివశంకర్ సహకారం అందించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే నా లక్ష్యం. కిలీ మంజారో, బీసీరాయ్ పర్వతాలను అధిరోహించా. ప్రపంచంలోని అన్ని ఎత్తైన శిఖరాలని అధిరోహించి ఆండీస్ పర్వతాలపై తనువు చాలించిన మల్లి మస్తాన్ నాకు స్ఫూర్తి. చిన్నతనం నుంచి సమస్యలతో జీవనం సాగించా. మా చిన్నతనంలోనే అమ్మ, నాన్న, తోబుట్టువులు బాణసంచా పేలుళ్లలో మృతిచెందగా, అన్ని తానై ఉన్న మా చిన్నాన్న భాస్కరరావుతోపాటు మా కుటుంబంలో ఉన్న వారంతా ఆ పేలుళ్లలో మరణించారు. చివరికి మా పిన్ని దేవి నా జీవితాన్ని చక్కదిద్దింది. నన్ను ఇంతటి దాన్ని చేసింది. ఆమెకు రుణపడి ఉంటా. – గేదెల చిన్నమ్మలు, పర్వతారోహకురాలు, కొత్తమరువాడ. -
విజయోత్సాహం
సంగారెడ్డి చేరిన ‘కిలిమంజారో’ బాలికలు విద్యార్థులు, అధికారుల ఘన స్వాగతం వినూత్న రీతిలో జాతీయ పతాకం ప్రదర్శన సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి జోన్: ‘కస్తూర్భా’ ఖ్యాతి.. ఖండాంతరాలకు పాకింది. అతి సామాన్యమైన విద్యార్థులు.. అసమానమైన కీర్తిని సాధించారు. అష్టకష్టాల విద్యాభ్యాసంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. అడ్వంచర్ సృష్టించారు. జిల్లా యంత్రాంగం ట్రెక్కింగ్ అడ్డంచర్ సంస్థ చేయూతతో కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన 16 మంది విద్యార్థులతో కలిసి ఈనెల 8న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణకు వెళ్లారు. ఈనెల 14న 19,340 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, జాతీయజెండాతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం, పూర్ణపై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. తిరిగి గురువారం సాయంత్రం బృంద సభ్యులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జాతీయ జెండాల ద్వారా జేజేలు పలికారు. విద్యార్థులు ఓపెన్‌టాప్ జీప్ ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. పటాన్చెరు మండలం చిట్కలూ బాలికల జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రత్యేకంగా 500 అడుగుల భారీ జాతీయజెండాతో బృందానికి స్వాగతం పలికారు. విద్యార్థులతో పాటు ఆర్వీఎం పీఓ యాస్మిన్‌భాషా, వివిధ శాఖల అధికారులు, కేజీబీలకు చెందిన ఎస్ఓలు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్టణం అంటేనే తెలియని తమను ఖండాంతరాలకు పంపించిన కలెక్టర్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.