ఇప్పుడంతా ఎక్కువగా మాస్, యాక్షన్ మూవీస్‌కే ఓటేస్తున్నారు. అదే టైంలో ఫీల్ గుడ్ మూవీస్ తీసినా సరే ఆదరిస్తున్నారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్న చిత్రం '35'. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో తీసిన ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో ఉంది? ఎందుకు చూడాలి?
ప్రస్తుతం పిల్లలు చదువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అయితే చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. పిల్లల చదువుపై మధ్య తరగతి పేరెంట్స్‌కి ఉండే ఆలోచన, వారి కుటుంబ పరిస్థితులని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. పిల్లలో ఉండే సందేహాలని కూడా పట్టించుకోవాలనేది కూడా చర్చించారు. '35' పేరుతో తీసిన ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేసింది.
(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)
'35' స్టోరీ విషయానికొస్తే.. తిరుపతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడు జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్‍లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ పిల్లాడు తప్పక 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు కోసం తల్లి మ్యాథ్స్ నేర్చుకుంటుంది. తర్వాత కొడుక్కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. చివరకు పిల్లాడు కావాల్సిన మార్కులు తెచ్చుకున్నాడా? అనేది మెయిన్ పాయింట్.
ఇందులో పిల్లాడి నటన ఎంత హైలైటో.. తల్లిగా నివేధా థామస్ కూడా అంతే అద్భుతంగా నటించింది. చూస్తున్నంతసేపు చాలామంది తమని తాము రిలేట్ అయ్యేంతలా జీవించేసింది. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలానూ గాంధీ జయంతితో పాటు వీకెండ్ టైమ్ చేయాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్సవ్వొద్దు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment