సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు | Bigg Boss 8 Telugu Day 30 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 30 Highlights: నమ్మించి మోసం చేయడం.. ఇదేం గేమ్ రా

Published Wed, Oct 2 2024 8:18 AM | Last Updated on Wed, Oct 2 2024 9:54 AM

Bigg Boss 8 Telugu Day 30 Episode Highlights

బిగ్‌బాస్ 8లో ఐదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నిఖిల్‌, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్‌ లిస్టులో ఉన్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్‌లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు బిగ్‌బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు. పోటీల సంగతేమో గానీ యష్మి ఓవరాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. నబీల్, మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని గుర్తుచేస్తున్నాయి. ఇంతకీ మంగళవారం (అక్టోబరు 01) ఎపిసోడ్‌లో ఏం జరిగింది?

మణికంఠ చాలా డేంజరస్
నామినేషన్స్ తర్వాత యష్మి-ప్రేరణ మాట్లాడటంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటకెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా అని ప్రేరణ, యష్మిని అడిగింది. అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటారు. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాను. ఎదుటివాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ, నమ్మించి మోసం చేయడం.. ఇదే గేమ్ రా.. ఆయన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది అని యష్మి తెగ రెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావారా అని ప్రేరణ అడగ్గా.. ఫ్రెండ్ అని పాపం నమ్మాను. నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని చూశా. కానీ చాలా డేంజరస్, క్రిమినల్ ఫేస్ ఉందని అనుకోలేదు అని యష్మి లోపలున్నదంతా బయటకు కక్కేసింది.

గేమ్స్ షురూ
మంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు 'తాళం విడిపించు.. టైంని నడిపించు', 'జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావ్', 'రోల్ బేబీ రోల్' అని మూడు గేమ్స్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్‌లో తాళం విడిపించి టైర్లు తీయాలని పెట్టిన తొలి గేమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీ పడ్డారు. కానీ టైంలోపు పూర్తి చేయలేకపోయారు. రెండో గేమ్‌లో మణికంఠ, యష్మి తలపడ్డారు. ఇందులో గెలిచేసరికి యష్మి తెగ ఓవరాక్షన్ చేసింది. మూడో పోటీలో నబీల్, ఆదిత్య పోటీ పడగా.. ఆదిత్యనే విజయం వరించింది. అలా శక్తి క్లాన్ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపేసింది.

నబీల్ బక్వాస్ గేమ్
మూడో గేమ్‌లో నబీల్ ఓడిపోయిన తర్వాత యష్మి అతడి గురించి నోటికొచ్చినట్లు మాట్లేడేసింది. 'గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబీల్. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్‌గా ఆడాడు' అని ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది. రీసెంట్‌గా వీకెండ్ ఎపిసోడ్‍‌లో నాగార్జున అడిగితే నబీల్ గురించి యష్మీ తెగ పొగిడేసింది. ఇప్పుడేమో ఒక్క గేమ్‌లో ఈమె గెలిచేసరికి బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతూ ఓవరాక్షన్ చేస్తోంది.

మణికంఠ, సీత ఔట్
ఇక గేమ్స్‌లో ఓడిపోయిన తర్వాత 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్' నుంచి ఒకరిని తీసేయాలని చెప్పగా తొలుత కాంతార క్లాన్ అంతా డిసైడ్ చేసుకుని మణికంఠని సైడ్ చేశారు. ఇక రెండోసారి శక్తి క్లాన్‌కి అవకాశమివ్వగా సీతని సైడ్ చేశారు. అలా రాబోయే గేమ్స్‌లో వీళ్లిద్దరూ పోటీ పడకుండా అయిపోయింది. గేమ్స్ ఆడదామని టీమ్ మారినా సరే మణికంఠని బ్యాడ్ లక్ వరించింది.  ఇలా ఈ రోజు పెట్టిన మూడు టాస్కుల్లో రెండింట్లో నిఖిల్ టీమ్ గెలవగా మరో టాస్కులో ఎవరూ గెలవలేదు.

సోనియాలా యష్మి ప్రవర్తన
ఇన్నాళ్లు సోనియా ప్రవర్తన చూసి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అనుకున్నారు. ఆమె ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని అనుకున్నారు. దీంతో ఆడియెన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది. దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యష్మి తీసేసుకుందా అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్‌లో నబీల్, మణికంఠ గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement