35: Chinna Katha Kaadu Movie
-
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్‌పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్‌లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
చిన్న సినిమాకు అరుదైన గౌరవం..!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన కుమారుడిని పాస్ మార్కులు తెచ్చుకునేందుకు ఓ తల్లి పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మూవీని ఇండియన్ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పనాజీలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. దాదాపు 384 సినిమాల నుంచి ఎంట్రీలు రాగా.. తెలుగులో 35 చిన్న కథ కాదు మూవీని ఎంపిక చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం 25 చిత్రాలను ప్రదర్శించనున్నారు. -
ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కువగా మాస్, యాక్షన్ మూవీస్‌కే ఓటేస్తున్నారు. అదే టైంలో ఫీల్ గుడ్ మూవీస్ తీసినా సరే ఆదరిస్తున్నారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్న చిత్రం '35'. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో తీసిన ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో ఉంది? ఎందుకు చూడాలి?ప్రస్తుతం పిల్లలు చదువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అయితే చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. పిల్లల చదువుపై మధ్య తరగతి పేరెంట్స్‌కి ఉండే ఆలోచన, వారి కుటుంబ పరిస్థితులని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. పిల్లలో ఉండే సందేహాలని కూడా పట్టించుకోవాలనేది కూడా చర్చించారు. '35' పేరుతో తీసిన ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేసింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)'35' స్టోరీ విషయానికొస్తే.. తిరుపతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడు జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ పిల్లాడు తప్పక 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు కోసం తల్లి మ్యాథ్స్ నేర్చుకుంటుంది. తర్వాత కొడుక్కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. చివరకు పిల్లాడు కావాల్సిన మార్కులు తెచ్చుకున్నాడా? అనేది మెయిన్ పాయింట్.ఇందులో పిల్లాడి నటన ఎంత హైలైటో.. తల్లిగా నివేధా థామస్ కూడా అంతే అద్భుతంగా నటించింది. చూస్తున్నంతసేపు చాలామంది తమని తాము రిలేట్ అయ్యేంతలా జీవించేసింది. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలానూ గాంధీ జయంతితో పాటు వీకెండ్ టైమ్ చేయాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్
థియేటర్లలో ఆల్రెడీ 'దేవర' హవా నడుస్తోంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీస్ వస్తున్నాయి. కానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ విషయానికొస్తే.. '35 చిన్న కథ కాదు' మాత్రమే ఆసక్తి కలిగిస్తోంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్, బోట్ అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 06)అమెజాన్ ప్రైమ్బోట్ (తమిళ సినిమా) - అక్టోబరు 01హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) - అక్టోబరు 03ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) - అక్టోబరు 04ఆహా35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) - అక్టోబరు 02బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) - అక్టోబరు 04నెట్ఫ్లిక్స్మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 01టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03కంట్రోల్ (హిందీ మూవీ) - అక్టోబరు 04ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 04రన్మ 1/2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 05ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 06హాట్స్టార్ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30జియో సినిమాఅరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) - అక్టోబరు 04మనోరమ మ్యాక్స్ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) - అక్టోబరు 04సోనీ లివ్మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) - అక్టోబరు 04జీ5ద సిగ్నేచర్ (హిందీ సినిమా) - అక్టోబరు 04కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) - అక్టోబరు 04ఆపిల్ ప్లస్ టీవీవేరే ఈజ్ వాండా (జర్మన్ సిరీస్) - అక్టోబరు 04(ఇదీ చదవండి: కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్) -
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్‌మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024 -
ఒక సినిమాకు ఇన్ని స్టార్స్ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా
ఒక మంచి సినిమా వస్తే..దాన్ని మీడియా ఎంత బాగా ప్రమోట్ చేస్తుందో ‘35-చిన్న కథ కాదు’చిత్రం ద్వారా తెలిసింది. ఈ సినిమాకి మీరు(మీడియా) ఇచ్చినన్ని స్టార్స్ నేను ఎప్పుడూ చూడలేదు .చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రానా. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. (చదవండి: 35: చిన్న కథ కాదు మూవీ రివ్యూ)ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్లో రానా మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం' అన్నారునివేదా థామస్ మాట్లాడుతూ.. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ' అన్నారు‘ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి '35-చిన్న కథ కాదు' తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా ఉంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విశ్వదేవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి ,సృజన్ యరబోలు పాల్గొన్నారు. -
మా సినిమాకు డిస్టింక్షన్ మార్కులు వేశారు : విశ్వదేవ్
‘‘35–చిన్న కథ కాదు’ సినిమా కథ విన్నప్పుడే అందులోని ప్రసాద్ పాత్ర చేయాలనుకున్నాను. సినిమా విడుదల తర్వాత నా పాత్రకి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని విశ్వదేవ్ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో మా సినిమాని ప్రశంసించడంతో పాటు డిస్టింక్షన్ మార్కులు వేయడం సంతోషంగా ఉంది. నంద కిశోర్ సినిమాని చక్కగా తీశాడు. నా కెరీర్లో అన్ని విషయాల్లో సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. పెద్దలు, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన అందమైన సినిమా ఇది’’ అన్నారు. -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘35: చిన్న కథ కాదు’ చిత్రానికి పిల్లలే హీరోలు: నిర్మాత
‘‘కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్, తమిళంలో ‘మహారాజా’ తరహాలో తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ సినిమా కూడా విజయం సాధిస్తుంది. బాపు, కె. విశ్వనాథ్, బాలచందర్గార్ల సినిమాలను గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నంద కిశోర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సృజన్ మాట్లాడుతూ– ‘‘ఓ స్కూల్ పిల్లవాడికి లెక్కలు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని ఓ తండ్రి ఏం ఆలోచించాడు? అన్నదే కథ. ఈ చిత్రకథ తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. చెప్పాలంటే... కథలో తిరుపతి అనే ప్లేస్ కూడా ఓ క్యారెక్టర్లా ఆడియన్స్‌కు అనిపిస్తుంది. సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్‌ను మించిన కమర్షియల్ అంశం ఏం ఉంటుంది? ఇంకా తండ్రీకొడుకులు, అన్నాచెల్లెళ్లు... ఇలా చాలా రిలేషన్స్ సినిమాలో ఉన్నాయి. స్కూల్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఓ విధంగా పిల్లలే ఈ సినిమాకు హీరోలనుకోవచ్చు. ప్రస్తుతం ‘గతం 2’, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా కాంబినేషన్లోని సినిమాలు ఉన్నాయి. ‘మహారాజా’ తరహాలో ఓ థ్రిలర్ మూవీ కూడా ఉంది. రమ్యకృష్ణగారిని అనుకుంటున్నాం’’ అని అన్నారు.