‘35: చిన్న కథ కాదు’ చిత్రానికి పిల్లలే హీరోలు: నిర్మాత | Producer Srujan Yarabolu Talks About 35: Chinna Katha Kaadu Movie | Sakshi
Sakshi News home page

కన్నడలో కాంతార.. తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ : నిర్మాత

Published Tue, Sep 3 2024 1:45 PM | Last Updated on Tue, Sep 3 2024 3:29 PM

Producer Srujan Yarabolu Talks About 35: Chinna Katha Kaadu Movie

‘‘కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మల్‌ బాయ్స్, తమిళంలో ‘మహారాజా’ తరహాలో తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ సినిమా కూడా విజయం సాధిస్తుంది. బాపు, కె. విశ్వనాథ్, బాలచందర్‌గార్ల సినిమాలను గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత సృజన్‌ యరబోలు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’.  నంద కిశోర్‌ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సృజన్‌ మాట్లాడుతూ– ‘‘ఓ స్కూల్‌ పిల్లవాడికి లెక్కలు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని ఓ తండ్రి ఏం ఆలోచించాడు? అన్నదే కథ. ఈ చిత్రకథ తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. చెప్పాలంటే... కథలో తిరుపతి అనే ప్లేస్‌ కూడా ఓ క్యారెక్టర్‌లా ఆడియన్స్‌కు అనిపిస్తుంది. సినిమాలో మంచి మదర్‌ సెంటిమెంట్‌ ఉంది. మదర్‌ సెంటిమెంట్‌ను మించిన కమర్షియల్‌ అంశం ఏం ఉంటుంది? 

ఇంకా తండ్రీకొడుకులు, అన్నాచెల్లెళ్లు... ఇలా చాలా రిలేషన్స్‌ సినిమాలో ఉన్నాయి. స్కూల్‌ ఎపిసోడ్స్‌ బాగుంటాయి. ఓ విధంగా పిల్లలే ఈ సినిమాకు హీరోలనుకోవచ్చు. ప్రస్తుతం ‘గతం 2’, తరుణ్‌ భాస్కర్‌–ఈషా రెబ్బా కాంబినేషన్‌లోని సినిమాలు ఉన్నాయి. ‘మహారాజా’ తరహాలో ఓ థ్రిలర్‌ మూవీ కూడా ఉంది. రమ్యకృష్ణగారిని అనుకుంటున్నాం’’ అని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement