చిన్న సినిమాకు అరుదైన గౌరవం..! | 35 Chinna Katha Kaadu Movie Gets Honoured International Film Festival In Goa | Sakshi
Sakshi News home page

35 Chinna Katha Kaadu: చిన్న కథ కాదు.. పెద్ద ఘనత సాధించింది!

Published Fri, Oct 25 2024 1:29 PM | Last Updated on Fri, Oct 25 2024 2:24 PM

35 Chinna Katha Kaadu Movie Gets Honoured International Film Festival In Goa

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ చిత్రానికి నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన కుమారుడిని పాస్‌ మార్కులు తెచ్చుకునేందుకు ఓ తల్లి పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మూవీని ఇండియన్‌ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పనాజీలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలు  నవంబర్‌ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. దాదాపు 384 సినిమాల నుంచి ఎంట్రీలు రాగా.. తెలుగులో 35 చిన్న కథ కాదు మూవీని ఎంపిక చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొత్తం 25 చిత్రాలను ప్రదర్శించనున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement