nivedha Thomas
-
చిన్న సినిమాకు అరుదైన గౌరవం..!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన కుమారుడిని పాస్ మార్కులు తెచ్చుకునేందుకు ఓ తల్లి పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మూవీని ఇండియన్ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పనాజీలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. దాదాపు 384 సినిమాల నుంచి ఎంట్రీలు రాగా.. తెలుగులో 35 చిన్న కథ కాదు మూవీని ఎంపిక చేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొత్తం 25 చిత్రాలను ప్రదర్శించనున్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి.. వీకెండ్ తలుపు తీసిన లావణ్య
►► కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి ►► వీకెండ్లో అక్కడ ఎవరంటున్న లావణ్య త్రిపాఠి ►► పికాసో పెయింటింగ్‌లా పాయల్ రాజ్‌పుత్ ►► సముద్రంలో హన్సిక మోత్వానీ ►► రెడ్ డ్రెస్‌లో అదరగొడుతున్న ‘అల వైకుంఠపురంలో’ బ్యూటీ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
హీరోయిన్ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే..
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. సినీ ఇండస్ర్టీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్ అంజలి కూడా చేరిందని, ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా అంజలి వకీల్‌సాబ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్‌కు ఇటీవలె కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అంజలికి సైతం కరోనా సోకిందని పలు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపించాయి. దీనిపై అంజలి సైతం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇదంతా నిజమే అనుకొని అంజలికి కరోనా సోకిందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుండటంతో నటి అంజలి క్లారిటీ ఇచ్చారు. 'నాకు కరోనా వచ్చిదంటూ పలు న్యూస్ ఆర్టికల్స్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాకు కరోనా సోకిందనే వార్త పూర్తి అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కోవిడ్ రాలేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ నెటిజన్లను కోరింది. 🙏🏻 pic.twitter.com/6eprZEWJZ4 — Anjali (@yoursanjali) April 8, 2021 చదవండి : బ్రేకప్ తట్టుకోవడం చాలా కష్టం: అంజలి టీకా తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్‌బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వ్యూహం పన్నారా?
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్‌కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్‌మేన్’ తర్వాత నాని, నివేదా థామస్‌లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. -
హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే
‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్. కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే. నాకు ఒక పెద్ద రూమ్‌లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్‌గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్ రూమ్‌లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్‌కి వెళ్లాను. డాన్స్‌మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ ‘ఏంటి సార్ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’ అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్‌రామ్‌ను కలిసినపుడు ‘ఓ లైన్ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్ చేశాను. ‘మీరు కెమెరామేన్ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు. నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్లో కాని రీమేక్ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్‌గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్‌కి, కెమెరామెన్‌కి క్లాష్ ఉండదు. మంచి అవుట్‌పుట్ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామెన్‌గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు. -
బ్రోచేవారెవరురా..
‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఈ ఏడాది హీరోగా ప్రేక్షకులను మెప్పించారు శ్రీ విష్ణు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నివే«థా థామస్, నివేథా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 2017లో వివేక్–శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన ‘మెంటల్ మదిలో..’ చిత్రం ఆడియన్స్‌ను మెప్పించిన విషయం తెలిసిందే. -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్‌లో చాలా సినిమాలు చేసి, నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్‌చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్‌బాబు ఏ ఆర్టిస్ట్‌ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్‌లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్‌బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్‌ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
సంక్రాంతి శుభాకాంక్షలు!
‘మకర సంక్రాంతి శుభాకాంక్షలు’.. ఇదిగో ఇలానే హీరోయిన్ నివేథా థామస్ ఓ నెటిజన్‌కు ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు. పొరపాటు గ్రహించి, ‘సారీ’ చెప్పి ‘శివరాత్రి శుభాకాంక్షలు’ తెలిపారామె. మంగళవారం సాయంత్రం ట్విటర్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు నివేథ. ఇంకా ఏం చెప్పారంటే... ► మీ డ్రీమ్ ప్లేస్? చాలా ప్లేసెస్‌కు ట్రావెల్ చేయాలని ఉంది. స్విట్జర్లాండ్ అంటే ఇష్టం. ► మాకోసం కొంచెం తెలుగులో మాట్లాడండి.. తప్పకుండా అండి.. మాట్లాడదాం. ► చెన్నైలో మీ ఫేవరెట్ ప్లేస్? మా ఇల్లు ► ఫేవరెట్ ఫెస్టివల్? క్రిస్మస్ ► తెలుగు ఫ్యాన్స్ గురించి? కుటుంబం. ► శారీ ఆర్ చుడీదార్.. ఏది ఇష్టం? శారీ... ► మీకు తెలియనివాళ్లు మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? ఓ నవ్వు నవ్వుతా! ► ఫేవరెట్ కలర్? బ్లాక్. ► ఫేవరెట్ డిష్? చాలా ఉన్నాయి.. బట్ ఐ లవ్ బ్రెయిన్. -
శర్వాకు జోడిగా క్రేజీ హీరోయిన్స్
మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్, క్రేజీ ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. స్వామి రారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్, కేశవతో మరో విజయాన్నిఅందుకున్నాడు. ఇప్పుడు అదే జోరు శర్వానంద్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వాకు జోడిగా ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీస్ ను ఫైనల్ చేశారు. వరుసగా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న మలయాళీ బ్యూటీ నివేదా థామస్‌తో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన షాలినీ పాండే మరో హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌తో కాకుండా మరో దర్శకుడితో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం. -
నేను డైరెక్టర్ అవుతానని ఆరోజే అన్నాడు – సుకుమార్
‘‘నేను డైరెక్టర్ కాకుముందు ‘మీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతానంటూ’ ఓ అబ్బాయి వచ్చాడు. నేనే ఇంకా డైరెక్టర్ కాలేదు.. నాకు అసిస్టెంటా? అన్నా. మీరు తప్పకుండా డైరెక్టర్ అవుతారని ఆరోజు అన్నాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయే అజయ్ వోధిరాల. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నవీన్ చంద్ర, నివేథా థామస్ జంటగా అజయ్ వోధిరాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్. రఘుబాబు, కె.బి. చౌదరి నిర్మిస్తున్నారు. రతీస్ వేగ స్వరాలందించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని సుకుమార్ రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ– ‘‘అజయ్‌గారు చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు ఒప్పుకోరు. సినిమాపై ఉండే ప్యాషన్‌తో నిర్మాతలు ఈ మూవీ నిర్మించారు. రతీస్ వేగ మంచి పాటలిచ్చారు. నివేథాతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రారంభం నుంచి సుకుమార్‌గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. నవీన్ చంద్ర కథను నమ్మి, ఎంతో సపోర్ట్ చేశారు. అజయ్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు కొత్తపల్లి ఆర్. రఘుబాబు. ‘‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన నా కుటుంబ సభ్యులకు, సినిమా మేకింగ్‌లో సహకారం అందించినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అజయ్ వోధిరాల. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి, నిర్మాతలు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, పాటల రచయిత రామజోగయ్యశాస్తి, నటి ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేశ్ కొండవీటి. -
అదే రోజు.. అదే తప్పు!
... జరిగింది అంటున్నారు నివేదా థామస్. ఇంతకీ ఏ రోజు గురించి ఆమె చెబుతున్నారు? స్ట్రెయిట్‌గా పాయింట్లోకి వచ్చేద్దాం. సెలబ్రిటీల బర్త్‌డే ఎప్పుడో తెలుసుకోవాలంటే నెటిజెన్లు ఎవరైనా గూగుల్ తల్లిని హెల్ప్ అడుగుతారు. అలాగే, ఈ మధ్య నివేదా ఫ్యాన్స్ కొందరు గూగుల్ సెర్చ్‌లో ఆమె బర్త్‌డే ‘అక్టోబర్ 15’ అని తెలుసుకున్నారు. అంతే.. ఈ బ్యూటీకీ సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పడం స్టార్ట్ చేశారు. ‘థ్యాంక్యూ’ అని రిప్లై ఇచ్చి, అసలు విషయం బయటపెట్టారు నివేదా. ‘‘మీ విలువైన సమయాన్ని వెచ్చించి నాకు బర్త్‌డే విషెస్ చెప్పినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ రోజు నా పుట్టినరోజు కాదు’’ అని ట్వీట్ చేశారు. అంతా ఓకే.. కానీ, అసలు పుట్టినరోజు ఎప్పుడో మాత్రం చెప్పలేదు. చెప్పకపోతే అభిమానులు తెలుసుకోరా ఏంటి? ‘నవంబర్ 2న నివేదా బర్త్‌డే’ అని చెప్పేశారు. ఇంతకీ వీళ్లకు ఆ డేట్ ఎలా తెలిసిందీ అంటే... గతేడాది ఆమె ఇదే విషయమై రెస్పాండ్ అయిన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే... లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్ 15 నివేదా బర్త్‌డే అనుకుని, చాలామంది విషెస్ చెప్పారు. ఆ ట్వీట్‌ని ఇప్పుడు అభిమానులు బయటికి తీశారు. అందులో నివేదా బర్త్‌డే నవంబర్ 2 అని ఉంది. ఏదేమైనా లాస్ట్ ఇయర్‌లానే ఈ ఇయర్ కూడా జరిగింది. మరి ఇప్పుడు బహుమతులు పంపిన అభిమానులు మళ్లీ నవంబర్ 2న కూడా పంపుతారేమో. మరోవైపు నెక్ట్స్ ఇయర్ అయినా ఫ్యాన్స్ నివేదాకి డైరెక్ట్‌గా నవంబర్ 2నే బర్త్‌డే విషెస్ చెబుతారో లేక సేమ్ మిస్టేక్‌ని రిపీట్ చేస్తారో? వెయిట్ అండ్ సీ. -
తొలకరిలో నిన్ను కోరి
తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయి? కొంచెం అటు ఇటుగా జూన్‌లో. అదే టైమ్‌లో వినోదాల జల్లు కురిపించడానికి వస్తానంటున్నారు యువ హీరో నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘నిన్ను కోరి’. నివేదా థామస్ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకుంటున్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవల అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ నెల 17న విశాఖలో మొదలైన చిత్రీకరణ 29 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు. మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీ, పద్మజ, ప్రియాంక నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని.