
నివేథా పేతురాజ్, శ్రీ విష్ణు , నివేథా థామస్
‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఈ ఏడాది హీరోగా ప్రేక్షకులను మెప్పించారు శ్రీ విష్ణు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నివే«థా థామస్, నివేథా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 2017లో వివేక్–శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ‘మెంటల్ మదిలో..’ చిత్రం ఆడియన్స్‌ను మెప్పించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment