నేను డైరెక్టర్‌ అవుతానని ఆరోజే అన్నాడు – సుకుమార్‌ | Director Sukumar Speech @ Juliet Lover of Idiot Audio Launch | Sakshi
Sakshi News home page

నేను డైరెక్టర్‌ అవుతానని ఆరోజే అన్నాడు – సుకుమార్‌

Published Tue, Oct 31 2017 1:00 AM | Last Updated on Tue, Oct 31 2017 1:00 AM

Director Sukumar Speech @ Juliet Lover of Idiot Audio Launch

‘‘నేను డైరెక్టర్‌ కాకుముందు ‘మీ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అవుతానంటూ’ ఓ అబ్బాయి వచ్చాడు. నేనే ఇంకా డైరెక్టర్‌ కాలేదు.. నాకు అసిస్టెంటా? అన్నా. మీరు తప్పకుండా డైరెక్టర్‌ అవుతారని ఆరోజు అన్నాడు. నేను డైరెక్టర్‌ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యాడు. ఆ అబ్బాయే అజయ్‌ వోధిరాల. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. నవీన్‌ చంద్ర, నివేథా థామస్‌ జంటగా అజయ్‌ వోధిరాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’.

కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కె.బి. చౌదరి నిర్మిస్తున్నారు. రతీస్‌ వేగ స్వరాలందించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని సుకుమార్‌ రిలీజ్‌ చేశారు. నవీన్‌ చంద్ర మాట్లాడుతూ– ‘‘అజయ్‌గారు చాలా మొండోడు. షాట్‌ బాగా వచ్చే వరకు ఒప్పుకోరు. సినిమాపై ఉండే ప్యాషన్‌తో  నిర్మాతలు ఈ మూవీ నిర్మించారు. రతీస్‌ వేగ మంచి పాటలిచ్చారు. నివేథాతో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రారంభం నుంచి సుకుమార్‌గారు ఎంతో సహకారం అందిస్తున్నారు.

నవీన్‌ చంద్ర కథను నమ్మి, ఎంతో సపోర్ట్‌ చేశారు. అజయ్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు’’ అన్నారు కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు. ‘‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన నా కుటుంబ సభ్యులకు, సినిమా మేకింగ్‌లో సహకారం అందించినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అజయ్‌ వోధిరాల. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి, నిర్మాతలు కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్, విజయ్‌ బండ్రెడ్డి, పాటల రచయిత రామజోగయ్యశాస్తి, నటి ఎస్తేర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవితేజ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సురేశ్‌ కొండవీటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement