navin chandra
-
ఆ పేరొస్తే చాలు
‘‘నేను నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను.. అంతేకానీ హీరోనా, విలనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానా? అని ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వాలనుకోలేదు. ఒక మంచి కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే చేయడానికి అభ్యంతరం లేదు. ‘నవీన్ చంద్ర అన్ని రకాల పాత్రలూ చేయగలడు.. చేస్తాడు’ అనే పేరొస్తే చాలు’’ అని నవీన్ చంద్ర అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. అందులో ప్రధాన పాత్రలో పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ‘మోసగాళ్ళు’ కథ విన్నప్పుడు ఇంతపెద్ద కుంభకోణం జరిగిందా? అనిపించింది. ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్‌లకు కజిన్ గా నటించా. వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను రక్షిస్తుంటా. ఎంత మేధావి అయినా తప్పు చేస్తే చివరికి శిక్ష తప్పదు? అనేది చూపిస్తున్నాం. ఇందులో నా పాత్ర డ్రగ్స్‌కి, మద్యానికి బానిసై ఉంటుంది. ‘ఎవరు’, ‘అరవింద సమేత వీరరాఘవ’ల్లో నా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పటివరకూ నాకంటూ ఎటువంటి ఇమేజ్ లేకుండా నటుడిగా కొనసాగుతుండటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు. -
పొలిటికల్ మిషన్
నవీన్ చంద్ర హీరోగా హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర, మై విలేజ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రేరణతో వాస్తవ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. కరణం బాబ్జీ దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 5న సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి నైజాంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్. ‘‘పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు కరణం బాబ్జీ. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలు ఘనవిజయం సాధించాయి. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు కేవీఎస్‌ఎస్‌ఎల్ రమేష్ రాజు. ఎగ్జిబిటర్ శ్రీధర్, సంగీతదర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ 2020
నవీన్‌చంద్ర హీరోగా నటించిన చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. శ్రీమిత్ర అండ్ మైవిలేజ్ సమర్పణలో బన్నీ క్రియేషన్స్, మధు మృధు ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్. రమేష్‌రాజు నిర్మాతలు. కరణం బాబ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలకు కరణం బాబ్జి దర్శకత్వం వహించి, ఆ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ‘మిషన్–2020’ కథ చాలా బావుంది. ఈ ఏడాది 2020 సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం, ‘మిషన్ 2020’ సినిమా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. కరణం బాబ్జి మాట్లాడుతూ– ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారు సెంటిమెంట్. నవీన్‌చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ రెడ్డిగారు అంకితభావంతో నటించారు. శ్రీరాపాక గారు రాసిన ఐటమ్ సాంగ్‌తో శనివారం సినిమా షూటింగ్ పూర్తయింది. 2020లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు, సంగీత దర్శకుడు ర్యాప్రాక్ షకీల్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్‌ఫామ్ ఏదైనా కథ బాగుంటే చూస్తారు
‘‘థియేటర్ లేదా ఓటీటీ.. ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ఎన్. శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఆహా ప్లాట్ఫామ్లో వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో 30 ఏళ్ల వయసుదాటి పెళ్లి కాని రామకృష్ణ పాత్రలో నటించాను. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం రామకృష్ణది. కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. బైక్ రైడింగ్, కిస్‌లు, హగ్స్ లాంటి సీన్స్ ఉండే లవ్‌స్టోరీ కాదిది. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఒక మనిషి తనకు పూర్తిగా తెలియని ఓ మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు? అతన్ని ఏ కోణంలో చూస్తాడు? అనే వాస్తవిక భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. ► ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు శ్రీకాంత్ పరిచయం అయ్యారు. ఓ సందర్భంలో ‘భానుమతి రామకృష్ణ’ కథ చెప్పారు. డైరెక్షన్ చేయమని నేనే చెప్పాను. బట్టతల, కొంచెం బొద్దుగా ఉండటం, తెనాలి యాస ఇలా.. రామకృష్ణ పాత్రను ఊహించుకున్నారు శ్రీకాంత్. నా ఊహల్లో ఉన్న రామకృష్ణ గురించి శ్రీకాంత్‌కు చెప్పాను. ఇద్దరం మాట్లాడుకుని ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే రామకృష్ణను రెడీ చేశాం. ► ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలో ముందుగా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్ లేవు. ఓటీటీ బాగుందని ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నాం. భవిష్యత్‌లో ఓటీటీల హవా పెరగవచ్చు. థియేటర్స్ ఉన్నప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చి ఆ సినిమాను మళ్లీ చూడాలనుకున్నప్పుడు థియేటర్లో అయితే టికెట్ కొనాలి. అదే ఓటీటీలో మళ్లీ టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. అయితే ఓ ఐదొందల మంది మధ్యలో థియేటర్లో వినోదాన్ని ఆస్వాదించే అనుభూతి ఎప్పుడూ బాగుంటుంది. అదొక ఫెస్టివల్లాంటిది. కరోనా వల్ల పరిస్థితులు బాగాలేవు. మునుపటి సాధారణ రోజులు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ని టీవీ చూడటం, ఇల్లు శుభ్రం చేయడం, వార్తలను ఫాలో కావడం, వర్కవుట్ చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడానికి కేటాయించాను. ► తెలుగులో రానా ‘విరాటపర్వం’, కీర్తీ సురేష్ ‘మిస్ ఇండియా’ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. అలాగే వరుణ్ తేజ్ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తాను. దర్శకులు మంచి పాత్రలతో నన్ను అప్రోచ్ అవుతుండటం సంతోషంగా ఉంది. తమిళంలో ధనుష్ నటించిన ‘పటాస్’ (తెలుగులో ‘లోకల్‌బాయ్’)లో విలన్‌గా చేశాను. ఆ సినిమా తర్వాత తమిళంలో నాకు మంచి ఆఫర్సే వచ్చాయి. కాకపోతే లాక్డౌన్ వల్ల కథలు వినడం కుదరలేదు. -
కుర్రాడు లోకల్
తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్ బాయ్’. ధనుష్ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్ చంద్ర విలన్‌గా నటించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘పటాస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టై¯Œ మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘లోకల్ బాయ్’ పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు. సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. గతంలో ధనుష్, సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మ యోగి’ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. -
పైరేటెడ్ లవ్ స్టోరీ
నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ జంటగా ‘అడ్డా’ ఫేమ్ జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో హీరోయిన్’. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘ఫార్వార్డ్..’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘పైరేటెడ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘ఫార్వార్డ్..’ అంటూ అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే పాట క్యాచీగా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది’’ అని చిత్రబృందం పేర్కొంది. డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి, ‘30 ఇయర్స్’ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వంశీకృష్ణ. -
పోలీసుల చేత ఫోన్లు చేయించారు
‘‘నన్ను థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అంటున్నారు. అవేమీ వద్దు. పూల దండలు, పొగడ్తలు అవసరం లేదు. ఎప్పటికీ మంచి సినిమాల శేష్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘కుర్రాడు కాలిఫోర్నియా నుంచి వచ్చాడు. ఇంగ్లీష్ టాకింగ్, వాకింగ్ బాగుంది. ఇక్కడ సినిమాలు చేస్తూ అక్కడ సౌకర్యవంతమైన జీవితం లీడ్ చేస్తుంటాడని నా గురించి మొదట్లో అనుకుని ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదు. మాది అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మా నాన్నగారు హోటల్ మేనేజర్‌గా చేశారు. మా అమ్మగారు వెయిట్రస్‌గా చేశారు. నాకూ కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. ‘పంజా’ తర్వాత కూడా అవి తగ్గలేదు. ఆ సినిమా తర్వాత విలన్‌గా నీకు ఫాలోయింగ్ వచ్చింది. హీరోగా ట్రై చేయమన్నారు. ఆ సమయంలో ‘కిస్’ సినిమా చేశాను. మ్యాట్నీ షో టైమ్‌కి ఓ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి రెండు మూడు కోట్లు పోతాయన్నాడు. నా జేబులో పది రూపాయలు కూడా లేని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారు కొందరు పోలీసుల చేత ఫోన్లు చేయించారు. సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడతారు. నా సినిమా నిలబడాలని కోరుకుంటాను. ఎందుకంటే మరోసారి నేను పోలీస్ స్టేషన్లో నిలబడను. ‘ఎవరు’ సక్సెస్ తర్వాత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్ చేసి ‘కథ ఉందా? నీపై నమ్మకం ఉంది’ అన్నారు. ఆ నమ్మకం కోసమే కష్టపడుతున్నాను. డబ్బు లేనప్పుడు కూడా నన్ను నమ్మింది రచయిత అబ్బూరి రవిగారే. నా బ్యాక్‌గ్రౌండ్ ఆయనే. నాపై నమ్మకం ఉంచిన పీవీపీ గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ ప్రేక్షకులకు నచ్చేలా రావడానికి మాలో మేం గొడవలు పడ్దాం. ఫైనల్‌గా సినిమా గెలిచింది. ఈగోల కన్నా సినిమా చాలా పెద్దది. శేష్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. రామ్‌జీ తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతాడు. ‘ఎవరు’ లైబ్రరీ ఫిల్మ్ వంటిది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘శేష్ ఆల్రెడీ రెండు హిట్స్ (క్షణం, గూఢచారి)తో ఉన్నాడు. ఏం చేయాలా? అనుకున్నా. ‘ఏం చేసినా నమ్మకంతో చేయి’ అన్న అబ్బూరి రవిగారి మాటలు నాకు సహకరించాయి. మా సినిమాకు కో డైరెక్టర్ లేడు. మా ఏడీ టీమ్ సుధీర్, సూర్య, మనీషా, దివ్య బాగా కష్టపడ్డారు. నాకు కృష్ణానగర్ కష్టాలు లేవు. నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తోంది. నా స్నేహితులే నా ఎమోషనల్ సపోర్ట్’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘థ్రిల్లింగ్ స్టార్ అనేది శేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనిపిస్తుంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రెజీనా. నటులు సాయి, శశి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్, డీఓపీ వంశీ పచ్చిపులుసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కేకే, భాను మాట్లాడారు. -
వారికి శేష్ ఒక ఉదాహరణ
‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్‌లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేవు. వరుస ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్‌ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్ రామ్‌జీ యాక్టర్ అనమంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్ యాక్టర్‌గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్‌చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్’ సినిమా సమయంలో నవీన్‌చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్‌గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను. సినిమా చూసి మా బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్ స్క్రీన్‌కి వెళ్లి చూశాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలి’’ అన్నారు రెజీనా. -
మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!
‘‘పాజిటివ్ క్యారెక్టరా? నెగటివ్ క్యారెక్టరా? అని కాదు. కథ బలంగా ఉండాలి. కథ నా పాత్ర చుట్టూ తిరగాలి. అలాంటి సినిమాలు చేయాలనుకుంటా’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అడివి శేష్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో పదివేలు, ఇరవై వేలకు ఆశపడి తప్పులు చేసే విక్రమ్ వాసుదేవ్ అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. ఈ ‘ఎవరు’ చిత్రానికి హిందీ ‘బద్లా’తో ఏమైనా లింక్ ఉందా? అనే విషయం థియేటర్లోనే తెలుస్తుంది. ► ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు రామ్‌చరణ్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ట్రైలర్ నచ్చిందని రామ్‌చరణ్ అన్నారు. బెటర్మెంట్ చేశాం. రీషూట్ చేశాం. ఫైనల్‌గా సాలిడ్ స్టాండర్డ్స్‌కు సినిమాను తీసుకువచ్చాం. రీషూట్స్ చేయడం అనేది ‘క్షణం’ నుంచి నాకు అలవాటైందని అనుకుంటున్నా. మంచి అవుట్‌పుట్ రావడం కోసం మార్పులు చేయడంలో తప్పులేదన్నది నా అభిప్రాయం. ► థ్రిల్లర్ మూవీస్‌ను మళ్లీ చూడాలనిపించదు. ట్విస్ట్స్ తెలిసిపోయినప్పుడు రెండోసారి చూడాలనిపించదు. కానీ ఆ ట్విస్ట్‌లకు స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ ఉంటే మళ్లీ మళ్లీ చూడొచ్చు. ‘క్షణం’ అలాంటిదే. మా అమ్మగారు ఆ సినిమాను ఐదుసార్లు చూశారు. ► నా సక్సెస్ఫుల్ కెరీర్లో రచయిత అబ్బూరి రవిగారి పాత్ర ఉంది. అలాగే శోభు యార్లగడ్డగారి వల్ల ‘పంజా, బాహుబలి’ సినిమాల్లో నటించాను. నేను ఫ్లాప్ డైరెక్టర్ని. నా ‘కిస్’ సినిమా ఆడలేదు. పోస్టర్స్ అతికించే మైదాపిండి ఖర్చు కూడా రాలేదు. ‘క్షణం, గూఢచారి’ సినిమాల బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఆ సినిమాలకు కథ అందించింది నేనే. ‘మేజర్’ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు మేజర్ అనౌన్స్మెంట్ అని ట్విట్టర్లో పెడితే, నా పెళ్లి వార్త అనుకున్నారు. కానీ అది ‘మేజర్’ సినిమా గురించి. ‘గూఢచారి 2’ స్టార్ట్ ఉంటుంది. నా కమిట్మెంట్స్ని చూసుకుని ‘2 స్టేట్స్’ రీమేక్ గురించి ఆలోచిస్తా. -
సమీర పాత్ర ఫుల్‌మీల్స్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఎస్.ఎమ్.ఎస్’ చిత్రంతో 2012లో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన పాత్రలను ఎంచుకుని వాటికి న్యాయం చేస్తున్నా. కానీ, పెద్ద సినిమాలు రాకపోవటానికి కారణం ఏంటో తెలియదు. అయితే నేను మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేశాను’’ అని రెజీనా అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా నవీన్ చంద్ర కీలక పాత్రలో వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పివిపి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనా పంచుకున్న విశేషాలు... ► పీవీపీగారు ఓ రోజు ఫోన్ చేసి, వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు కథ చెప్తారు వినండి, నచ్చితే చేద్దాం అన్నారు. అడివి శేష్, రామ్‌జీ చెన్నై వచ్చారు. రామ్‌జీ రెండు గంటలు పాటు ‘ఎవరు’ కథ చెప్పినప్పుడే తనపై పూర్తినమ్మకం కుదిరింది. పైగా కథ చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. ► ఈ చిత్రంలో సమీర అనే పాత్ర చేశా. ఆమె జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. అది ఏంటి? చివరికి సమీర జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నదే చిత్ర కథ. ► సమీర పాత్ర పూర్తి సంతృప్తినిచ్చింది. ఫుల్మీల్స్లాగా అన్నమాట. ‘నక్షత్రం’ సినిమాలో డబ్బింగ్ చెప్పా. పూర్తిస్థాయి పాత్ర చేసి, ఫుల్‌గా డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ‘ఎవరు’. ► ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసే లగా’ నా తొలి హిందీ చిత్రం. ఇందులో లెస్బియన్ పాత్రలో నటించా. సినిమా చూశాక చాలా మంది ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా అనిపించింది. బోల్డ్‌గా నటించడానికి ఇబ్బంది లేదు. కానీ, వల్గర్‌గా ఉండే పాత్రలు మాత్రం చేయను. తాప్సీ నటించిన ‘బద్లా’కి, మా సినిమాకి పోలికే లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. ► ‘మహానటి’ చిత్రానికి కీర్తీసురేశ్కి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాంటి పాత్రలు చేసే అవకాశం అందరికీ రాదు. ‘అ’ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో నాని మెసేజ్ చేశారు. ఆ చిత్రానికి మేకప్ విభాగంలో ఇంద్రాక్షి పట్నాయక్‌కి కూడా జాతీయ అవార్డు రావడం సంతోషం. ‘అ’ సినిమాలో నా మేకప్‌కి ఎంతో శ్రమించారామె. ► అడివి శేష్ మంచి నటుడు. తనతో పని చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. సెట్లో సరదాగా ఎంజాయ్ చేశాం. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో కూడా కొన్ని అవకాశాలున్నాయి.. ప్రొడక్షన్ వారే అధికారికంగా ప్రకటిస్తారు. హిందీలో కూడా త్వరలో ఓ సినిమా ఫైనల్ అవ్వనుంది. -
ఆగస్టులో ఎవరు
అడివి శేష్ కథానాయకుడిగా నటì ంచిన థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తున్నారు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించారు. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. అడివి శేష్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రక్తం అంటిన అద్దాన్ని అడివి శేష్‌కు చూపిస్తూ ఏదో చెప్పాలని రెజీనా ప్రయత్నిస్తున్నట్లు ఫస్ట్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
టీజర్ ఆసక్తికరంగా ఉంది
నవీన్‌చంద్ర, షాలిని వడ్ని జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సాయి అభిషేక్ నిర్మించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సీయస్’. ఈ చిత్రానికి విక్రమ్ జూపూడి, సంజయ్ జూపూడి సహ–నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. టైటిల్ పోస్టర్‌ను సుమంత్, టీజర్‌ను అడవి శేష్ విడుదల చేశారు. అనంతరం సుమంత్ మాట్లాడుతూ– ‘‘అనిల్ నాకు ఐదేళ్లుగా తెలుసు. నా సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేశాడు. అప్పట్నుంచే అతనికి డైరెక్షన్ అంటే తపన. ఓసారి ఈ సినిమా లైన్ చెప్పినప్పుడు నాకు అంతగా ఎక్కలేదు. ఇప్పుడు టీజర్ చూశాక బాగా నచ్చింది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకులకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనిల్ నాకు ‘కర్మ’ సినిమా నుంచి తెలుసు. ఈ టీమ్ నేను నటించిన ‘క్షణం, గూఢచారి’ సినిమాలకు వర్క్ చేశారు. అనిల్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రం టీజర్ జెన్యూన్‌గా ఉంది. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అడవి శేష్. ‘‘అరవిందసమేత..’ సినిమాలో నేను చేసిన బాల్‌రెడ్డి క్యారెక్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వస్తున్నాయి. అనిల్, అభిషేక్ వచ్చి ఈ సినిమా కథ చెప్పారు నాకు. వెరీ ఇంటెన్స్ లవ్‌స్టోరీ. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది నా కల. టైటిల్ఎంత కొత్తగా ఉంటుందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. అరవై శాతం జార్జియాలో షూట్ చేశాం. అక్కడి ఓ తెలుగువాడి కథ ఇది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో నవీన్, అభిషేక్‌కు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘ఇదొక సస్పెన్స్ లవ్థ్రిల్లర్. టైటిల్‌కు తగ్గట్లు అనిల్ తెరకెక్కించాడు. సినిమాను మేలో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు సాయి అభిషేక్. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తేజ వర్మ, జుంగా పృథ్వీ అసోసియేట్ ప్రొడ్యూసర్స్. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. -
పొలిటికల్ థ్రిల్
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్ చంద్ర హీరోగా ఓ కొత్త చిత్రం షురూ అయింది. వేణు మదుకంటి దర్శకత్వంలో యశాస్ సినిమాస్ పతాకంపై వి. మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కృష్ణచైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనీల్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. వేణు మదుకంటి మాట్లాడుతూ– ‘‘వెంకటాపురం’ చిత్రానికి దర్శకునిగా నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైమ్ తీసుకున్నా. మంజునాథ్‌గారితో కలసి ఏడాదిగా ఈ కథపై పని చేశా. ఇప్పటివరకూ రాజకీయ నేపథ్యంలో రాని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో చివరి వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. ఇప్పటివరకూ చేయని రోల్లో నవీన్‌చంద్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. మంజునాథ్‌గారు ఓ మంచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారనే నమ్మకం మాకుంది’’ అన్నారు. ‘‘యశాస్ సినిమాస్ బ్యానర్లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌ని ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథపై వర్క్ చేశాం’’ అన్నారు మంజునాథ్. ‘‘నా కెరీర్లో బాల్‌రెడ్డి (‘అరవింద సమేత వీర రాఘవ’లో చేసిన పాత) పాత్ర పెద్ద మలుపు. ఆ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నా. ఇందుకు త్రివిక్రమ్‌గారికి, ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నవీన్ చంద్ర. కోట శ్రీనివాసరావు, నాజర్, రావు రమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు. -
సరికొత్తగా...
నవీన్ చంద్ర హీరోగా, షాలిని వడ్నికట్టి హీరోయిన్గా డా. అనీల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘28సి’. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ పతాకాలపై అభిషేక్ సాయి నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ లావణ్యా త్రిపాఠి తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. అభిషేక్ సాయి మాట్లాడుతూ– ‘‘28సి’ అనే టైటిల్ అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. డా. అనీల్ విశ్వనాథ్‌గారు సరికొత్త కథ, కథనాలతో సినిమాను చక్కగా తెరకెక్కించారు. నవీన్ చంద్రగారికి ఈ సినిమాతో మంచి హిట్ వస్తుందనే నమ్మకం ఉంది. కిట్టు విస్సా ప్రగడగారు కథకు తగ్గ మాటలు, మంచి పాటలను అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తర్వలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, అభయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, సహ నిర్మాతలు: విక్రమ్ జూపూడి, సంజయ్ జూపూడి. -
‘హీరో హీరోయిన్’ టీజర్ ఆవిష్కరణ!
-
పైరసీ చేసేది నేనే!
‘మీ హీరోల సినిమాలన్నీ పైరసీ చేసేది నేనే..’ అంటూ హీరో నవీన్ చంద్ర డైలాగ్‌తో ‘హీరో హీరోయిన్’ టీజర్ విడుదలైంది. ‘ప్రొడ్యూసర్ కూతురైతే ఏంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అనే మరో డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పైరసీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. నవీన్ చంద్ర హీరోగా, గాయత్రి సురేశ్, పూజా ఝవేరి హీరోయిన్లుగా ‘అడ్డా’ ఫేమ్ జి.యస్. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హీరో హీరోయిన్’. ‘ఎ పైరేటెడ్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సీనియర్ ఫొటోగ్రాఫర్ జనార్థన్, వీడియోగ్రాఫర్ పొన్నం శ్రీనివాస్ విడుదల చేశారు. కార్తీక్ మాట్లాడుతూ– ‘‘పైరసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇండస్ట్రీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపించే కుర్రాడిగా నవీన్ చంద్ర నటించారు. హీరోలకు, నిర్మాతలకు త్వరలోనే ఓ ప్రత్యేక షో వేస్తాం. దీనికి తమిళ పరిశ్రమ నుంచి విశాల్ కూడా వస్తున్నారు. ఇండస్ట్రీలోని హీరోల బైట్లతో రోలింగ్ వేయబోతున్నాం’’ అన్నారు. ‘‘తమ సినిమాలు పైరసీ అవుతాయని తెలిసినా లెక్క చేయకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు హ్యాట్సాఫ్’’ అని నవీన్ చంద్ర అన్నారు. ‘‘మంచి మెసేజ్‌తో రూపొందుతోన్న ‘హీరో హీరోయిన్’ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు బి.ఎ.రాజు, సురేష్ కొండేటి అన్నారు. ‘‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని భార్గవ్ మన్నె అన్నారు. గాయత్రి సురేశ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ గంగాధరీ. -
పైరేటెడ్ ప్రేమ
నవీన్‌చంద్ర హీరోగా, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్’. ‘ఎ పైరేటెడ్ లవ్‌స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. ‘అడ్డా’ సినిమా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వం వహించారు. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని గురువారం విడుదల చేశారు. జీయస్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పలు విభిన్న నేపథ్యాల్లో ప్రేమకథలు వచ్చాయి. కానీ ఎవరూ టచ్ చేయని సినిమా పైరసీ నేపథ్యంలో మా చిత్రం ఉంటుంది. ఈ లవ్‌స్టోరీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్ చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. అందుకే ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్ రెడ్డి, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్చిక్ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ గంగాధరీ. -
అందరూ మెచ్చేలా.. అందరికీ నచ్చేలా
నవీన్ చంద్ర, గాయత్రీ సురేశ్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’ చిత్రాల దర్శకుడు జి.యస్. కార్తీక్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మంచి కథ చెప్పారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ చిత్రాన్ని అందిస్తాం అన్నారు. ‘‘ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. టీమ్ సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా సినిమా తీయడానికి కృషి చేస్తాను’’ అన్నారు కార్తీక్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరీ, సంగీతం: అనూప్ రూబెన్స్. -
నేను డైరెక్టర్ అవుతానని ఆరోజే అన్నాడు – సుకుమార్
‘‘నేను డైరెక్టర్ కాకుముందు ‘మీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతానంటూ’ ఓ అబ్బాయి వచ్చాడు. నేనే ఇంకా డైరెక్టర్ కాలేదు.. నాకు అసిస్టెంటా? అన్నా. మీరు తప్పకుండా డైరెక్టర్ అవుతారని ఆరోజు అన్నాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయే అజయ్ వోధిరాల. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నవీన్ చంద్ర, నివేథా థామస్ జంటగా అజయ్ వోధిరాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్. రఘుబాబు, కె.బి. చౌదరి నిర్మిస్తున్నారు. రతీస్ వేగ స్వరాలందించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని సుకుమార్ రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ– ‘‘అజయ్‌గారు చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు ఒప్పుకోరు. సినిమాపై ఉండే ప్యాషన్‌తో నిర్మాతలు ఈ మూవీ నిర్మించారు. రతీస్ వేగ మంచి పాటలిచ్చారు. నివేథాతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రారంభం నుంచి సుకుమార్‌గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. నవీన్ చంద్ర కథను నమ్మి, ఎంతో సపోర్ట్ చేశారు. అజయ్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు కొత్తపల్లి ఆర్. రఘుబాబు. ‘‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన నా కుటుంబ సభ్యులకు, సినిమా మేకింగ్‌లో సహకారం అందించినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అజయ్ వోధిరాల. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి, నిర్మాతలు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, పాటల రచయిత రామజోగయ్యశాస్తి, నటి ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేశ్ కొండవీటి. -
క్షణ క్షణం ఉత్కంఠ
పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్’. శ్రీ కిషోర్ దర్శకత్వంలో డి.వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన ఈ సిన్మాట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీ కిషోర్ మాట్లాడుతూ– ‘‘ధనరాజ్‌గారికి లైన్ చెప్పగానే నచ్చి, చేద్దామన్నారు. నిర్మాత కోసం చూస్తున్న టైమ్‌లో ఫేస్బుక్లో పరిచయమైన ఆక్రోశ్ ఈ సినిమా తీద్దామని చెప్పారు. ఆర్వీ రాజు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఇందులో ప్రతి సీన్ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు డి. వెంకటేశ్, బెక్కెం వేణు గోపాల్, రాజ్ కందుకూరి, హీరో నవీన్ చంద్ర, భూపాల్, మనోజ్ నందం, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
ఇదో వెరైటీ
అజయ్ హీరోగా సుధాకర్ వినుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ యోగి’. జవాన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై జె.వై. రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని హీరో నవీన్‌చంద్ర విడుదల చేశారు. సుధాకర్ వినుకొండ మాట్లాడుతూ– ‘‘ఇదొక వెరైటీ స్టోరీ. ఈ కథకు, టైటిల్‌కు విజయ్ కరెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. కిరణ్శంకర్ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ నెల 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేసిన నవీన్చంద్రగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మిస్టర్ యోగి’ కథేంటి అన్నది సస్పెన్స్. ఇటువంటి కథా బలమున్న సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అజయ్. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సుధాకర్ రావు కులకర్ణి, కిరణ్ సిరిగిరి. -
స్వాతికి తాళి కడుతుంటే... చేతులు వణికాయి!
‘‘హారర్ సినిమా అనగానే రాత్రి పన్నెండు కాగానే దెయ్యం రావడం, అందరూ భయపడటం జరుగుతుంటుంది. వాటికి భిన్నంగా ‘త్రిపుర’ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ సరికొత్తగా ఉంటాయి’’ అని నవీన్‌చంద్ర తెలిపారు. స్వాతి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హీరో నవీన్‌చంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడి ద్వారా ‘త్రిపుర’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్ ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. -
రెడీ...స్టార్ట్
‘మేము సైతం’ అంటూ విశాఖవాసులకు భరోసానిస్తున్న టాలీవుడ్ ఈవెంట్ సక్సెస్ కోసం ఫుల్‌గా ప్రిపేరవుతోంది. పది రోజులుగా రిహార్సల్స్‌లో మునిగిపోతున్నారు సినీజనాలు. ఆదివారం జరిగే 12 గంటల లైవ్ షో ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పలువురు నటీనటులు వెరైటీ స్కిట్స్‌తో రెడీ అవుతున్నారు. డ్యాన్స్, షోస్ ప్రాక్టీస్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. ఇంకొందరు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ ‘కూత’ పెడుతున్నారు. స్టార్స్ క్రికెట్లో బౌండరీలు బాదడానికి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ రంగంలోకి దిగిన ఇండస్ట్రీ ప్రాక్టీస్ సెక్షన్ ముచ్చట్లు మీ కోసం.. అందరూ భాగస్వాములే.. విశాఖవాసులకు ఎవరూ తీర్చలేని కష్టం వచ్చింది. దాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. మా వంతు సాయం చేయడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. మాకు వచ్చిన కళతోనే దీన్ని ఎదుర్కోవాలని మేముసైతం కార్యక్రమానికి పూనుకున్నాం. టాలీవుడ్ ఫ్యామిలీ తరఫున చేస్తున్న బృహత్కార్యం ఇది. ఇండస్ట్రీలోని అందరూ వివిధ పెర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. కమెడియన్స్ కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. నేను క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఈవెంట్ ద్వారా మేమందిస్తున్న సహాయం వారికి కొంతైనా ఓదార్పునిస్తుంది. మాతో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వైజాగ్ పునరుద్ధరణలో భాగస్వాములు కావాలి. - నాగార్జున ఎంత కష్టం.. విశాఖలో కొన్ని వందల షూటింగ్‌లు చేసుంటాం. అక్కడ ప్రతి అంగుళం మా సినీజనానికి తెలుసు. అవన్నీ సుడిగాలి తీవ్రతకు సర్వనాశనమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు రూ.16 కోట్ల విలువైన సామగ్రి పంపించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఇండస్ట్రీ ఆదుకుంటుందని గతంలో ఎన్నోమార్లు రుజువైంది. ఆ ఆదర్శంతోనే ఈరోజు మేమంతా ముందుకు వచ్చాం. రచయితలమంతా కలసి స్వచ్ఛభారత్‌పై జొన్నవిత్తుల రాసిన ఓ స్కిట్‌ను ప్రదర్శిస్తున్నాం. - పరుచూరి గోపాలకృష్ణ తలో చెయ్యి.. వారం రోజులుగా నటీనటులందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దామూ నేతృత్వంలో ఈ సెక్షన్ నిర్వహిస్తున్నాం. బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ, కోడి రామకృష్ణ, నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్, ఈవీవీ సత్తిబాబు, శివారెడ్డి ఇలా అందరూ స్కిట్స్ చేస్తున్నారు. నేను, ఖయ్యూం ఇద్దరం వీటిని కో ఆర్డినేట్ చేస్తున్నాం. - కాదంబరి కిరణ్ అందరివాళ్లం.. హుద్‌హుద్ తీవ్రతకు బ్యూటిఫుల్ వైజాగ్ కళావిహీనమైపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంతా కలసి వారికి సాయం చేయాలని ముందుకు వచ్చింది. క్రికెట్లో నేను వెంకటేష్ టీమ్‌లో ఉన్నాను. నాలుగు జట్లు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్స్ ఆరు ఓవర్లు సాగుతుంది. నేను సీసీఎల్, టీసీఐ టీమ్‌లలో ఉన్నాను. అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉంటాను. - నవీన్ చంద్ర ఉడతాసాయం నాకు క్రికెట్ అంటే ప్రాణం. విశాఖవాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తున్న గొప్ప కార్యక్రమమిది. ఉడతాసాయంగా నేను అందులో పాలుపంచుకోవాలనుకున్నాను. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 900 గ్రాముల లైట్‌వెయిట్ బీడీఎం బ్యాట్స్ తెప్పించాను. హీరో నాగార్జునకు అందించాను. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్లకూ ఇస్తాను. - చక్రపాణి, స్పోర్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ చైర్మన్ బాధ్యతగా ఫీలవుతున్నాం.. వైజాగ్ ఒక ప్రళయాన్ని చూసింది. ఈ సమయంలో వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే ఇండస్ట్రీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో నేను భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. - నాని క్రికెట్, కబడ్డీ కూడా.. ఎంటర్టైన్మెంటే కాదు.. ఇలాంటి సందర్భాల్లో కూడా అండగా ఉంటామని టాలీవుడ్ నిరూపించింది. డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్తో పాటు క్రికెట్, కబడ్డీ జట్టుల్లో కూడా ఉన్నాను. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. - తనీష్ స్టే స్ట్రాంగ్ మా సినిమాలను ఆదరించిన కామన్ పీపుల్ కష్టాల్లో ఉంటే స్పందించడం మా కనీస బాధ్యత. నేను కబడ్డీ జట్టులో ఉన్నాను. స్కిట్లో కూడా యాక్ట్ చేస్తున్నా. గుడ్ కాజ్ గురించి చేస్తున్న ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. స్టే స్ట్రాంగ్ మీకు మేమున్నాం. - నవదీప్ పది రోజులుగా.. మేముసైతంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను స్కిట్స్ కో ఆర్డినేట్ చేస్తున్నాను. పది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఎమ్మెస్, రఘుబాబు, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి.. ఇలా అందరు నటులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే నేను రామ్‌చరణ్‌తేజ్ టీమ్‌లో ఉన్నాను. - ఖయ్యూం ప్రత్యేక అనుబంధం.. నా మొదటి సినిమా వేదం వైజాగ్‌లోనే షూట్ చేసుకుంది. ఆ సిటీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయం చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ విశాఖవాసులకు చేయూతనివ్వాలి. డ్యాన్స్‌తో పాటు క్రికెట్ కూడా ఆడుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌లో ఉన్నాను. ఫ్యాషన్ పెరేడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. - దీక్షాసేథ్ ఎప్పుడూ సిద్ధం.. గతంలో దాసరి గారు, మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన చారిటీ ఈవెంట్లలో పాల్గొన్నాను. మేముసైతం సక్సెస్ కోసం నటీనటులంతా కష్టపడుతున్నారు. నేను హంసనందిని, దీక్షాసేథ్, ఊర్వశి, తనీష్ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను. - సత్య మాస్టర్ అందుకే వచ్చా.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా నడవటం సంతోషంగా ఉంది. మేముసైతం కాజ్ నచ్చడంతో టాలీవుడ్‌తో పరిచయం లేకున్నా.. ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాను. నేను టాలీవుడ్ నటిని కాకపోయినా.. వారు చేసే మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. - ఊర్వశి రౌటెల ..:: శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా -
మూడు జంటల కథ
క్రైమ్, కామెడీ నేపథ్యంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ, ప్రాచీ, శ్రేయ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నవదీప్, నవీన్‌చంద్ర హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విభిన్నమైన స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన క్లయిమాక్స్‌తో సాగే చిత్రం ఇది’’ అని ఈ సందర్భంగా నవదీప్ అన్నారు. ఎంతో ఇష్టంగా చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మూడు జంటల మధ్య సాగే కథ ఇది. క్రైమ్, కామెడీ ప్రధానాంశాలు. ఈ నెల 28న పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, థ్రిల్లర్స్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే.. మరిన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అన్నారు. -
ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!
‘‘ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. నాకు ఈ తరహా స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌తో తక్కువ సినిమాలు వస్తాయి. విభిన్న అంశాలను మేళవించి తీసిన చిత్రం ఇది. చేస్తున్నప్పుడే చాలా థ్రిల్ అయ్యాను. రషెస్ చూసి, చాలా సంతృప్తిపడ్డాను’’ అని నవదీప్ అన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దర్శకుడు చందు మొండేటి ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనంతరం కార్తీక్ వర్మ మాట్లాడుతూ -‘‘చందు దర్శకత్వంలో వహించిన ‘కార్తికేయ’కు స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఆ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడు రాజేష్‌గారికి ఈ కథ చెప్పాను. ఇదొక క్రైమ్, కామెడీ థ్రిల్లర్. కథను నమ్మి ఆయన ఈ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ సినిమా చేశాను’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కార్తీక్ వర్మ ఏదైతే చెప్పాడో దాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త కథతో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ మంచి స్క్రిప్ట్‌తో చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె. ధరన్.