మూడు జంటల కథ | bham bolenath movie audio release on 28th november | Sakshi
Sakshi News home page

మూడు జంటల కథ

Published Sun, Nov 23 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

మూడు జంటల కథ

మూడు జంటల కథ

 క్రైమ్, కామెడీ నేపథ్యంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ, ప్రాచీ, శ్రేయ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’.  శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నవదీప్, నవీన్‌చంద్ర  హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘విభిన్నమైన స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన క్లయిమాక్స్‌తో సాగే చిత్రం ఇది’’ అని ఈ సందర్భంగా నవదీప్ అన్నారు. ఎంతో ఇష్టంగా చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మూడు జంటల మధ్య సాగే కథ ఇది. క్రైమ్, కామెడీ ప్రధానాంశాలు. ఈ నెల 28న పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, థ్రిల్లర్స్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే.. మరిన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement