ఆగస్టులో ఎవరు | adivi sesh evaru first look release | Sakshi
Sakshi News home page

ఆగస్టులో ఎవరు

Published Sun, Jul 14 2019 1:21 AM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

adivi sesh evaru first look release - Sakshi

‘ఎవరు’ ఫస్ట్‌లుక్‌

అడివి శేష్‌ కథానాయకుడిగా నటì ంచిన థ్రిల్లర్‌ మూవీ ‘ఎవరు’. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తున్నారు. వెంకట్‌ రామ్‌ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్ర చేశారు. అడివి శేష్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. రక్తం అంటిన అద్దాన్ని అడివి శేష్‌కు చూపిస్తూ ఏదో చెప్పాలని రెజీనా ప్రయత్నిస్తున్నట్లు ఫస్ట్‌ లుక్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement