Rezina
-
Kajal Aggarwal, Regina Cassandra: పాంచ్ పటాకా!
కాజల్ అగర్వాల్‌లో సూపర్ పవర్స్ ఉన్నాయి కానీ ఈ విషయం తనకు తెలియదు. కానీ ఆ విషయం రెజీనాకు తెలుసు. ఏంటి కథ అనుకుంటున్నారా? అవును.. ఇది సినిమా కథ. ‘కవలై వేండాం’ (2016) (తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’) తర్వాత దర్శకుడు డీకే, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు డీకే మాట్లాడుతూ – ‘‘ఇదొక హారర్ మూవీ. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాం. ఈ చిత్రంలో కాజల్, రెజీనా, రైజా, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. కథ వినగానే ఐదుగురూ ఓకే అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లందరి కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించడం మాకు ఓ ఛాలెంజ్‌గా అనిపించింది. ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కాంబినేషన్ డేట్స్ దొరకడం ఇబ్బంది అయ్యింది. షూటింగ్ పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐదుగురి పాత్రలూ వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని సినిమాలో కాజల్‌కు తెలియదు. కాజల్‌కు ఉన్న ఇమేజ్ రెజీనాకు నచ్చదు. రెజీనా ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఇక జనని అతీంద్రియ శక్తులను నమ్ముతుంది. ఇంతకన్నా ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పలేను. థియేటర్స్‌లో ఆడియన్స్ మా సినిమాను తప్పక ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు. ఐదుగురు అందమైన భామలు ఒకే సినిమాలో కనిపిస్తే పాంచ్ పటాకాలా ఉంటుంది. -
ఆట మొదలైంది
విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ లుక్‌లో విశాల్ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్ చెప్పే డైలాగ్‌తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్ దోపిడీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్ విజయ్, సృష్టి డాంగే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం. -
మరోసారి విలన్‌గా..
ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్ హీరోగా ఆనంద్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. -
స్పెషల్ రోల్
టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఏర్పడే అనర్థాలను చూపిస్తూ విశాల్ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) తీశారు. పీయస్ మిత్రన్ తీసిన ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఎళిల్ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో రెజీనా కనిపిస్తారని సమాచారం. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని తెలిసింది. విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
పోలీసుల చేత ఫోన్లు చేయించారు
‘‘నన్ను థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అంటున్నారు. అవేమీ వద్దు. పూల దండలు, పొగడ్తలు అవసరం లేదు. ఎప్పటికీ మంచి సినిమాల శేష్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘కుర్రాడు కాలిఫోర్నియా నుంచి వచ్చాడు. ఇంగ్లీష్ టాకింగ్, వాకింగ్ బాగుంది. ఇక్కడ సినిమాలు చేస్తూ అక్కడ సౌకర్యవంతమైన జీవితం లీడ్ చేస్తుంటాడని నా గురించి మొదట్లో అనుకుని ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదు. మాది అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మా నాన్నగారు హోటల్ మేనేజర్‌గా చేశారు. మా అమ్మగారు వెయిట్రస్‌గా చేశారు. నాకూ కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. ‘పంజా’ తర్వాత కూడా అవి తగ్గలేదు. ఆ సినిమా తర్వాత విలన్‌గా నీకు ఫాలోయింగ్ వచ్చింది. హీరోగా ట్రై చేయమన్నారు. ఆ సమయంలో ‘కిస్’ సినిమా చేశాను. మ్యాట్నీ షో టైమ్‌కి ఓ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి రెండు మూడు కోట్లు పోతాయన్నాడు. నా జేబులో పది రూపాయలు కూడా లేని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారు కొందరు పోలీసుల చేత ఫోన్లు చేయించారు. సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడతారు. నా సినిమా నిలబడాలని కోరుకుంటాను. ఎందుకంటే మరోసారి నేను పోలీస్ స్టేషన్లో నిలబడను. ‘ఎవరు’ సక్సెస్ తర్వాత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్ చేసి ‘కథ ఉందా? నీపై నమ్మకం ఉంది’ అన్నారు. ఆ నమ్మకం కోసమే కష్టపడుతున్నాను. డబ్బు లేనప్పుడు కూడా నన్ను నమ్మింది రచయిత అబ్బూరి రవిగారే. నా బ్యాక్‌గ్రౌండ్ ఆయనే. నాపై నమ్మకం ఉంచిన పీవీపీ గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ ప్రేక్షకులకు నచ్చేలా రావడానికి మాలో మేం గొడవలు పడ్దాం. ఫైనల్‌గా సినిమా గెలిచింది. ఈగోల కన్నా సినిమా చాలా పెద్దది. శేష్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. రామ్‌జీ తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతాడు. ‘ఎవరు’ లైబ్రరీ ఫిల్మ్ వంటిది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘శేష్ ఆల్రెడీ రెండు హిట్స్ (క్షణం, గూఢచారి)తో ఉన్నాడు. ఏం చేయాలా? అనుకున్నా. ‘ఏం చేసినా నమ్మకంతో చేయి’ అన్న అబ్బూరి రవిగారి మాటలు నాకు సహకరించాయి. మా సినిమాకు కో డైరెక్టర్ లేడు. మా ఏడీ టీమ్ సుధీర్, సూర్య, మనీషా, దివ్య బాగా కష్టపడ్డారు. నాకు కృష్ణానగర్ కష్టాలు లేవు. నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తోంది. నా స్నేహితులే నా ఎమోషనల్ సపోర్ట్’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘థ్రిల్లింగ్ స్టార్ అనేది శేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనిపిస్తుంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రెజీనా. నటులు సాయి, శశి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్, డీఓపీ వంశీ పచ్చిపులుసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కేకే, భాను మాట్లాడారు. -
వారికి శేష్ ఒక ఉదాహరణ
‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్‌లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేవు. వరుస ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్‌ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్ రామ్‌జీ యాక్టర్ అనమంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్ యాక్టర్‌గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్‌చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్’ సినిమా సమయంలో నవీన్‌చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్‌గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను. సినిమా చూసి మా బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్ స్క్రీన్‌కి వెళ్లి చూశాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలి’’ అన్నారు రెజీనా. -
మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!
‘‘పాజిటివ్ క్యారెక్టరా? నెగటివ్ క్యారెక్టరా? అని కాదు. కథ బలంగా ఉండాలి. కథ నా పాత్ర చుట్టూ తిరగాలి. అలాంటి సినిమాలు చేయాలనుకుంటా’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అడివి శేష్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో పదివేలు, ఇరవై వేలకు ఆశపడి తప్పులు చేసే విక్రమ్ వాసుదేవ్ అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. ఈ ‘ఎవరు’ చిత్రానికి హిందీ ‘బద్లా’తో ఏమైనా లింక్ ఉందా? అనే విషయం థియేటర్లోనే తెలుస్తుంది. ► ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు రామ్‌చరణ్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ట్రైలర్ నచ్చిందని రామ్‌చరణ్ అన్నారు. బెటర్మెంట్ చేశాం. రీషూట్ చేశాం. ఫైనల్‌గా సాలిడ్ స్టాండర్డ్స్‌కు సినిమాను తీసుకువచ్చాం. రీషూట్స్ చేయడం అనేది ‘క్షణం’ నుంచి నాకు అలవాటైందని అనుకుంటున్నా. మంచి అవుట్‌పుట్ రావడం కోసం మార్పులు చేయడంలో తప్పులేదన్నది నా అభిప్రాయం. ► థ్రిల్లర్ మూవీస్‌ను మళ్లీ చూడాలనిపించదు. ట్విస్ట్స్ తెలిసిపోయినప్పుడు రెండోసారి చూడాలనిపించదు. కానీ ఆ ట్విస్ట్‌లకు స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ ఉంటే మళ్లీ మళ్లీ చూడొచ్చు. ‘క్షణం’ అలాంటిదే. మా అమ్మగారు ఆ సినిమాను ఐదుసార్లు చూశారు. ► నా సక్సెస్ఫుల్ కెరీర్లో రచయిత అబ్బూరి రవిగారి పాత్ర ఉంది. అలాగే శోభు యార్లగడ్డగారి వల్ల ‘పంజా, బాహుబలి’ సినిమాల్లో నటించాను. నేను ఫ్లాప్ డైరెక్టర్ని. నా ‘కిస్’ సినిమా ఆడలేదు. పోస్టర్స్ అతికించే మైదాపిండి ఖర్చు కూడా రాలేదు. ‘క్షణం, గూఢచారి’ సినిమాల బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఆ సినిమాలకు కథ అందించింది నేనే. ‘మేజర్’ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు మేజర్ అనౌన్స్మెంట్ అని ట్విట్టర్లో పెడితే, నా పెళ్లి వార్త అనుకున్నారు. కానీ అది ‘మేజర్’ సినిమా గురించి. ‘గూఢచారి 2’ స్టార్ట్ ఉంటుంది. నా కమిట్మెంట్స్ని చూసుకుని ‘2 స్టేట్స్’ రీమేక్ గురించి ఆలోచిస్తా. -
‘ఎవరు’ ట్రైలర్ విడుదల
-
ట్రైలర్ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది
‘‘గూఢచారి’ చిత్రం ట్రైలర్‌ను ఇదే అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేశాం.. ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ‘ఎవరు’ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతే శేష్ ప్రతి సినిమా ట్రైలర్‌ని నేనే విడుదల చేయాల్సి వస్తుందనే ప్రమాదం ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పీవీపీ సినిమా బ్యానర్‌పై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం నాని మాట్లాడుతూ– ‘‘శేష్, రెజీనా, పీవీపీగారు సహా అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. ట్రైలర్ నేరుగా మనల్ని కథలోకి తీసుకెళ్లిపోయింది. అసలు తెలుగు సినిమానా? ఇంగ్లీష్ సినిమానా? అనిపిస్తోంది.. సినిమాను అంత బాగా చేశారు. టీజర్ చూసినప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తి పెరిగిపోయింది’’ అన్నారు. ‘‘మా సినిమా గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున మాట్లాడతాను’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సినిమాలంటే ప్యాషన్ ఉన్న టీమ్ ఇది. రెండేళ్ల ముందు అనుకున్న ఆలోచనతో చేశాం. మంచి సినిమా అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత పీవీపీ అన్నారు. ‘‘ఎవరు’ సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘నేను నమ్మిన సినిమా.. నాకు నచ్చిన సినిమా ‘ఎవరు’. ఈ సినిమాలో అందరూ రెండు ముఖాలను కలిగి ఉంటారు. ఈ మనిషి ఇలా ఉంటారని ప్రేక్షకుడు అనుకున్న పది నిమిషాలకు ఆ మనిషి మారిపోతుంటాడు. ఇలాంటి కథతో సినిమా చేయబోతున్నానని రామ్‌జీ చెప్పగానే ట్విస్ట్‌ను బ్రేక్ చేయలేకపోయాను. నన్ను హీరోగా ఏ ప్రొడ్యూసర్ నమ్మని టైమ్‌లో పీవీపీగారు నమ్మారు. అందుకే ఆయనతో ‘క్షణం’ తర్వాత ‘ఎవరు’ చేశా’’ అని అడివి శేష్ చెప్పారు. రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. -
తెలుగు సినిమాకి మంచి కాలం
‘‘ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్. కాన్సెప్ట్ మూవీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అక్కినేని సమంత. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించారు. నవీన్ చంద్ర కీలక పాత్రధారి. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన సమంత మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొత్త కంటెంట్ సినిమాలతో ఇండస్ట్రీని అడివి శేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు వెంకట్. రెజీనా మంచి నటి. నవీన్‌చంద్రతో సహా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సమంత. ‘‘సమంతలోని పాజిటివ్ వైబ్స్ లక్‌గా మారతాయి. ‘గూఢచారి’ సమయంలో ఆమె సపోర్ట్ చేశారు. ‘క్షణం’ ముందు వరకు అందరూ నన్ను విలన్‌గా చూశారే తప్ప... మెయిన్ లీడ్‌గా ఎవరూ చూడలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీగారు. ఆయనకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. వెంకట్‌ను ఈ సినిమాను మనసు పెట్టి చేయమన్నాను’’ అన్నారు అడివి శేష్. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నవీన్‌చంద్ర. -
ఆగస్టులో ఎవరు
అడివి శేష్ కథానాయకుడిగా నటì ంచిన థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తున్నారు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించారు. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. అడివి శేష్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రక్తం అంటిన అద్దాన్ని అడివి శేష్‌కు చూపిస్తూ ఏదో చెప్పాలని రెజీనా ప్రయత్నిస్తున్నట్లు ఫస్ట్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
శేష్ ఎవరు?
అడివి శేష్, పీవీపీ కాంబినేషన్లో వచ్చిన ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శేష్‌కి జోడీగా రెజీనా నటిస్తుండగా, నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆగస్ట్ 23న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
స్క్రీన్ టెస్ట్
సినిమా డైలాగ్ అనగానే యన్టీఆర్ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలో ‘ఆచార్య దేవా’ ఏమంటివీ.. ఏమంటివీ ... అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయంటే డైలాగ్‌కి ఉన్న పవర్ అది. 2018లో విడుదలైన చిత్రాల్లోని పలు ఫేమస్ డైలాగ్‌లు ఈ వారం క్విజ్.... 1. ‘‘ప్రతిభ ఇంటిపట్టునుంటే... ప్రపంచానికి పుట్టగతులుండవు’’ ఈ డైలాగ్ ‘మహానటి’ చిత్రంలోనిది. చిత్రంలో ఈ డైలాగ్ పలికిన నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) ప్రకాశ్ రాజ్ సి) దుల్కర్ సల్మాన్ డి) నరేశ్ 2. ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్‌తో హల్చల్ చేసిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి. ఈ డైలాగ్ ఉన్న సినిమా 2019 ఆగస్టులో విడుదలవుతుంది? ఎ) మహేశ్‌బాబు బి) వెంకటేశ్ సి) ప్రభాస్ డి) రానా 3. ‘‘వయొలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మా మీద పడ్డ అత్యవసర పరిస్థితి...’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ:ఈ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్) ఎ) యన్టీఆర్ బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేశ్ 4. ‘‘ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తా’’ అనే ఫేమస్ డైలాగ్‌ను విజయ్ దేవరకొండతో చెప్పిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) ప్రియాంక జవాల్కర్ బి) మెహరీన్ సి) షాలినీ పాండే డి) రష్మికా మండన్నా 5. ‘‘క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాక ముందు చచ్చిపోవటమే’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ డైలాగ్‌ను రాసింది వక్కంతం వంశీ) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) కల్యాణ్ రామ్ డి) అల్లు అర్జున్ 6. ‘‘యూనిఫామ్‌లో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్ తీసేస్తే దీనమ్మ రాయితో చంపుతానో, రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి? (ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడు) ఎ) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బి) రవితేజ సి) నాగచైతన్య డి) గోపీచంద్ 7. ‘‘ఆడోళ్లు భలే కఠినాత్ములు...’ ఈ డైలాగ్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో హీరో నాని చెప్తాడు. ఈ డైలాగ్ రైటర్ ఎవరు? ఎ) వక్కంతం వంశీ బి) మేర్లపాక గాంధీ సి) పెంచల్ దాస్ డి) ఆకుల శివ 8. ‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ... ప్రతి ఒక్కరికీ బరువు, బాధ్యత ఉండాలి...’ అనే సోషల్ మెసేజ్ డైలాగ్ ఏ సినిమాలోనిదో కనిపెట్టండి? ఎ) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బి) భరత్ అనే నేను సి) టచ్ చేసి చూడు డి) కవచం 9. ‘చేపలకి కూడా కన్నీళ్లుంటాయి బాస్... నీళ్లల్లో ఉంటాం కదా కనిపించవు అంతే’ ఈ డైలాగ్‌ను హీరో నాని ‘అ!’ చిత్రంలోని చేప పాత్ర ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణవేణి పాత్రలో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) నిత్యామీనన్ డి) రెజీనా 10. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరో నితిన్ చెప్పిన ‘‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాము’’ డైలాగ్ రాసిందెవరో తెలుసా?(ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఓ నిర్మాత) ఎ) చైతన్యకృష్ణ బి) సత్యానంద్ సి) త్రివిక్రమ్ డి) యం.రత్నం 11. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. ఈ చిత్రానికి మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) కోన వెంకట్ బి) అబ్బూరి రవి సి) నాగ్ అశ్విన్ డి) బుర్రా సాయిమాధవ్ 12. ‘‘సల్మాన్‌ఖాన్ జిందాబాద్, షారుక్æఖాన్ జిందాబాద్, ఆమిర్ ఖాన్ జిందాబాద్, అబ్దుల్ కలాం జిందాబాద్, ఇన్సాన్ జిందాబాద్, మొహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్’’ ఈ డైలాగ్ ‘మెహబూబా’ చిత్రంలోనిది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఆకాష్ పూరి. డైలాగ్ రైటర్ ఎవరో చెప్పుకోండి? ఎ) పూరి జగన్నాథ్ బి) భాస్కరభట్ల సి) కందికొండ డి) వనమాలి 13 ‘‘కాలేజీలో ఉన్న ప్రతివాడికి రాఖీ కడతా, వాడికి తప్ప... బికాజ్ ఐ లవ్ హిమ్’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా ఏ హీరో గురించి అంటుందో కనిపెట్టండి? ఎ) వరుణ్ తేజ్ బి) సాయిధరమ్ తేజ్ సి) సందీప్ కిషన్ డి) నాగౖచైతన్య 14. ‘‘ఏయ్ లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా అని హీరోయిన్ అంటే... ఆ మీకు తెలిసిపోయిందా. అయినా మీరు ఇలా దగ్గరికొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి...’’ అని హీరో శర్వానంద్ ఏ హీరోయిన్ని ఉద్దేశించి అంటాడో కనుక్కోండి? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయి పల్లవి డి) నిత్యామీనన్ 15. ‘‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ, అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు...’ ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ బి) అఖిల్ సి) రాహుల్ రవీంద్రన్ డి) నవీన్ చంద్ర 16. ‘‘ఫణీంద్ర భూపతి నాయుడు.. నువ్వు భయపడాల్సింది మేకను చంపిన సింహాల గుంపును చూసి కాదు, సింహాల మందకు ఎదురు తిరిగిన మేక గురించి’’ అనే డైలాగ్ ‘రంగస్థలం’ చిత్రంలోనిది. ఫణీంద్ర నాయుడుగా నటించింది ఎవరు? ఎ) ఆది పినిశెట్టి బి) రాజీవ్ కనకాల సి) ‘జబర్దస్త్’ మహేశ్ డి) జగపతిబాబు 17. ‘‘అమ్మాయిలతో ప్రాబ్లమ్ ఇదేరా, మనం వాళ్లను చూసినా వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమేరా’’ ఈ డైలాగ్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ప్రసన్నకుమార్ బెజవాడ బి) విజయేంద్ర ప్రసాద్ సి) పోసాని కృష్ణమురళి డి) వేగేశ్న సతీశ్ 18. ‘‘సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి. అంతే.. అని నరేశ్ అంటే, సాహిత్యం అన్నావ్ ఓకే, సినిమా...’ అని సుధీర్‌బాబు అనే డైలాగ్ ‘సమ్మోహనం’ చిత్రం లోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) తనికెళ్ల భరణి సి) శ్రీనివాస్ అవసరాల డి) జనార ్ధన మహర్షి 19. ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా’’ అనే డైలాగ్ ‘భాగమతి ’ చిత్రంలోనిది. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) యూవీ క్రియేషన్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 20. ‘‘నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’’ అనే డైలాగ్ ‘నేలటిక్కెట్టు’ చిత్రంలో హీరో రవితేజ చెబుతారు. ఈ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) వీఐ ఆనంద్ బి) కల్యాణ్ కృష్ణ సి) వీవీ వినాయక్ డి) శ్రీను వైట్ల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి )2) సి 3) ఎ 4) డి 5) డి 6) బి 7) బి 8) బి9) సి 10) ఎ 11) డి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) డి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఏడుతో లింకేంటి?
ఈ మధ్య రెజీనా ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు లెక్కేస్తూ ఏడు రాగానే ఆగిపోతున్నారు. ఎందుకిలా? ఏడు రెజీనా లక్కీ నెంబరా అంటే.. కాదట. విషయం ఏంటీ అంటే... ‘7’ ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా టైటిల్. అందుకే ఆ అంకెను అదే పనిగా పలుకుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ రెజీనా ‘ఏడు’ అంకె జపం చేస్తారేమో! ఇంతకీ కథలో 7కి లింక్ ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే. కెమెరామేన్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి, తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రెహమాన్, హవీష్, రెజీనా, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
మేలో ‘మిస్టర్ చంద్రమౌళి’
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కుమారుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ సినిమా మేలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వరలక్ష్మీశరత్‌కుమార్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో, బాప్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో క్రియేటీవ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ షెడ్యూల్ ప్రకారమే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిందన్నారు. నాలుగు పాటల్లో ఇప్పటికే రెండు పాటలను చిత్రీకరించామన్నారు. మరో రెండు పాటల కోసం చిత్ర యూనిట్ థాయ్‌ల్యాండ్‌కు వెళ్లిందన్నారు. కాగా ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతంచేసుకుందన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, మేలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ధన్యవాదాలు చెబుతున్నారు
‘‘ఇలాంటి జానర్లో సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాను. కొందరికి ఒక్కసారి చూసిన వెంటనే అర్థం అవుతుంది. మరికొందరికి రెండు మూడు సార్లు చూశాక అర్థం అవుతుంది. నా నెక్ట్స్ మూవీ కూడా ఇలానే ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అ!’. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు ప్రశాంత్ వర్మ పాత్రికేయులతో చెప్పిన విశేషాలు. ► నేను ఇంజనీరింగ్ చేశాను. డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్,యాడ్ ఫిల్మ్స్ చేశాను. ‘అ!’ సినిమాకు ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఒరిజినల్‌గా ఏమైనా రాద్దాం అనుకున్నాను. ఎక్స్ప్రెషనిజమ్ అనే జానర్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాను. ఈ సినిమాను నేనే స్వయంగా నిర్మిద్దాం అనుకున్నాను. చేప వాయిస్ ఓవర్ కోసం వెళ్తే నానీగారు ‘నేనే నిర్మిస్తా’ అన్నారు. ► నానీగారికి కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా నేను చేసుంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నానీగారు నిర్మాత కాబట్టి ఆయనకున్న క్రెడిబులిటీ పాడు చేయకూడదు. ఇదే విషయాన్ని ఆయనకు ముందే చెప్పా. ఆయన కాన్ఫిడెంట్‌గా సినిమా చేద్దాం అన్నారు. ► ఈ సినిమా నా కోసం కంటే నానీ, ప్రశాంతీగారి కోసం, రాబోయే యువ దర్శకుల కోసం హిట్ కావాలని కోరుకున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్లీ చూడలేనేమో అని కొందరు, ఇంకా కొత్త కథలు రాయాలని మరికొందరు అన్నారు. ఇవే నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్. సినిమా చూసి కంగ్రాట్ చెప్పకుండా థ్యాంక్స్ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. ► కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఇలాంటి సినిమా చేయాలని ముందే అనుకున్నాను. కష్టమేమీ అనిపించలేదు. ఈ సినిమాతో అందన్నీ మెప్పించాలని ఏం అనుకోలేదు. నేను అనుకున్న జానర్ ఆడియన్స్‌ను మెప్పించాలనే ఉద్దేశంతోనే చేశాను. ► డబ్బు, అవార్డుల కోసం ఈ సినిమా చేయాలేదు. మా టీమ్‌లో ఎవరో ఒకరికి అవార్డ్ వస్తుంది అనుకుంటున్నాను. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాము. ఈ సినిమా కంటే ముందు చాలామంది నిర్మాతలకు కథలు చెప్పాను. స్టార్ట్ అవుతాయనుకుంటుండగా ఆగిపోయాయి. నా దగ్గర సుమారు 30కి పైగా కథలు ఉన్నాయి. -
నాని అ!
హీరో నాని నిర్మాతగా మారారు. ఆ సినిమా పేరు ‘అ!’. ప్రపంచంలో నేను... నాలోని ప్రపంచం... అనేది ఉపశీర్షిక. ట్విస్ట్ ఏంటంటే... ఇందులో నాని నటించడం లేదు. నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బా, మురళీ శర్మ, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్య తారలు. రవితేజ, నానిలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించనున్న ‘అ!’ టైటిల్ లోగో, నటీనటుల వివరాలను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ‘‘ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఓ కథ చెప్పాడు. అందులోని చిన్న పాత్రకు నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడు. కథ కొత్తగా, విభిన్నంగా ఉంది. ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఇటువంటి కథను పెద్ద తెరపై చూడలేదనిపించింది. సరైన టీమ్, సపోర్ట్ ఇటువంటి ఐడియాకి అవసరమని భావించి... ‘ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రశాంత్?’ అనడిగా. ‘ఇంకా తెలీదు భయ్యా... ఎలాగోలా మేనేజ్ చేస్తా’ అన్నాడు. ‘మేనేజ్ చేసే సినిమా కాదిది. సరిగ్గా, బాగా చేయాలి’ అన్నాను. తర్వాత ‘ఇలాంటి ఐడియాను నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు?’ అన్పించి, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రశాంత్‌కి ‘నేనే ప్రొడ్యూస్ చేస్తా’ అని చెప్పాను. నేను దిగిన తర్వాత బోల్డంత మంది ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్లు, ప్రశాంతి... వీళ్లందరూ కథ విని, నచ్చి, ఎంతో ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 పర్సెంట్ సినిమా రెడీ. వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అంతకు ముందు నాని పేర్కొన్నారు. అదండీ సంగతి!! -
సారీ.. ఇంకాస్త టైమ్ ఉంది
అవును. ఇంకాస్త టైమ్ ఉంది. ‘1945’ సినిమా నెక్ట్స్ షెడ్యూల్లో పాల్గొనడానికి రానాకు కొంచెం టైమ్ ఉంది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి కూడా ఇంకా టైమ్ ఉంది. అదేంటీ? నవంబర్‌లో తన లుక్‌ని రిలీజ్ చేస్తానని రానా గత నెల పేర్కొన్నారు కదా! ఈ నెల ఎండ్ కావడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. మరి.. లుక్ ఎక్కడ? అంటే.. గురువారం ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు రానా. ‘వారం రోజులే ఉంది... నవంబర్ పూర్తి కావడానికి. 1945 సినిమాలోని లుక్ వస్తుందా?’ అని ఓ అభిమాని రానాను అడగ్గా.. ‘‘సారీ. ఇంకాస్త టైమ్ ఉంది. త్వరలో వివరాలు తెలియజేస్తాను’’ అని పేర్కొన్నారు రానా. సత్యశివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి ‘మడై తిరందె’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో రానా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. -
సిక్స్ ప్యాక్ చేయలేదు
‘‘నేనిప్పటి వరకూ చాలామంది కొత్త దర్శకులతో పనిచేశాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పవన్ మల్లెల మొదటి సిట్టింగ్‌లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ‘బాలకృష్ణుడు’ సినిమా చేశా’’ అని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మించిన ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఫుల్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న టైమ్‌లో ఈ చిత్రం కుదిరింది. కథ మరీ కొత్తగా ఉండదు. కానీ, దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. నటుడు అజయ్ ద్వారా ఈ సినిమా నా దగ్గర వచ్చింది. ఇందులో ప్రధాన విలన్ అతనే. డబ్బు కోసం ఏమైనా చేసే బాలు పాత్రలో కనిపిస్తా. అయితే నెగెటివ్ షేడ్స్ ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే భిన్నమైనది. టైటిల్లోనే కమర్షియల్ సినిమా అని తెలిసిపోవాలని ‘బాలకృష్ణు్ణడు’ పెట్టాం. ‘జ్యో అచ్యుతానంద’కి, ఈ సినిమాకి దాదాపు 21 కిలోలు తగ్గాను. ఈ సినిమాలో పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ చేయలేదు. పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్ళు’ సినిమా చేస్తున్నా. చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్ట్ ఉంది. లవ్‌స్టోరీలు కూడా వింటున్నా’’ అన్నారు. -
ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అనిపిస్తోంది – సమంత
‘‘సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి మహేంద్ర. బాలకృష్ణగారికి ‘మువ్వగోపాలుడు’, ఎన్టీఆర్‌కి ‘బృందావనం’ హిట్ అయినట్లే, ‘బాలకృష్ణుడు’ సినిమా నారా రోహిత్‌కి పెద్ద హిట్ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఆడియో సీడీలను హీరోయిన్ సమంత విడుదల చేయగా, హీరో సాయిధరమ్ తేజ్ అందుకున్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘మహేంద్రగారు నిర్మించిన ఈ తొలి సినిమా పెద్ద సక్సెస్ కావాలి. పవన్ మల్లెల ఐదేళ్లుగా నాకు మంచి మిత్రుడు. ట్రైలర్ చూస్తే సినిమా పెద్ద హిట్ సాధిస్తుందనిపిస్తో్తంది’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమాలు చేసిన నేను మంచి కథ కుదిరితే కమర్షియల్ మూవీ చేయాలనుకున్నా. ఆ టైమ్‌లో పవన్ మల్లెల ‘బాలకృష్ణుడు’ కథ చెప్పారు. నాకంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నా. సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. పవన్ నా వెనక పడి బరువు తగ్గమనేవాడు. నేను తగ్గానంటే ఆ క్రెడిట్ తనకే దక్కుతుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలని తిరుగుతున్నప్పుడు మహేంద్రతో స్నేహం కుదిరింది. ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. నాకు చిరాకు వచ్చి విజయవాడ వెళ్లిపోయా. సినిమా చేద్దామంటూ హైదరాబాద్‌కు పిలిపించి ‘బాలకృష్ణుడు’ చేయించాడు’’ అన్నారు పవన్ మల్లెల. దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ, హీరో నాగశౌర్య, హీరోయిన్ రాశీఖన్నా, నిర్మాత బెల్లంకొండ సురేష్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటులు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫరెంట్ బాలకృష్ణుడు
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ సినిమాలో సిక్స్‌ప్యాక్ దేహంతో కనిపించ నున్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాన్స్, మంచి పాటలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. పవన్ మల్లెల పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించారు. నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పృధ్వీ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ అలరిస్తుంది. రమ్యకృష్ణ ఇందులో పవర్ఫుల్ రోల్లో నటించారు. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్. ఈ నెలాఖరులో పాటలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: డి.యోగానంద్. -
నగరంలో రెజీనా హల్చల్
-
కూకట్‌పల్లిలో రెజినా సందడి