Kajal Aggarwal, Regina Cassandra: పాంచ్‌ పటాకా! | Enthavaraku E Prema starts post production works | Sakshi

Kajal Aggarwal, Regina Cassandra: పాంచ్‌ పటాకా!

May 1 2021 1:40 AM | Updated on May 1 2021 1:03 PM

Enthavaraku E Prema starts post production works - Sakshi

కాజల్‌ అగర్వాల్‌లో సూపర్‌ పవర్స్‌ ఉన్నాయి కానీ ఈ విషయం తనకు తెలియదు. కానీ ఆ విషయం రెజీనాకు తెలుసు. ఏంటి కథ అనుకుంటున్నారా? అవును.. ఇది సినిమా కథ. ‘కవలై వేండాం’ (2016) (తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’) తర్వాత దర్శకుడు డీకే, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు డీకే మాట్లాడుతూ – ‘‘ఇదొక హారర్‌ మూవీ. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాం. ఈ చిత్రంలో కాజల్, రెజీనా, రైజా, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు.

కథ వినగానే ఐదుగురూ ఓకే అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లందరి కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరించడం మాకు ఓ ఛాలెంజ్‌గా అనిపించింది. ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కాంబినేషన్‌ డేట్స్‌ దొరకడం ఇబ్బంది అయ్యింది. షూటింగ్‌ పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐదుగురి పాత్రలూ వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. తనకు సూపర్‌ పవర్స్‌ ఉన్నాయని సినిమాలో కాజల్‌కు తెలియదు. కాజల్‌కు ఉన్న ఇమేజ్‌ రెజీనాకు నచ్చదు. 

రెజీనా ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఇక జనని అతీంద్రియ శక్తులను నమ్ముతుంది. ఇంతకన్నా ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పలేను. థియేటర్స్‌లో ఆడియన్స్‌ మా సినిమాను తప్పక ఎంజాయ్‌ చేస్తారు’’ అని పేర్కొన్నారు. ఐదుగురు అందమైన భామలు ఒకే సినిమాలో కనిపిస్తే పాంచ్‌ పటాకాలా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement