DK
-
ఎంపీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదు
కర్ణాటక: కొందరు తాను వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతున్నారని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ డీకే సురేశ్ తెలిపారు, కుణిగల్ తాలూకా గిరగౌడనపాళ్యలో గురువారం ఓటర్లకు అభినందన సమావేశంలో పాల్గొని డీకే సురేశ్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ రాజకీయాలు తనకు అవసరమా వద్దా అనే మీమాంసలో ఉన్నానని, అందుకే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీ సలహా అవసరమని, అయితే తన లక్ష్యం మాత్రం ప్రజా సేవనే అని తెలిపారు. కుణిగల్ తాలూకాను ఒక ఆదర్శవంతమైన తాలూకాగా మార్చడమే తన ఆశయమన్నారు. అధికారం దక్కినప్పుడు సాధ్యమైనంత మేర అభివృద్ధి చేయాలన్నారు. -
Kajal Aggarwal, Regina Cassandra: పాంచ్ పటాకా!
కాజల్ అగర్వాల్‌లో సూపర్ పవర్స్ ఉన్నాయి కానీ ఈ విషయం తనకు తెలియదు. కానీ ఆ విషయం రెజీనాకు తెలుసు. ఏంటి కథ అనుకుంటున్నారా? అవును.. ఇది సినిమా కథ. ‘కవలై వేండాం’ (2016) (తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’) తర్వాత దర్శకుడు డీకే, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు డీకే మాట్లాడుతూ – ‘‘ఇదొక హారర్ మూవీ. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాం. ఈ చిత్రంలో కాజల్, రెజీనా, రైజా, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. కథ వినగానే ఐదుగురూ ఓకే అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లందరి కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించడం మాకు ఓ ఛాలెంజ్‌గా అనిపించింది. ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కాంబినేషన్ డేట్స్ దొరకడం ఇబ్బంది అయ్యింది. షూటింగ్ పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐదుగురి పాత్రలూ వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని సినిమాలో కాజల్‌కు తెలియదు. కాజల్‌కు ఉన్న ఇమేజ్ రెజీనాకు నచ్చదు. రెజీనా ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఇక జనని అతీంద్రియ శక్తులను నమ్ముతుంది. ఇంతకన్నా ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పలేను. థియేటర్స్‌లో ఆడియన్స్ మా సినిమాను తప్పక ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు. ఐదుగురు అందమైన భామలు ఒకే సినిమాలో కనిపిస్తే పాంచ్ పటాకాలా ఉంటుంది. -
సన్నీ సిజిలింగ్..!
సన్నీ లియోన్... ఈ పేరు చాలు కుర్రకారుకు కిర్రెక్కించడానికి. ఇప్పుడీ కిక్‌ను క్యాష్ చేసుకొంటున్నారు సినిమా జనం. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఈ మాజీ పోర్న్ స్టార్‌కు భాషా బేధం లేకుండా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టుగా.. ఈ శృంగార సుందరి కూడా ఎవర్నీ కాదనడం లేదు. ఈ మధ్య తెలుగులో ఓ సాంగేసుకున్న సన్నీ... తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ‘డీకే’ సినిమాలో మాంచి నిషానిచ్చే ఓ పాట చేస్తోంది. బెంగళూరు పరిసరాల్లో జరిగిన ఈ సాంగ్ షూటింగ్ మూడు రోజుల పాటు సాగిందట. ‘హిందీ కంటే దక్షిణాది చిత్రాల్లో హావభావాలు బాగా పలికించగలగాలి. డ్యాన్స్ కూడా..! ఇది సెక్సీ సాంగ్’ అంటూ చెప్పుకొచ్చింది సన్నీ. -
పెరియార్‌కు ఘన నివాళి
సాక్షి, చెన్నై:తమిళనాట పెరియార్‌గా పిలిచే దివంగత ఈవీ రామస్వామి నాయకర్ జాతీయ పార్టీలకు భిన్నంగా 1917లో బ్రహ్మణేతరులతో కూడిన దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1944లో సేలం వేదిగా జరిగిన సభ ద్వారా దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ద్రవిడ కళగం (డీకే) అనే ప్రాంతీయ పార్టీగా మార్చుతూ తీర్మానం చేశారు. అయితే, పెరియార్‌కు అనుంగు శిష్యుడిగా ఉన్న కాంజీవరం నటరాజ అన్నాదురై (సీఎన్ అన్నాదురై) అభిప్రాయ భేదాల కారణంగా ద్రవిడ కళగంను వీడి డీఎంకేను ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు ఆదర్శనీయులు. ద్రవిడ సిద్ధాంత కర్తగా పెరియార్ అవతరిస్తే, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్తగా అన్నాదురై నిలిచారు. ఈ ఇద్దరి జయంతి వేడుకలు ఒక రోజు వ్యవధిలో వస్తాయి. ఈనెల 15వ తేదీన అన్నాదురై 106వ జయంతిని ఘనంగా నిర్వహించగా, బుధవారం పెరియార్ 136వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే, డీఎండీకే, డీఎంకే, ఎండీఎంకే, ద్రవిడ కళగం, తందై పెరియార్ ద్రవిడ కళగం ఘనంగా నిర్వహించాయి. వాడ వాడల్లో ఆయన చిత్ర పటాల్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతల నివాళి : చెన్నైలోని సిమ్సన్, జెమిని వంతెన సమీపాల్లో ఉన్న పెరియార్ విగ్రహ పరిసరాల్లో వివిధ పుష్పాలతో అలంకరించారు. సిమ్సన్లోని పెరియార్ విగ్రహానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ పార్టీ నాయకులు ఆర్కాడు వీరాస్వామి, సద్గున పాండియన్, వీపీ దురై స్వామి, టీకేఎస్ ఇళంగోవన్, ఆర్ ఎస్ భారతీ, ఎం సుబ్రమణియన్, జే అన్భళగన్, ఆర్డి శేఖర్ బాబు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఎండీఎంకే కార్యాలయం తాయగంలోని పెరియార్ విగ్రహానికి ఆ పార్టీ నేతలు వైగో, తిరుప్పూర్ దురైస్వామి, మల్లై సత్యలు నివాళులర్పించారు. డీఎండీకే కార్యాలయంలో పెరియార్చిత్ర పటానికి ఆ పార్టీ అధినేత విజయకాంత్, పార్టీ ఎమ్మెల్యేలు పుష్పాంజలి ఘటించారు. జెమిని వంతెన సమీపంలోని పెరియర్ విగ్రహానికి అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి, నాయకులు బన్రూటి రామచంద్రన్, విశాలాక్షి నెడుంజలియన్ తదితరులు పూలమాలలు వేశారు. వీసీకే నేత తిరుమావళవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ తదితరులు పెరియార్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుప్పూర్‌లో జరిగిన వేడుకలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో మంత్రుల బృందం పెరియార్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. -
దళిత కుటుంబాల వెలిపై మంత్రి ఆరా
కగ్గనహళ్లిలో ఘటన సరుకులు ఇవ్వరాదని దండోరా గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ డీకే రవి గ్రామంలో ఉండలేక పోతున్నామని దళితుల ఆవేదన కోలారు, న్యూస్‌లైన్ : ముళబాగిలు తాలూకా కగ్గనహళ్లి గ్రామంలో దళిత కుటుంబాలను అగ్రవర్ణాలు వెలివేయడంపై జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై మంత్రి యూటీ ఖాదర్ ఆరా తీశారు. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ డీకే రవి హుటాహుటిన గ్రామాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీకి కేటాయించిన వంటమనిషి పోస్టును ఇతర కులాలకు కేటాయించడంతో పాటు కొళాయిల్లో నీరు పట్టుకునే విషయంపై కూడా దళితులు, అగ్రవర్ణాల మధ్య బేధాబిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. దీంతో గ్రామంలో 16 కుటుంబాలు ఉండగా నాలుగు కుటుంబాలను వెలివేశారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌కు బాధితులు మునిస్వామి, మునివెంకటప్ప, పాపణ్ణ, క్రిష్ణప్ప తమ గోడు వెల్లబోసుకున్నారు. దుకాణాలలో సరుకులు కూడా ఇవ్వకుండా అగ్రవర్ణాలు నాలుగు రోజుల క్రితం హుకుం జారీ చేస్తూ దండోరా వేయించారని వాపోయారు. ఎవరికైనా సరుకులు ఇస్తే రూ.500 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా అయిన మునిస్వామి ఆరోపించారు. తాను గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉండి కూడా ఏమి చేయలేక పోయానని, ఆత్మహత్య చేసుకోవాలనేంత మానసిక వేదనకు గురయ్యానని కన్నీరుమున్నీరయ్యారు. రాధమ్మ అనే మహిళ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్సీ సముదాయానికి రిజర్వు చేసిన వంట మనిషి ఉద్యోగానికి తాను దరఖాస్తు చేసుకున్నా ఇతర వర్గాల వారికి కట్టబెట్టారని వాపోయింది. ఇందుకు కారణం ఎస్డీఎంసీ అధ్యక్షుడు సురేష్‌బాబు కారణమని ఆరోపించింది. ఇదిలా ఉండగా తాము ఎవరినీ బహిష్కరించలేదని, వ్యక్తిగత కక్షలతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. తాము దళితుల భూములపై బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, విచారణలో అది రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. అకారణంగా తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ ఆదేశాల మేరకు రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ నిర్ధేశనాలయ అధికారుల బృందం ఉదయం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఎస్పీ రాంనివాస్ సెపాట్, సీఈఓ వినోత్ప్రియ, ముళబాగిలు తహశీల్దార్ సోమశేఖర్ , ముళబాగిలు డీఎస్పీ సిద్దప్ప తదితరులు ఉన్నారు. ఆ నియామకాన్ని రద్దు చేయండి వంటమనిషి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసి ఎస్సీ మహిళతో ఆ పోస్టు భర్తీ చేయాలని పీడీఓ బాబు శేషాద్రిని కలెక్టర్ ఆదేశించారు. దళిత కాలనీలకు నీటిని సక్రమంగా సరఫరా చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్కు పంప్‌సెట్ అమర్చాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు అందరూ కలిసి వెళ్లాలని కలెక్టర్ నచ్చచెప్పారు. గ్రామ బహిష్కరణ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాత్రికేయులకు తెలిపారు. దోషులని తేలితే ఎంతటివారినైనా వదిలేది లేదు : ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ కగ్గనహళ్లి గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ విషయంలో దోషులని తేలితే ఎంతటివారినైనా వదిలేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఘటనపై విచారణ జరిపించేందుకు తహశీల్దార్ తదితర అధికార బృందాన్ని గ్రామానికి పంపాము.