
ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ డీకే సురేశ్
కర్ణాటక: కొందరు తాను వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతున్నారని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ డీకే సురేశ్ తెలిపారు, కుణిగల్ తాలూకా గిరగౌడనపాళ్యలో గురువారం ఓటర్లకు అభినందన సమావేశంలో పాల్గొని డీకే సురేశ్ మాట్లాడారు.
ప్రస్తుతం ఈ రాజకీయాలు తనకు అవసరమా వద్దా అనే మీమాంసలో ఉన్నానని, అందుకే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీ సలహా అవసరమని, అయితే తన లక్ష్యం మాత్రం ప్రజా సేవనే అని తెలిపారు. కుణిగల్ తాలూకాను ఒక ఆదర్శవంతమైన తాలూకాగా మార్చడమే తన ఆశయమన్నారు. అధికారం దక్కినప్పుడు సాధ్యమైనంత మేర అభివృద్ధి చేయాలన్నారు.