
సన్నీ సిజిలింగ్..!
సన్నీ లియోన్... ఈ పేరు చాలు కుర్రకారుకు కిర్రెక్కించడానికి. ఇప్పుడీ కిక్‌ను క్యాష్ చేసుకొంటున్నారు సినిమా జనం. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాక ఈ మాజీ పోర్న్ స్టార్‌కు భాషా బేధం లేకుండా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టుగా.. ఈ శృంగార సుందరి కూడా ఎవర్నీ కాదనడం లేదు. ఈ మధ్య తెలుగులో ఓ సాంగేసుకున్న సన్నీ... తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ‘డీకే’ సినిమాలో మాంచి నిషానిచ్చే ఓ పాట చేస్తోంది. బెంగళూరు పరిసరాల్లో జరిగిన ఈ సాంగ్ షూటింగ్ మూడు రోజుల పాటు సాగిందట. ‘హిందీ కంటే దక్షిణాది చిత్రాల్లో హావభావాలు బాగా పలికించగలగాలి. డ్యాన్స్ కూడా..! ఇది సెక్సీ సాంగ్’ అంటూ చెప్పుకొచ్చింది సన్నీ.