అలాంటి స్టేటస్ నాకు వద్దు: సన్నీలియోన్ | always feel uncomfortable with celebrity status, says Sunny Leone | Sakshi
Sakshi News home page

అలాంటి స్టేటస్ నాకు వద్దు: సన్నీలియోన్

Published Sun, Dec 18 2016 5:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అలాంటి స్టేటస్ నాకు వద్దు: సన్నీలియోన్ - Sakshi

అలాంటి స్టేటస్ నాకు వద్దు: సన్నీలియోన్

ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం కావడం సన్నీలియోన్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. 2011లో జరిగిన బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది. 'జిస్మ్ 2' హాట్ సీన్లతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది సన్నీ. పోర్న్ స్టార్ ముద్రతో ఇక్కడికి వచ్చినా.. బాలీవుడ్ లో ఎన్నో మూవీలు చేసి త్వరలోనే తనదైన ముద్రవేసింది. అయితే తనకు మాత్రం సాధారణ మహిళగా ఉండటమే ఇష్టమని, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా చూస్తే ఎంతో అసౌకర్యానికి లోనవుతానని సన్నీ చెప్పింది.

ప్రస్తుతం బాద్ షా షారుక్ ఖాన్ తో రాయిస్ మూవీలో ఓ పాటలో ఆడి పాడానని, అక్షయ్ కుమార్ తోనూ నటించే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటోంది. మూవీల కోసం తాను ఎంతో శ్రమించానని, అయినా సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే ఏం చేయాలో తనకు అర్థంకాని విషయమని చెప్పింది. తన భర్త సహకారం లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని సన్నీలియోన్ అభిప్రాయపడింది.

ఇటీవల బీబీసీ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తులలో స్థానం దక్కించుకోవడంపై మాట్లాడుతూ.. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పింది. దాంతో పాటుగా గత అయిదేళ్ల నుంచి మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్ గా ఉండటంపై సన్నీ హర్షం వ్యక్తంచేసింది. తన మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించినా, నిరాశపరిచినా తన శ్రమను గుర్తించినందకు అభిమానులకు హాట్ భామ సన్నీ ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement