సన్నీలియోన్‌కు మరో ఘనత!! | sunny leone will be first bollywood person to walk on that ramp | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌కు మరో ఘనత!!

Published Mon, Sep 5 2016 8:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

సన్నీలియోన్‌కు మరో ఘనత!! - Sakshi

సన్నీలియోన్‌కు మరో ఘనత!!

బాలీవుడ్ బాంబ్‌షెల్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్తింపు పొందబోతోంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంత పెద్ద ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఆమె ఉబ్బి తబ్బిబ్బు అయిపోతోంది.

ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో తాను నడవబోతున్నట్లు సన్నీ ట్వీట్ చేసింది. ఇక ఇదే విషయం గురించి డిజైనర్ అర్చనా కొచ్చర్ కూడా ట్వీట్ చేసింది. తాను భారతదేశంలో పర్యటించినప్పుడు పొందిన అనుభూతులతో రూపొందించిన 'ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్' అనే డిజైనర్ దుస్తులను సన్నీ కోసం అర్చన ఇస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement