Janani
-
హీరో విజయ్ విడాకుల రూమర్స్.. లియో నటి ఏమందంటే?
అభిమానిని పెళ్లి చేసుకున్న కొద్దిమంది కళాకారుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒకరు. సంగీత.. లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. విజయ్ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయింది. ఆయనను చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది. విజయ్ పేరెంట్స్ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు. విజయ్ కష్టసుఖాల్లో తోడుగా సంగీత విజయ్‌కు కూడా తనపై ఇష్టం ఏర్పడటంతో 1999లో వీరి పెళ్లి జరిగింది. వీరికి కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె శాషా సంతానం. విజయ్ దంపతులు 24 ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. విజయ్ జయాపజయాలలోనూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది సంగీత. అయితే ఆ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. ఓ హీరోయిన్‌తో విజయ్ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం భార్యను వదిలేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ దంపతులు స్పందించనేలేదు. భార్య అంటే ఎంత ప్రేమో! తాజాగా లియో నటి జనని.. దళపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలతో విజయ్ విడాకుల వార్త ఉట్టి పుకారేనని తేలిపోయింది. జనని మాట్లాడుతూ.. 'విజయ్‌తో కలిసి కూర్చునే అవకాశం వచ్చినందుకే పొంగిపోయాను. అతడు నాతో మాట్లాడతాడని కలలో కూడా ఊహించలేదు. నేను శ్రీలంకన్ తమిళ్ మాట్లాడుతుంటే ఆయనకు తన భార్య సంగీతాయే గుర్తుకువచ్చేదనేవాడు. ఆమె కూడా నాలాగే శ్రీలంకలోని జఫ్నాలోనే పుట్టిపెరిగిందట. ఈ విషయాన్ని విజయ్ నాకు స్వయంగా చెప్పాడు. ఆయన నన్ను తన చెల్లెలిగా చూసుకున్నారు, అలాగే మాట్లాడారు' అని చెప్పుకొచ్చింది. కాగా జనని వ్యాఖ్యలతో విజయ్‌కు సంగీత మీద ఎంత ప్రేముందో అర్థమవుతోందంటున్నారు అభిమానులు. చదవండి: జీవితం నీటిబుడగలాంటిది, మాటలు రావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యాంకర్ ఝాన్సీ పోస్ట్ -
BCCI: జనని, గాయత్రి, వ్రిందా... రంజీ చరిత్రలో తొలిసారి!
BCCI- Ranji Trophy- ముంబై: భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు మహిళా అంపైర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత క్రికెట్లో ఇది కొత్త మలుపు కానుందని బోర్డు అభిప్రాయ పడింది. వ్రిందా రాఠి (ముంబై), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (ఢిల్లీ)లకు ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 13న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లకు వీరు అంపైర్లుగా వ్యవహరిస్తారు. 32 ఏళ్ల వ్రిందా ముంబైలో చిన్న స్థాయి క్లబ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెట్టి బీసీసీఐ అంపైర్‌గా ఎదగగా, 43 ఏళ్ల గాయత్రి బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై 2019 నుంచి అంపైరింగ్ చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన 36 ఏళ్ల జనని క్రికెట్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలి అంపైరింగ్ వైపు వెళ్లింది. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ -
ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లు.. ఫస్ట్‌లుక్ అవుట్
కాజల్ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘కరుంగాప్పియం’. తమిళ దర్శకుడు డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్, రెజీనా, జనని, రైజా ఉన్న ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. -
Kajal Aggarwal, Regina Cassandra: పాంచ్ పటాకా!
కాజల్ అగర్వాల్‌లో సూపర్ పవర్స్ ఉన్నాయి కానీ ఈ విషయం తనకు తెలియదు. కానీ ఆ విషయం రెజీనాకు తెలుసు. ఏంటి కథ అనుకుంటున్నారా? అవును.. ఇది సినిమా కథ. ‘కవలై వేండాం’ (2016) (తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’) తర్వాత దర్శకుడు డీకే, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు డీకే మాట్లాడుతూ – ‘‘ఇదొక హారర్ మూవీ. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాం. ఈ చిత్రంలో కాజల్, రెజీనా, రైజా, జనని, నోయిరికా ప్రధాన పాత్రలు పోషించారు. కథ వినగానే ఐదుగురూ ఓకే అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. సినిమా చిత్రీకరణ సమయంలో వీళ్లందరి కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించడం మాకు ఓ ఛాలెంజ్‌గా అనిపించింది. ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కాంబినేషన్ డేట్స్ దొరకడం ఇబ్బంది అయ్యింది. షూటింగ్ పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐదుగురి పాత్రలూ వేటికవే డిఫరెంట్‌గా ఉంటాయి. తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని సినిమాలో కాజల్‌కు తెలియదు. కాజల్‌కు ఉన్న ఇమేజ్ రెజీనాకు నచ్చదు. రెజీనా ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఇక జనని అతీంద్రియ శక్తులను నమ్ముతుంది. ఇంతకన్నా ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పలేను. థియేటర్స్‌లో ఆడియన్స్ మా సినిమాను తప్పక ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు. ఐదుగురు అందమైన భామలు ఒకే సినిమాలో కనిపిస్తే పాంచ్ పటాకాలా ఉంటుంది. -
లక్ష్మీ దేవి సమర్పణలో...
నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి’. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ, నరేశ్, ఆమని ముఖ్య తారలుగా జాకి అతిక్ దర్శకత్వంలో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ çసంస్థ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్, పాటలు బావున్నాయి. ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డిగారు రిచ్‌గా నిర్మించారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సీనియర్ నరేశ్. ‘‘హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించా. జాకీ ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు’’ అన్నారు కృష్ణ. నిర్మాత సీజే శోభారాణి, జనని, నటుడు గౌతంరాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, సహ నిర్మాత : సిరాజ్. -
నేమ్‌లోనే ఫేమ్ ఉందట
నమ్మకం మనిషిలో చాలా మార్పులకు కారణం అవుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఫేమ్ వస్తుందంటే నేమ్‌ను మార్చడానికీ వెనుకాడరు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా మంది అసలు పేర్ల కంటే కొసరు (మధ్యలో వచ్చిన) పేర్లతో పాపులర్ అయ్యారన్నది నిజం. ఇక్కడ సెంటిమెంట్‌కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పేర్లు మార్చేస్తుంది. నటి నయనతార అసలు పేరు డయానా. ఈ విషయం చాలా మంది కి తెలియదు. నటి లక్ష్మీరాయ్ ఇటీవల తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్నారు. ఇక ఆస్ట్రాలజీ కూడా బాగా పని చేస్తుంది. పేరులో ఒక అక్షరం చేర్చితే దశ తిరుగుతుందని ఒక అక్షరం, తీసేస్తే భవిష్యత్ బాగుంటుందని సూచించే జ్యోతష్కుల భావాలకనుగుణంగా పేరు మార్చుకునేవారు చాలా మంది ఉన్నారు. దీనికి నమ్మకమే మూలకారణం. తాజాగా నటి జననీ అయ్యర్ తన పేరులోని చివరి సగ భాగాన్ని తొలగించుకుని జనని అయ్యారు. ఈ బహుభాషా నటి, హీరోయిన్గా పలు చిత్రాలు చేసినా రావలసిన నేమ్, ఫేమ్ రాలేదనే చెప్పాలి. బాలా వంటి విశిష్ట దర్శకుడి చిత్రం (అవన్ ఇవన్)లో నటించిన జననికి ఆ తరువాత అంతగా పేరు గానీ, అవకాశాలు గానీ రాలేదు. పేరు మార్చుకుంటే టైమ్ బాగుంటుందని ఎవరయినా సలహా ఇచ్చారేమో తెలియదు కానీ జననీ అయ్యర్ ఇప్పుడు జననిగా అయ్యారు. దీనిపై ఆమె స్పష్టత ఇస్తూ పేరు మార్చుకోవడానికి ప్రత్యేకమయిన అంశం ఏది లేదన్నారు. తాను నటించిన తెగిడి చిత్రానికి ముందు అన్ని చిత్రాలకు జననీ అయ్యర్ అనే టైటిల్ కార్డులో రాసేవారన్నారు. తెగిడి చిత్రంలో జనని అని వేశారని చెప్పారు. ఈ విషయాన్ని చిత్ర ప్రివ్యూ ప్రదర్శనప్పుడు గమనించానన్నారు. చిత్రం విజయం సాధించడంతో తన పేరు వర్కౌట్ అయ్యిందనిపించిందన్నారు. దీంతో ఇకపై జననిగానే కొనసాగాలని భావించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. తమిళం నూతన చిత్రం ఏమీ కమిట్ కాలేదని నేమ్ మార్చుకున్న ముద్దుగుమ్మ జనని పేర్కొన్నారు.