లక్ష్మీ దేవి సమర్పణలో...
నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి’. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ, నరేశ్, ఆమని ముఖ్య తారలుగా జాకి అతిక్ దర్శకత్వంలో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ çసంస్థ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది.
ట్రైలర్, పాటలు బావున్నాయి. ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డిగారు రిచ్‌గా నిర్మించారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సీనియర్ నరేశ్. ‘‘హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించా. జాకీ ఈ చిత్రాన్ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు’’ అన్నారు కృష్ణ. నిర్మాత సీజే శోభారాణి, జనని, నటుడు గౌతంరాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, సహ నిర్మాత : సిరాజ్.